కర్నూల్

వెలవెలబోతున్న గాజులదినె్న ప్రాజెక్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు: కరవుతో ఇటు రైతులు అటు ప్రజలు అల్లాడి పోతున్నారు. మునుపెన్నడూ లేనంతగా తీవ్ర వర్షాబావ పరిస్థితులు తలెత్తాయి. కురవని వానలకు సాగు నిల్చి పోగా, అరకొరగా కురిసిన వానలకు వేసిన పంటలు అన్నీ ఎండి పోయాయి. కనీసం ఈ ఏడాది రెండో పంటకు కూడా రైతులు సాగు చేసుకోలేని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఏర్పడటంతో అన్నదాతకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఇలాంటి కరవు పరిస్థితులను ఎదుర్కోలేని అన్నదాత విలవిల్లాడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు మూడు నెలల కాలం దాటుతున్నా కనీస వర్షాపాతం కూడా నమోదు కాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న వాగులు, గుంతలు, వంకలల్లో నీటి జాడలే లేవు. ఇంతటి సంక్షోభం మునుపెన్నడూ తలెత్తలేదని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సాగు అంతంతమాత్రంగా సాగు చేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. అంతంత మాత్రంగా రైతులు బావులు, బోర్లు కింద సాగు చేసిన పంటలు కూడా ఆశించిన మేరకు దిగుబడులు రావడం లేదు. ఈ ఏడాది వర్షాదారం సాగు ప్రశ్నార్థకమే అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితులతో ఒక వైపు రైతులు అల్లాడుతుండగా మరో వైపు ప్రజలకు తాగు నీటి సమస్య రోజు రోజుకి తీవ్రమవుతోంది. కోడుమూరు, పత్తికొండ, డోన్, ప్రాంతాల వాసులకు సాగుతో పాటు తాగు నీటి సౌకర్యాలు కల్పించే గాజులదినె్న ప్రాజెక్టులో నేడు నీరులేక వెల వెలబోయింది. గత ఏడాది జూన్ నెలలోనే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలోనీటి సామర్థ్యంతో నిలవ చేరింది. కానీ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ఇంతవరకు వానలు కురువలేదు. దీంతో ప్రాజెక్టులో నీటి నిలలు అడుగంటి పోయాయి. వానలు కురిస్తే గాజులదినె్న ప్రాజెక్టులో నీరు చేరి తమ దాహం తీరుతుందని ఆశించిన కోడుమూరు ప్రజలకు మళ్లీ తాగు నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితులు ఏర్పడనున్నాయి. గత మూడు నెలల నుంచి ఇటు రైతులు, అటు ప్రజలు వానల కోసం పూజలు, భజనలు, జలాభిషేకాలు చేసినా వరుణదేవుడు కరుణ చూపలేదు. దీంతో కోడుమూరు ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు మళ్లీ మొదటకు వచ్చాయి. ఇక్కడి ప్రజలకు తాగు నీటిని హంద్రీ నది నుంచి సరఫరా చేయాల్సి ఉంది. ఈ హంద్రీ నదికి గాజులదినె్న ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లిస్తే తప్పా ప్రజల దాహం తీరదు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నమయ్యే పరిస్థితులు తలెత్తున్నడంతో ఈ సారి ప్రజల దాహార్తిపై పంచాయతీ పాలక వర్గానికి గుదిబండలా మారడం తప్పడం లేదని తెలుస్తోంది.