కృష్ణ

అంబేద్కర్ చిత్ర యూనిట్స్‌కు అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ నిర్మించిన అంబేద్కర్ డైలీ సీరియల్‌కు ప్రజల నుండి విశేష స్పందన కనిపిస్తున్నది. దూరదర్శన్ సప్తగిరి చానల్లో ప్రతిరోజు ప్రసారం అవుతున్న అంబేద్కర్ డైలీ సీరియల్‌ను లక్షలాది మంది వీక్షించటం విశేషం. బుల్లితెరకు చెందిన సీనియర్ నటీనటులతోపాటు పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాత్రలోనూ, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు లాలాలజపతిరాయ్, నందిగామ ఎమ్మెల్యే సౌమ్య భగత్‌సింగ్‌తో పాటు విద్యార్థి నాయకురాలైన ప్రీతిలత వాడేవారే పాత్రలోనూ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేట్ చైర్మన్ వర్ల రామయ్య అంతిమ దశలో అంబేద్కర్ పాత్రల్లోనూ నటించారు. ఇప్పటివరకు ఏ సినిమాలోగాని, టీవీ సీరియల్లో గాని ఇంతమంది ప్రజాప్రతినిధులు నటించలేదనేది సత్యం. అయితే ఇలాంటి సాహస ప్రయత్నాన్ని చేపట్టి విజయవంతంగా తెరకెక్కించిన ఘనత దర్శకుడు, కేంద్ర సెన్సార్‌బోర్డు సభ్యుడు దిలీప్ రాజాకే దక్కుతుంది. మూడు దశాబ్దాలుగా దర్శకుడిగా తనకున్న సీనియార్టీతో అంబేద్కర్ జీవిత చరిత్రన భావితరాలకు గుర్తుండిపోయేలా దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇప్పటికే 90 ఎపిసోడ్లు ప్రసారం అయిన అంబేద్కర్ సీరియల్ 100 భాగాలతో ముగుస్తుందని దర్శకుడు దిలీప్‌రాజా శుక్రవారం నాడిక్కడ విజయవాడలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన షూటింగ్ విశేషాలను విలేఖరులకు తెలిపారు.