మెదక్

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయంపేట: సర్దార్ సర్వాయి పాపన్న 367వ జయంతి వేడుకలను గౌడ సంఘం నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రేణుకామాత దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్బంగా జిల్లా అద్యక్షులు పల్లె రాంచందర్‌గౌడ్, పట్టణ అద్యక్షులు పల్లె శ్రీనివాస్‌గౌడ్‌లు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ ప్రాంతానికి చేసిన సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రదాన కార్యదర్శి స్వామిగౌడ్, ఈశ్వర్‌గౌడ్, వెంకట్‌గౌడ్, సత్యనారాయణగౌడ్, రాజాగౌడ్, రామాగౌడ్, సిద్దాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎల్లాగౌడ్, నగేష్‌గౌడ్, శంకర్‌గౌడ్, శ్రావణ్‌గౌడ్‌లతోపాటు తదితరులు ఉన్నారు.
కౌడిపల్లిలో...
కౌడిపల్లి: మండల కేంద్రమైన కౌడిపల్లితో పాటు, తిమ్మాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367 జయంతి వేడుకలను గౌడసంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లిలోని మల్లన్న స్వామి ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యాక్రమంలో గౌడజన సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు చంద్రం క్రిష్ణగౌడ్, గౌడ జన సంఘం తాలుకా అధ్యక్షులు సార రామాగౌడ్, మండల ఎంపిటిసిల ఫోరం ఛైర్మెన్ శంకర్‌గౌడ్, పుండరీకంగౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, శాఖాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, దుర్గాగౌడ్, సత్యాగౌడ్, పెంటాగౌడ్, నర్సింలుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో...
మండల పరిధిలోని తిమ్మాపూర్‌లో శుక్రవారం నాడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 367 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జడ్పీటీసీ సభ్యురాలు యాదమ్మరామాగౌడ్, సర్పంచ్ స్వప్నకిషోర్, మండల సర్పంచుల పోరం అధ్యక్షులు శంకర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ సభ్యులు సార రామాగౌడ్, కిషోర్, గ్రామానికి చెందిన పలువురు గౌడకులస్తులు పాల్గొన్నారు.