విశాఖపట్నం

చరిత్రకు దర్పణం..్ఛయాచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: అందరి జీవితాల్లోనూ అనేక మధురానుభూతులు ఉంటాయి. అప్పుడప్పుడు అవి మదిలోకి అలా..అలా వచ్చి కరిగిపోతుంటాయి. మనసులో చెరగని ముద్రవేసిన మధుర జ్ఞాపకాలను కళ్లముందుంటే ఎంత బాగుంటుందని మనసు తహతహలాడుతుంది. ఎవ్వరికోకాని అది సాధ్యం కాదు. మన జీవితంలో సుమధుర సన్నివేశాలు, ఘట్టాలు, మనసు దోచే అనేక సంఘటనలు మన కళ్ళముందు సాక్షాత్కరింప చేసే శక్తి ఒక్క ఛాయాచిత్రానికి మాత్రమే ఉంది. మన మనసుకు నచ్చిన వారు దూరమైనా, వారి జ్ఞాపకాలెప్పుడూ మనతోనే ఉండేలా చేసేది ఫొటో మాత్రమే. ఒక ఫొటో ఎన్నో భావాలను వ్యక్తపరుస్తుంది. ఒక చిత్రం ఎన్నో అర్థాలను తెలియచేస్తుంది. సృజనాత్మకత అద్దంపట్టేలా, ఆలోచనలను చిగురింప చేసేందుకు ఫొటోగ్రఫీ ఉపయోగపడుతుంది. ఒక భావాన్ని వ్యక్తపరచడానికి వేల పదాలు అవసరం లేదు. ఒక్క ఫొటో చాలు. మదిలో మెదిలే తీపి గురుతుల నిలయంగా మారుతూ, ఎప్పటికీ చెదిరిపోని కలగా మిగిలేది ఫొటోగ్రఫీ. ఫొటో మనిషిని గతంలోకి తీసుకువెళ్లి, మనసును నిద్రలేపుతుంది. మనసులో గూడుకట్టుకున్న అనుభూతులను కదిలిస్తుంది. అలనాటి మధుర స్మృతులు, మరచిపోలేని సంఘటనలు గుర్తుకు తెచ్చేవి కేవలం ఫొటోలు మాత్రమే. పాతకాలం నాటి ఫొటోగ్రఫీ నుంచి, నేటి సెల్ఫీలవరకూ ఏవైనా సరే జీవితంలో తీపి గురుతులను ఇట్టే బంధిచేస్తాయి. ఫొటో ఆనందానికి, ఆహ్లాదానికి నిలువెత్తు నిదర్శనం. మధుర జ్ఞాపకాలను భద్రంగా మదిలో ఫొటోల ద్వారా దాచుకోగలం. వాటిని చూసినప్పుడల్లా గతం గుర్తుకువచ్చి, మురిసిపోతాం. కాలగర్భంలో కలిసిపోయిన అనేక ఘట్టాలకు అప్పుడు గుర్తుకు తెచ్చేందుకు ఫొటోలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో అనేక వింతలు, విశేషాలు, అపూర్వ ఘట్టాలు ఇప్పటికీ మనం గుర్తుంచుకోడానికి అక్షర రూపంలో ఉన్న చరిత్ర కొంత వరకూ కారణమైనా, వందల సంవత్సరాల కిందట మన పాలకులు, అప్పటి కాలమాన పరిస్థితులను కళ్ళకు కట్టేలా చూపించేది ఒక్క ఫొటో మాత్రమే. అటువంటి ఫొటోగ్రఫీలో ఆరితేరిన వారు ఎంతో మంది ఉన్నారు. ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు భిన్నమైన కెమేరాలతో చిత్రమైన ఫోటోలు తీస్తూ మురిసిపోతున్నారు.
సుమారు మూడు దశాబ్దాల కిందట అంతంతమాత్రంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన కెమేరాలతో ఫొటోలు తీసేవారు. బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్‌లు అప్పట్లో వాడుకలో ఉండేవి. వాటిని డార్క్‌రూంలో డవలప్ చేసి విభిన్నమైన సైజుల్లో ప్రింట్‌లు వేసేవారు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. అలనాడు ఫొటోగ్రఫీలో కఠోరమైన శిక్షణ తీసుకుని, వారికున్న అనుభవాన్ని అంతా రంగరించి, డవలప్ చేసిన ఛాయా చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ తరువాత కలర్ ఫిల్మ్‌లు వచ్చాయి. కలర్ ఫిల్మ్‌లు దాదాపూ రెండు దశాబ్దాలు రాజ్యమేలాయి. ఎప్పుడైతే డిజిటల్ కెమేరాలు మార్కెట్‌లోకి అడుగుపెట్టాయో, ఫిల్మ్ కెమేరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కెమేరాల్లో ఆధునికత ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఫొటోగ్రఫీపై ఏమాత్రం అవగాహన లేని వారు కూడా ఇట్టే ఫొటోలు తీయగలిగే సాంకేతికతతో కూడిన కెమేరాలు ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్నాయి. తాజాగా సెల్‌ఫోన్‌లలోనే అధిక పిక్సల్స్ కలిగిన కెమేరాలు రావడంతో సెల్ఫీలతో యువత సందడి చేస్తోంది. కాగా, రక్షణ రంగంలో కెమేరాల అవసరం పెరిగింది. అలాగే, సిసి కెమేరాలు నేరగాళ్లను పట్టించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇంతటి చరిత్ర కలిగిన ఫొటోగ్రఫీకి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని భావించారు. అదే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.
ఇదీ ఫొటోగ్రఫీ దినోత్సవం వెనుక కథ
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం వెనుక ఒక కథ ఉంది. 1837లో లూరుూస్‌డాగూర్, జోసఫనిఫ్సీ కలిసి డాగూర్‌టైప్ ఫొటోగ్రఫీని కనుగొన్నారు. 1839 జనవరి తొమ్మిదవ తేదీన ఫ్రెంచ్ సైన్స్ అకాడమీ ఈ ఫొటోగ్రఫీని వెలుగులోకి తీసుకువచ్చింది. 1939 ఆగస్టు 19న ఫ్రెంచ్ ప్రభుత్వం దీనిపై పేటెంట్ హక్కులు తీసుకుని, ఈ ఫొటోగ్రఫీని ప్రపంచానికి అంకితం చేసింది. దీంతో ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటో దినోత్సవంగా ప్రకటించారు. డాగూర్‌టైప్ ఫొటోగ్రఫీ మొట్టమొదటి ప్రాక్టికల్ ఫొటోగ్రఫీ ప్రోసెస్. డాగూర్ మొట్టమొదటిసారిగా ఒక ఫొటో ఇమేజ్‌ను సృష్టించాడు.
2009లో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ కోర్క్స్‌కే ఎరా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించడానికి పునాది వేశారు. మొట్టమొదటిసారిగా ప్రపంచ ఫొటొగ్రఫీ దినోత్సవం 2010లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 250 మంది ఫొటోగ్రాఫర్లు మాత్రమే ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో అన్ని దేశాలవారు పాల్గొనాలన్న ఉద్దేశంతో కోర్క్స్‌కే తన కెమేరా కిట్‌ను విక్రయించి, ఆ మొత్తాన్ని ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించాడు. 2016లో జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల మంది పాల్గొన్నారు. ఫొటోగ్రఫీలో వారి వారి అనుభవాలను ఈ సందర్భంగా వ్యక్తపరచుకున్నారు. ఈ ఏడాది ఎనిమిదవ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం జరుపుకొంటున్నారు.