ప్రకాశం

గుండ్లకమ్మ, కొరిశపాడు ఎత్తిపోతల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: జిల్లాలోని గుండ్లకమ్మ జలాయశం, కొరిశపాడు ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్, జెసి నాగలక్ష్మి మద్దిపాడు, కొరిశపాడు మండలాల్లో పర్యటించి కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ జలాశాయం, యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. తొలుత వారు గుండ్లకమ్మ జలాశాయం కట్టపై పర్యటించారు. కుడి, ఎడమ వైపుల ఉన్న నది రెగ్యూలేటర్లు, కాల్వలు,ప్రధానకాల్వ గేట్లను తనిఖీచేశారు. వారు ప్రాజెక్టు కార్యాలయంలో పైభాగం వరకు వెళ్ళి చుట్టుపక్కల పరిశీలించారు. ప్రధాన కాల్వకు ఇరువైపుల ఉన్న పార్కును పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ రాష్టమ్రుఖ్యమంత్రి జిల్లాకు సెప్టెంబర్‌నెలలో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టుకు ,పార్కుకుమంచిగా రంగులు వేయించి వారంరోజుల్లో సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. కుడివైపు హెడ్‌రెగ్యూలేటర్ బోర్డుకు రంగులు వేయించి జలాశాయం వివరాలు పొందుపర్చాలని సూచించారు. అలాగే జలాశాయం పక్కన ఉన్న పౌంటేన్ పార్కును కూడా ఆకర్షణీయంగా తయారుచేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులో భాగంగా మిగిలిపోయిన 57.88ఎకరాల భూమిని త్వరితగతిన సేకరించే దిశగా సంబంధిత రైతులతో మాట్లాడి ముంపుకు గురౌతున్న గ్రామాల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుకు పునరావాస కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జలాశాయం కట్టపై ఉన్న పిచ్చిమొక్కలు,పొదలను వెంటనే తొలగించి శుభ్రంగా ఉంచాలన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్లు,కొరిశపాడు ఎత్తిపోతల పధకం తెలియచేసే చిత్రపటాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎగువున గుండ్ల బ్రహ్మేశ్వరం రిజర్వాయరు నిర్మాణంవలన కంభం చెరువుకునీరు రావటం లేదని అక్కడి రైతులు,ప్రజలు చెప్పారని వారి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ ప్రాజెక్టుల ఎస్‌ఇ రెడ్డయ్యకు సూచించారు. అనంతరం వెంకటేశ్వరస్వామి దేవస్ధానాన్ని సందర్శించి ప్రత్యేకపూజలను నిర్వహించారు.
అనంతరం కొరిశపాడు మండలం తమ్మవరం వద్ద ఎత్తిపోతల పధకంలో నిర్మించిన పంప్‌హౌస్‌ను, ఫీడర్ మోటార్లను కలెక్టర్, జెసిలు తనిఖీచేశారు. ఈసందర్బంగా ఎత్తిపోతల పధకం ఇఇ భూషణబాబు మాట్లాడుతూ పంప్‌హౌస్‌లో మూడు పంపులు పనిచేయాలని, 165క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తుందని 11కిలోమీటర్లు ప్రయాణించి కొరిశపాడు జలాశాయానికి చేరుకుంటుందని కలెక్టర్‌కు వివరించారు. ఆప్‌టేక్ స్లూయిస్ నిర్మించటం జరుగుతుందని భూసేకరణ సమస్యవలన కొంత జలాశాయం కట్టనిర్మాణం పెంచే అవకాశం ఉందని ఇఇ వివరించారు. అనంతరం కలెక్టర్ కొరిశపాడు మండల కేంద్రాన్ని సందర్శించి అక్కడి పైపుతూమును పరిశీలించారు. అనంతరం కొరిశపాడులో అసంపూర్తిగానిలిచిపోయిన జలాశాయాన్ని వారు పరిశీలించారు. ఈసందర్బంగా అక్కడికి వచ్చిన తూర్పుపాలెం రైతు రాఘవరెడ్డితదితరులు మాట్లాడుతూ తాముపాత చెరువుకింద ఆయకట్టు రైతులమని తమకు పంట నష్టపరిహారం చెల్లించి పునారాసం కల్పిస్తే వెళ్తామన్నారు. బొల్లవరంపాడు గ్రామానికి చెందిన రైతు కరణం సుబ్బయ్యమాట్లాడుతూతమకు అధికంగా నష్టపరిహారం చెల్లిస్తే 345ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కోర్టుకేసు కూడా వాపసుతీసుకుంటామని కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కొరిశపాడు, తూర్పుపాలెం రైతులు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద మూడుసంవత్సరాల నష్టపరిహారం తీసుకుని భూములు ప్రభుత్వానికి అప్పగించాలన్నారు. అలాగే ఏకరానికి 12లక్షలరూపాయలు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఉన్నతాదికారులు అందుకు అంగీకరిస్తూ త్వరలో జివో విడుదల చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం 28ప్రాజెక్టులను ప్రాధాన్యతపరంగా తీసుకుని సత్వరమే పూర్తిచేసేందుకు నిధులను వేగంగా కేటాయిస్తుందని రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం చెల్లిస్తామని ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కలెక్టర్ రైతులను కోరారు. ఈ పర్యటనలో ఆర్‌డిఒ శ్రీనివాసరావు, ప్రాజెక్టుల ఎస్‌ఇ రెడ్డయ్య,నీటిపారుదలశాఖ ఎస్‌ఇ వెంకటరమణ, ఎస్‌డిసి ఉదయభాస్కర్, ప్రాజెక్టుల డిఇ సంగీత, ఏఇ కిరణ్, ఎత్తిపోతల పధకం ఇఇ భూషణబాబు తదితర అధికారులు, రైతులు పాల్గొన్నారు.