ప్రకాశం

పనిచేయని బోరుబావులను తక్షణమే మూసి వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు : జిల్లాలో పని చేయని బోరు బావులను గుర్తించి తక్షణమే వాటిని మూసి వేయాలని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ ఆర్డీవోలను ఆదేశించారు. తెరిచి ఉన్న బోరు బావుల వలన చిన్న చిన్న పిల్లలు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. అందులో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఆర్డీవో లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఎక్కడెక్కడా పని చేయని బోరు బావులు తెరిచి ఉండరాదని, వాటిని వెంటనే గుర్తించి తక్షణమే మూతలతో మూసి వేయాలని ఆదేశించారు. ఇందు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మూసి వేయించాలని, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తహశీల్థార్లను అప్రమత్తం చేయాలని ఆయన ఆర్డీవో లను ఆదేశించారు. ప్రతిరోజూ సాయంత్రం ఆర్డీవోలు డిఆర్‌వోకు నివేదికలు అందజేయాలని, డి ఆర్‌వో సంయుక్త కలెక్టర్ కు సమర్పించాలని వాటిని సంయుక్త కలెక్టర్ పర్యవేక్షిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల నుండి సమాచారం సేకరించేందుకు కలెక్టరేట్‌లో 1077 టోల్ ప్రీ నెంబర్ తో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సాయంత్రం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు , మండల , నియోజక వర్గ ప్రత్యేక అధికారులతో వివిధ కార్పోరేషన్ల పరిధిలో యూనిట్ల గ్రౌండింగ్ అంశం పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, కాపు కార్పోరేషన్ల ద్వారా మంజూరు అయిన యూనిట్లు వెంటనే గ్రౌండింగ్ చేపట్టేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.