భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆత్మీయుడెవరో తనకోసమే వచ్చినట్టు అనిపించింది. తెలియకుండా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాడు. చేతులు చాస్తూ ‘యాసాయి’ అని పలికాడు. ఆ పలుకును వినగానే తాను ఎన్నో ఏళ లనుంచి ఎదురుచూస్తున్నట్టుగా ఆ పిలుపు కోసమే ఉన్నట్టుగా ఎంతో దూరంనుంచి వచ్చినట్లుగా ఆ రూపం కదలి ముందుకు వచ్చింది.
దీనినంతా చూస్తున్న ఆ పెళ్లి బృందానికి ఆహ్వానం పలకడానికి కూర్చున్న జనం అంతా ఒక్కసారిగా తమ పెన్నిధి ఏదో తమ దగ్గరకు వచ్చేసిందన్నట్లుగా సాయి అంటూ ఎంతో సంతోషంతో ముందుకు కదిలారు.
ఎలా తెలిసిందో కాని ఊరు ఊరంతా కదిలి వచ్చిందా అన్నట్లు జనం అందరూ గుమికూడి సాయిని తీసుకుని శిరిడీలో అడుగుపెట్టారు.
చిరునవ్వులు చిందిస్తూ వారి వెంట నడిచాడా సద్గురు సాయినాథుడు.
అప్పటిదాకా తమ కోసం ఆహ్వానాలు అనుకున్న చాంద్ పాటిల్ బంధువర్గం ఆశ్చర్యంగా ఆనందంగా ఈ సాయి వెంట అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయారు. పాటిల్ దీనినంతా చూస్తూ ‘‘ఓ ప్రభూ! నీవే గురువు! నీవే నా ప్రభువు! నీవే నా దైవం! నీవు నన్ను నడిపించడానికి నన్ను అనుగ్రహించడానికి నాకు తోడుగా నిలవడానికి వచ్చిన దైవానివి నీవే’’ అంటూ ఎన్నోసార్లు మనసులో సాయి సాయి అనుకుంటూ ముందుకు వెళుతున్నాడు. అంతకు ఆ సారుూశ్వరుణ్ణే ఫకీరు అని పిలిచాడు. తనకు తన గుఱ్ఱం దొరికేట్లు చేసిన ఫకీరుకు దైవశక్తి ఉందనుకున్నాడు. కాని నేడు చూచి దైవమే అతడని గుర్తించినట్లు బాబా అంటూ ముందుకు వెళ్లి సాయి పాదాలపై పడి మొక్కుకుని తిరిగి లేచి పెళ్లి వారింటికి వెళ్లాడు.
అలా వచ్చిన శిరిడీ సాయి నేడు ఒక్క శిరిడీలోనే కాదు ఊరూరు వాడ వాడలో ఇంటింటా నిలిచాడు. సృష్టి అంతా భగవంతుడు తప్ప అన్యం లేదు కదా అన్నట్లుగా ప్రతివారిలోనూ ముందో వెనుకో అసలు సాయి నామమే.
సద్గురువు మించిన దైవం లేదు. గురువు అనుగ్రహం ఉంటే చాలు స్వర్గద్వారాలు తెరిచే ఉంటాయి. అసలు ఇలనే స్వర్గం అవుతుంది.
***
శిరిడీ మసీదులో బాబా కూర్చుని ఉన్నాడు. ఆయన ఎదురుగా ముసలివారు, పడుచువారు కూర్చుని ఉన్నారు. పిల్లలేమో అది పిల్లలాడుకునే మైదానంలాగా అక్కడే ఆడుకుంటున్నారు. స్ర్తిలేమో ఉబుసుపోక కూర్చుని కబుర్లాడుకునే చావిడిలాగా సాయికి కాస్త దగ్గరలో కూర్చుని ఊసులాడుకుంటున్నారు.
సాయి ఇక్కడే ఉన్నాడు. కాని ఎక్కడో చూస్తున్నట్లు ఆయన చూపులు మరెక్కడో ఉన్నాయి.
తాత్యాసాహెబ్, శ్రీమతి తార్కాడ్, హేమాదిపంత్, జహ్వర్ అలీ, మొయినుద్దీన్ తంబూలీ, బయాజాబాయి, లక్ష్మీబాయి- ఇలా మసీదు నిండుగా కూర్చుని ఉన్నారు.
అంతలో ఎక్కడినుంచో ఓ భక్తుడు గబగబా వచ్చాడు. వస్తూనే తప్పుకోండి తప్పుకోండి నేను బాబా దర్శనం చేసుకోవాలి. జరగండి జరగండి అంటూ అరుస్తూ వస్తూనే ఉన్నాడు. అక్కడ ఎవరూ అడ్డంగా లేకపోయినా సాయినాథుడు ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాడు.
ఆయన్ని అందరూ వింతగా చూశారు. ఏమిటి వీని గాబరా అన్నట్లుగా వీని వెనుక ఎవరైనా వస్తున్నారా అంటూ వస్తున్న ఆయన వెనుక వైపుకు తమ తలలు తిప్పి చూస్తున్నారు.
అయినా ఆ భక్తుడు మాత్రం కదలండి ముందుకు కదలండి... ఇంకా బాగా కదలండి చాలామంది వస్తున్నారు. పదండి పదండి అని అదేపనిగా అంటూ తాను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాడు. చేతులతో జనాలను దూరం చేస్తున్నట్లు చేతులు అటు ఇటూ జరుపుతున్నాడు.
వీనికేమైనా పిచ్చిపట్టిందా అన్నట్లు అక్కడే ఉన్న లక్ష్మీబాయి ‘‘ఓ బాబు ఏమిటి సంగతి.. ఇక్కడ ఎవరు ఉన్నారు. నీవు ఏం చేస్తున్నావు.. ఎవరిని పక్కకు జరుగు జరుగు అంటున్నావు. నీ చెమటలు ఏమిటి.. ఇంతకీ నీవు ఎవరు?’’ అని అడిగింది.
అంతా చూస్తూ బాబా చిరునవ్వు నవ్వుతున్నారు.
ఆ భక్తుడు పరుగెత్తుకు వెళ్లి బాబా పాదాలపై పడి పాహిమాం పాహిమాం పాహి పాహి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ.. బాబా నీవే కాపాడాలి అంటున్నాడు.
బాబా తన చేతిలోని సటకాను ఆ వ్యక్తి వీపుపైన ఆడిస్తూ ‘‘లే లే! చూడు నేనే నీవాడినే నీ దగ్గరే ఉంటున్నాను. నీవూ నా దగ్గరే ఉంటున్నావు.. చూడు చూడు’’ అన్నాడు.
అతడు కనుల నీరు కారుతుండగా పెదవులు అదురుతుండగా బాబా తప్ప మరేమీ పలుకకుండా బాబానే తదేకంగా చూస్తున్నాడు.
లక్ష్మీబాయి ‘‘బాబా ఇతనికేమయింది.. ఎందుకిలా చేస్తున్నాడు’’ అడిగింది. అక్కడ ఉన్న అందరూ అవును బాబా ఇతనికేమయింది. ఎందుకలా ఏడుస్తున్నాడు అని అడిగారు.
-ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743