గుంటూరు

ఎయిమ్స్ టెండర్లు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి: మంగళగిరి పట్టణ శివారులో పూర్వపు టిబి శానిటోరియం ఆస్పత్రి ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (ఎయిమ్స్) టెండర్లు ఖరారయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. మంగళగిరిలోని ఐటి పార్కులో గల ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు - వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంస్థ సభ్యులుగా నియమితులైన డాక్టర్ సుబ్రహ్మణ్యం (తిరుపతి), డాక్టర్ నారాయణ (అనకాపల్లి) మంత్రి కామినేని సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని మాట్లాడుతూ గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ సంస్థ సేవలందిస్తోందని, పురాతన ప్రభుత్వ ఆసుపత్రులను గుర్తించి వాటికి మరమ్మతులు నిర్వహిస్తామని, అవసరమైన చోట అదనపు గదులు నిర్మిస్తామని, అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య సమస్య లేకుండా చేశామని, తాగునీరు. వసతులు కల్పించామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డ్రగ్ స్టోర్స్ నిర్మిస్తున్నామన్నారు. మంగళగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేసి వైద్యులను, సిబ్బందిని నియమిస్తామని మంత్రి కామినేని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు - వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్ లక్ష్మీపతి, ఎండి గోపీనాధ్, సభ్యులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ నారాయణ, ఎడి మెడికల్ బోర్డు చైర్మన్ రాజారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.