గుంటూరు

అన్నదాత... అప్పుల కోసం ఎదురీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు: కాపును, కోడిపెట్టను కాల్చుకు తింటేగానీ రుచి ఉండదనేది సామెత. ఇక్కడ కాపు అంటే రైతు అని అర్ధం. రెండు దశాబ్దాల వ్యవసాయరంగంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతు అడుగడుగునా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాడు. ఎన్నడూ చేయిచాచి అడుగని అన్నదాత నేడు అప్పుల కోసం అర్రులు చాస్తున్నాడు. జిల్లా ధాన్యాగారంగా పేర్గాంచిన కృష్ణా పశ్చిమ డెల్టాలో ప్రధాన మేజర్ ఛానల్స్‌గా ఉన్న కొమ్మమూరు, అప్పాపురం ఛానల్ ఆయకట్టు కింద చేబ్రోలు మండలంలో గత 10 రోజులుగా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఓ వైపు వ్యవసాయ పనుల్లో తలమునకలవుతూనే, మరోవైపు అప్పుల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకులు మాత్రం కేవలం రైతుమిత్ర గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. రైతుమిత్ర గ్రూపులకు కూడా చేబ్రోలులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు మాత్రమే రుణాలు ఇస్తోందని, మిగతా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు చెప్తున్నారు. రుణ అర్హత కోసం కౌలురైతుల కార్డులు ఉన్నప్పటికీ బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 80 శాతం మంది కౌలురైతులే వ్యవసాయం చేస్తుండగా పెట్టుబడుల కోసం అప్పులు పుట్టక ధాన్యం వ్యాపారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఈ ఏడాది ఎక్కువ మంది వెద పద్ధతిలోనే వరిసాగు చేశారు. అక్కడక్కడా కొంతమంది రైతులు మాత్రమే వరినాట్లు వేస్తున్నారు. గత నెలలో వరిసాగుకు అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో పాటు ఎండాకాలాన్ని మించిన వేడిగాలులు వీచి అన్నదాత గుండెను మండించింది. ఈ వేడిగాలులకు వెద సాగు చేసిన మొక్కలు ఎండిపోయాయి. దీంతో చాలా మంది రైతులు మళ్లీ వరినాట్లకు సన్నద్ధమయ్యారు. దీనివలన అదనపు ఖర్చులు అయ్యాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం ఎకరం వరినారు పీకి నాటు వేసినందుకు 3 వేల రూపాయలు కూలీలకు చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు చెప్తున్నారు. వీటన్నింటికీ మించి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాయిల్ హెల్త్‌కార్డు ఉన్నవారికి మాత్రమే సూక్ష్మపోషకాలైన జింకు, జిప్సమ్ వంటి వాటిని ప్రభుత్వం ఉచితంగా అందజేయడంతో చాలా మంది రైతులు హెల్త్‌కార్డులు లేక సూక్ష్మపోషకాలను సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి వచ్చింది. రైతుల వద్ద పెట్టుబడులకు డబ్బులు లేకపోవడం వలన ఎరువుల కొనుగోళ్లు కూడా తగ్గిపోయాయని ఎరువుల వ్యాపారులు చెప్తున్నారు.