కర్నూల్

ఆరోగ్యశ్రీ పథకానికి సిఎం తూట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ పేదలకు అందని విధంగా చేస్తున్నాడని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిప్పులుగక్కారు. శుక్రవారం నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ సాయిబాబానగర్, దేవనగర్, విసి కాలనీలలో ప్రజలతో మమేకమై వారిని పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. అనంతరం విసి కాలనీలోని నూర్ మదాని మసీదు వద్ద ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ నంద్యాలను నందనవనం చేస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి మూడన్నరేళ్ళ కాలంలో ఏ రోజు కూడా నంద్యాల అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయని నంద్యాల అభివృద్ధి గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేదల ఆరోగ్యం బాగుండాలని ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగారుస్తూ పేదలకు వైద్యం దూరం చేస్తున్నారని విమర్శించారు. ఏడాది లోపు మూగ, చెవిటి పిల్లలకు మాత్రమే ఆపరేషన్లు చేస్తామంటున్నారు. చిన్నారులకు వారు ఏలోపంతో బాధపడుతున్నారని గుర్తించడమే కష్టం అలాంటిది రెండు మూడు నెలల తరువాత రావాలని వెనక్కి పంపుతుండడం దురదృష్టకరమన్నారు. క్యాన్సర్ పేషెంట్లకు నెలకు 7,8సార్లు కీమోథెరపీ అవసరం కాగా రెండు సార్లు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. అంతలోపే వారు మృత్యువాత పడుతున్నారు. కిడ్నీ రోగులు డయాలసిస్ కోసం వెళ్తే సంవత్సరం తరువాత రమ్మంటున్నారు. ఇదేనా చంద్రబాబు పాలన అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ పేదలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 108 అత్యవసర ఫోన్‌కు చేస్తే వాహనానికి డీజిల్ లేదనో, జీతాలు కోసం డ్రైవర్లు సమ్మె చేస్తున్నారని సమాధానం వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది ఈరోజు నంద్యాలను నందనవనం చేస్తామంటే నమ్ముతారా అని అన్నారు. గడిచిన మూడేన్నరేళ్ళల్లో ఒక్కసారైనా మంత్రులు నంద్యాలకు వచ్చారా అన్నారు. ఉప ఎన్నిక వచ్చేసరికి వాళ్ళకు ప్రజలు గుర్తొచ్చారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. నంద్యాలలో మీరు వేసే ఓటు చంద్రబాబు దుర్మార్గ పాలనకు చెంపపెట్టులాంటిదని, న్యాయానికి, ధర్మానికి ఓటు వేయండన్నారు. నంద్యాల అభివృద్ధి నాదని ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని ప్రజలతో పేర్కొన్నారు. రోడ్ షోలో అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి, కౌన్సిలర్ జాకీర్ హుశేన్ ఉన్నారు.