రంగారెడ్డి

అట్టహాసంగా ప్రారంభమైన మేడ్చల్ - దుందిగల్ జోనల్ స్థాయి క్రీడోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: మేడ్చల్ - దుందిగల్ జోనల్ స్థాయి క్రీడోత్సవ సంబరాలు శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆట్టహసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిలుగా ఎంపిపి విజయలక్ష్మి, జడ్పీటిసి శైలజ హరినాథ్, ఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజల్వన చేసి క్రీడా సంబరాలను ప్రారంభించారు. కనివిని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా క్రీడల ప్రారంభ సంబరాలు జరిగాయి. విద్యార్థినుల స్వాగత నృత్యాలు, జానపద నృత్యాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింభించే బోనాలు, బతుకమ్మ తదితర ప్రదర్శనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. ఎన్‌సిసి విద్యార్థినుల పరేడ్ విశేషంగా ఆకుట్టుకుంది. ముఖ్యఅతిథిలకు క్రీడాకారులు గౌరవవందనం సమర్పించారు. విద్యార్థులు చదువులకే పరిమితం కాకుండా క్రీడల పట్ల అసక్తి కనబర్చాలని చెప్పారు. క్రీడలతో ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిపారు. మానసికోల్లాసంతో పాటు శారీరదారుఢ్యం కలుగుతుందని, ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుందని వివరించారు. విద్యార్థులు దురలవాట్లకు బానిసలు కాకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకుని చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమంగా రాణించి రాష్ట్రానికి దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. అండర్-14, 17 విభాగాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడలలో నిర్వహిస్తున్న జోనల్ స్థాయిలో పోటీల్లో మొత్తం 210 జట్టు పాల్గొంటున్నాయని, 2005 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహిస్తున్నారని జోనల్ కార్యదర్శి మేడ్చల్ జడ్పీహెచ్‌ఎస్ (బాలుర) పిడి ఎం.శంకర్ నాయక్ తెలిపారు. కాగా ఆయా జట్ల మధ్య పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. శనివారంతో పోటీలు ముగుస్తాయి. కార్యక్రమంలో ఎంఇఓ బి.శ్రీ్ధర్ పాల్గొన్నారు.

ప్రజాశ్రేయస్సుకే పనిచేయాలి
మరో ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమిద్దాం: ప్రొ. కోదండరాం పిలుపు
తాండూరు: ఆరు దశాబ్దాల తెలంగాణ కలను నిజం చేసుకున్నాం.. ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన టిఆర్‌ఎస్‌ని నమ్మి ఓట్లు వేసి గెలిపించుకున్నాం.. ప్రభుత్వం ఏర్పడింది.. ఆ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాల్సి ఉంటుంది అని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మంతటి పాండయ్య ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ విద్యావంతుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన జయశంకర్ సార్ జయంతి వారోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సెమినార్‌లో కోదండరాం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జయశంకర్ సార్ స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, నేటి పరిస్థితులు అనే అంశాలపై సెమినార్‌లో కోదండరాం ఉపన్యసించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం నేడు మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అమర వీరుల సమాధుల పై సింహాసనాలు వేసుకొని పాలన చేస్తున్న ఈ దుష్ట పాలకుల భరతం పట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రస్తుత పాలకులు.. ఉద్యమకారులను తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన అమరులను తులనాడుతూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి తూట్లు పొడిచిన ఉద్యమ ద్రోహులను చంకలో పెట్టుకుని పాలన చేస్తుందని అన్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు అనే వాగ్దానాలు, మన తెలంగాణ మన పాలన అనే చిలక పలుకులు మరచిన కెసిఆర్.. ప్రజాకంటక పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని సస్యశామలం చేస్తామని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను, ప్రాణహిత - చేవెళ్లను తాండూరుకు రప్పిస్తామని చెప్పిన టిఆర్‌ఎస్ పాలకులు ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు వేయలేక పోయారని ఆరోపించారు. ప్రతి ఏడాది లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలు తుంగలో తొక్కారని, ఉద్యోగాల కల్పనకు గ్యారంటీ క్యాలెండర్‌ను ముందుగా ప్రకటించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారు. ఎప్పుడు అర్హత పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్ని రోజుల్లో ఉద్యోగాలలో నియమిస్తారు. అనే అంశాలతో కూడిన సమగ్ర క్యాలెండర్‌ను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని కోరారు. నిరుద్యోగ యువత.. డిఎస్సీ, టెట్ అంటూ వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ కోచింగ్ తీసుకొని పరీక్షలకు సిద్ధమయితే ఆయా పరీక్షలు నిర్వహించే గ్యారంటీ లేకుండా పోయిందని ప్రభుత్వతీరును విమర్శించారు. మారుమూల గ్రామీణ ప్రాంతం తాండూరులో ఎన్నో విలువైన భూగర్భ వనరులు ఉన్నాయని, అవన్నీ దోచుకుపోతున్నది బడాబాబులు అని ఆరోపించారు. తాండూరు కందిపప్పుకు ప్రపంచ మార్కెట్‌లో గుర్తింపు రావాలంటే తక్షణం ఇక్కడ కంది బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాండూరులో ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు కోదండరాం వెల్లడించారు. తాండూరులోని ఐదు భారీ సిమెంట్ కర్మాగారాలలో స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు కెసిఆర్ ఒక్క ఆదేశం ఇస్తే ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది నిరుద్యోగులు ఉపాధి పొందే అవకాశం ఉందని చెప్పారు.
ఖాతాదారుల పట్ల మేనేజర్ నిర్లక్ష్యం
షాద్‌నగర్: తమకు తెలియకుండానే బ్యాంక్ సేవింగ్ ఖాతా నుండి డబ్బులు విత్‌డ్రా అయ్యాయి. ఎలా పోయాయని సంబంధిత బ్యాంక్ మేనేజర్‌ను అడుగగా తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం ఏమిటని బాధితురాలు పాక జయమ్మ ప్రశ్నించారు. శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలోని మహబూబ్‌నగర్ రోడ్డులో ఉన్న ఎస్‌బిఐ బ్యాంక్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు పాక జయమ్మ కథనం ప్రకారం ఆగస్టు 6వ తేది నుండి 14వ తేది వరకు వివిధ దశల్లో తమ సేవింగ్ ఖాతా నుండి రూ.50వేలు విత్‌డ్రా అయ్యాయని వివరించారు. ఆనారోగ్యం కారణంగా సెల్‌ఫోన్ మెసేజ్ చూసుకోలేదని, డెబిట్ కార్డు, పాస్‌పుస్తకం ఎవరికీ ఇవ్వలేదని, కానీ డెబిట్ కార్డు ద్వారా వివిధ దశల్లో రూ.50వేలు విత్‌డ్రా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా నుండి డబ్బులు ఎలా పోయాయి..తమకు వివరాలు తెలియజేయాలని సంబంధిత బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ఇష్టం వస్తే ఖాతా కొనసాగించాలని, లేదంటే తొలగించుకోవాలని సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా అయిన విషయంపై ఇప్పటికే సైబరాబాద్ క్రైం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
బ్యాంక్ మేనేజర్ తీరుపై ప్రజా సంఘాల ఆగ్రహం
ఖాతాదారుల పట్ల బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఉచిత సలహాలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని ప్రజా సంఘాల నాయకులు తిరుమలయ్య, అర్జునప్ప, టిజి శ్రీనివాస్, రవీంద్రనాథ్, ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాతాదారులకు తెలియకుండా డెబిట్ కార్డు ద్వారా రూ.50వేలు ఎలా విత్‌డ్రా అయ్యాయి. ఏ ఏటిఎం సెంటర్ నుండి డబ్బులు తీశారు అనే విషయాలను బ్యాంక్ అధికారులు గమనించాల్సింది పోయి.. ఖాతాదారులతో వాగ్వివాదానికి దిగడం సరికాని అన్నారు.
ఉన్నతాధికారులకు నివేదిక అందచేస్తాం * ఎస్‌బిహెచ్ బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్
జయమ్మ అనే మహిళా ఉద్యోగి ఖాతాలో నుండి డబ్బులు విత్‌డ్రా అయ్యాయనే విషయం తమకు తెలియదని, బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేసిందని ఎస్‌బిహెచ్ బ్యాంక్ మేనేజర్ విజయ్‌కుమార్ తెలిపారు. డెబిట్ కార్డు నుండి వివిధ దశల్లో విత్‌డ్రా అయినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదుతోపాటు బాధితురాలి ఖాతా వివరాలను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు మేనేజర్ వివరించారు.

