విశాఖ

ఇక ‘స్మార్ట్’ కలెక్టరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: స్మార్ట్‌సిటీగా రూపుదిద్దుకుంటున్న విశాఖ నగరంలో కలెక్టరేట్ కూడా అంతే స్మార్ట్‌గా ఉండాలని, అందుకోసం కలెక్టరేట్ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో అభివృద్ధి పరచిన పార్క్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టరేట్ వెనుక ఖాళీ స్థలంలో కొత్తగా సమావేశ మందిరంతో పాటు సువిశాల కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో భూగర్భ డ్రెయిన్లు ఏర్పాటుతో పాటు లిఫ్ట్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు సేదతీరే విధంగా కలెక్టరేట్‌లో పార్కును రూ.10 లక్షల వ్యయంతో అందంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) జివిఎంసి సహకారంతో పార్కును అందంగా తీర్చిదిద్దామన్నారు. అలాగే కలెక్టరేట్‌లో సందర్శకుల సదుపాయం కోసం టాయిలెట్లు నిర్మించామన్నారు. కార్యక్రమంలో వుడా విసి బసంత్ కుమార్, డిఆర్‌ఓ చంద్రశేఖర రెడ్డి, సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తద ఇతరులు పాల్గొన్నారు.