ప్రకాశం

ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు వివరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం: ప్రతి ఇంటి తలుపు తడతా.. ప్రభుత్వ పథకాలు వివరిస్తా.. పథకాలు అందనివారు ఎవరైనా ఉంటే వారికి అందేలా చర్యలు చేపడతానని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ త్వరలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేదప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, ఈ పథకాలు ఎవరికి అందాయి, అందనివారు ఎవరు, వారికి ఎలా అందించాలన్నదే ఈ ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజలు ఇప్పటివరకు ఇచ్చిన సహకారానికి తాను ఎంతో రుణపడి ఉంటానని, తాను ఎమ్మెల్యేగా లేనప్పటికీ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరించి అభిమానిస్తే ఇంకా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రతి మండలంలో వారంరోజుల పాటు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో సిమెంటురోడ్లు, చెక్‌డ్యాంలు నిర్మాణంతోపాటు ఏరియా వైద్యశాల అభివృద్ధి చేయడమే కాక 100 పడకల వైద్యశాలను 300 పడకల వైద్యశాలగా మారుస్తూ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకువచ్చినట్లు, అలాగే వైద్యశాల ఆవరణలో హోమియో వైద్యశాల శాశ్వత భవన నిర్మాణానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురం చెరువును మినీ ట్యాంకుబండ్‌గా మార్చే విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్నానని, త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలిపారు. మార్కాపురం పట్టణానికి శాశ్వత నీటి పరిష్కారం కోసం దూపాడు నుంచి రెండవ లైను వేసేందుకు 10కోట్ల రూపాయలు, అంతర్గత పైపులైన్లు వేసేందుకు 10కోట్ల రూపాయలు తీసుకువచ్చినట్లు తెలిపారు. శిథిలావస్థకు చేరిన కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం 4కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. పట్టణంలో నీటిపైపుల నిర్మాణం పూర్తికాగానే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులన్నీ నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని మరో 18నెలలు ఎన్నికలకు సమయం ఉన్నందున అన్నివర్గాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.