మెదక్

డబుల్ బెడ్‌రూం ఇళ్లకు అవసరమైన స్థలాలను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: జిల్లాకు రెండు విడతలుగా మంజూరైన డబుల్ బెడ్ రూం ఇళ్లకు అవసరమైన స్థలాన్ని వెంటనే హౌసింగ్ పిడికి స్వాధీనం చేయాలని కలెక్టర్ మానిక్కరాజ్ కణ్ణన్ తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, తహశీల్దార్లతో వివిధ అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత డబుల్ బెడ్‌రూం ఇళ్లకు అవసరమైన స్థలాన్ని స్వాధీనం చేసింది లేనిది ఆరా తీయగా మొదటి విడత ఇళ్లకు గుర్తించిన స్థలాన్ని స్వాధీనం చేసామని, రెండవ విడత డబుల్ బెడ్‌రూం ఇళ్లకు స్థలాలను గుర్తించామని, మరికొన్ని స్థలాలు గుర్తించాల్సి ఉందని ఆయా మండల తహశీల్దార్లు తెలిపారు. త్వరితగతిన మిగిలిన స్థలాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అటోమెటిక్ ఇన్‌క్లుజన్ డాటా జాబితాల మేరకు ఈ నెల 22న అన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను గుర్తించాలన్నారు. గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు ముందుగానే టాంటాం చేయించాలన్నారు. ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటిని తీసుకోవాలని, అర్హులకు ప్రాధాన్యత మేరకు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రెండు విడతలలో మంజూరైన డబుల్ బెడ్‌రూంలపై సర్వేను ఈ నెల 31లోపు పూర్తి చేయాలని తెలిపారు. అర్హులకు లబ్ది చేకూర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని హితవుపలికారు.
గ్రామ సభలలో గృహ నిర్మాణ శాఖ ఇచ్చిన జాబితాలను పరిశీలించాలన్నారు. గ్రామ సభలకు సంబంధించి శాసన సభ్యులకు తెలియజేయాలన్నారు. అర్హులందరిని దరఖాస్తు చేసుకోమని చైతన్య పర్చాలన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో ఏ గ్రామంలో స్థలం అందుబాటులో లేదా ఆ విషయాన్ని ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లి మరో గ్రామానికి మార్చేలా లేదా అదే గ్రామంలో దాతలు భూమిని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను నారాయణఖేడ్, సిర్గాపూర్, వాసర్, కంగ్టి, రామ్‌తీర్థ, సదాశివపేట తదితర బైపాస్ రోడ్ల పురోగతిపై కలెక్టర్ ప్రశ్నించగా పలు చోట్ల భూమికి సంబంధించి రెవెన్యూ వారి వద్ద పెండింగ్‌లో ఉందని స్పష్టం చేసారు. ఆయా మండల తహశీల్దార్లు సంబంధిత భూమి సర్వే పూర్తి చేసి నోటిఫికేషన్ ఇచ్చి ఆయా రైతులతో మాట్లాడి సమ్మతి తీసుకోవాలని, త్వరితగతిన పనులు పూర్తయ్యేందుకు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్మిస్తున్న ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల నిర్మాణాలకు భూమిని కేటాయించాలని బిసి సంక్షేమాధికారి ఆశన్నను కోరగా అవసరమైన స్థలాన్ని గుర్తించి సంబంధిత శాఖకు స్వాధీనం చేయాలని సూచించారు. అదే విధంగా గిరిజన భవనానికి సంగారెడ్డి గిరిజన హాస్టల్ పరిధిలో ఉన్న మిగిలిన స్థలాన్ని గిరిజన భవనానికి ఇవ్వాలని సూచించారు. సదాశివపేట సిడిపిఓ కార్యాలయానికి స్థలం కావాలని ప్రతిపాదనలు పంపామని జిల్లా సంక్షేమాధికారి మోతి కలెక్టర్‌కు తెలుపగా సదాశివపేటలో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ వారి కార్యాలయానికి స్థలాన్ని ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ అధికారి శైలజ రైతు సమావేశ మందిరాలకు స్థలాలను కేటాయించాలని కోరగా సంబంధిత ఎఇఓలు తహశీల్దార్లను కలిసి ఎక్కడెక్కడ రైతు సమావేశ మందిరాలకు స్థలాలు కావాలో తెలిపితే స్థలాలు తహశీల్దార్లు గుర్తిస్తారన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి రఘురాంశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ జితేష్ వి పాటిల్, హౌజింగ్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, గిరిజన సంక్షేమాధికారి మాణెమ్మ, ఎస్సీ కార్పోరేషన్ ఇడి శ్రీ్ధర్, ఆర్ అండ్ బి ఇఇ వెంకటేశ్వర్లు, ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్లు పాల్గొన్నారు.