విశాఖ

నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు నిర్ధేశిత కాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎంపిడిఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఇజిఎస్ కన్వర్జెన్స్ పనులను పూర్తి చేయడంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, సిసి రోడ్లుతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అంగన్‌వాడీ భవనాల నిర్మాణం పూర్తి కావాలన్నారు. పంచాయతీ భవనాలతో పాటు సిసి రోడ్ల నిర్మాణ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని మండలాల్లోను లక్ష్యాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వచ్చే వారం నాటికి పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పిడి కల్యాణ చక్రవర్తి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ వేణుగోపాల్, డిఎఫ్‌ఓ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.