అభివృద్ధిని గురించి ప్రజలకు వివరించాలి
తాండూరు: గ్రామగ్రామాన ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విస్తృత ప్రచారం చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఉద్ఘాటించారు. శుక్రవారం పట్టణంలో ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన తాండూరు మండల టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ తమ ప్రభుత్వం అబివృద్ధి పథంలో దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా వెలుగొందుతుందని అన్నారు. మూడేళ్ల కాలంలో తాండూరు నియోజకవర్గ పురోభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పెద్దలు తాండూరు నుండి మంత్రి వర్గంలో బాధ్యతలు నిర్వహించిన మహారాజులు.. అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. గతంలో టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నపుడే నియోజక అభివృద్ధికి అవిరాళంగా కృషి చేశానని తెలిపారు. అభివృద్ధికి500 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పట్నం వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులకు ఇక ముందు నియోజకవర్గంలో పుట్టగతులుండవని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాది చివరి నాటికి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేసి అందించటం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా జిల్లాలో రూ.450 కోట్లు ఖర్చు చేసి చెరువులు, కుంటల పూడికలు తీసి అభివృద్ధి చేసి భవిష్యత్‌లో సాగు నీటికి కష్టాలు ఉండకుండా చేస్తున్నామని తెలిపారు. నారాయణపూర్ బ్రిడ్జి, జివన్గీ బ్రిడ్జి నిర్మాణాలకు దాదాపు రూ.35 కోట్లతో పనులు ప్రారంభించామని చెప్పారు. నాపరాతి గనులు, పరిశ్రమలు, ఐదు భారీ సిమెంట్ కర్మాగారాల నుండి నిత్యం వేలాదిగా లారీలు, ట్రక్కులు, భారీ సిమెంట్ ట్యాంకర్లు తాండూరు పట్టణం మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి వాయు శబ్ద కాలుష్యం పెరిగిందని అన్నారు. తాండూరులో రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేయించినట్లు, రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కొల్పోతున్న భూ నిర్వాసితులకు రూ.30కోట్లు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మండల ఎంపిపి కోస్గి లక్ష్మమ్మ, జడ్పీటిసి రవి గౌడ్, టిఆర్‌ఎస్ నాయకులు కరణం పురుషోత్తం రావు, శకుంతల తాండూరు మండల పార్టీ అధ్యక్షుడు రాందాస్, రాజప్ప గౌడ్ పాల్గొన్నారు.

నూతన విధానాలు అమలు చేయాలి
వికారాబాద్: రోజూ చేసే ఆఫీసు పనుల్లో నూతన విధానాలు అమలు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఏర్పాటుచేసిన ఇ-లెర్నింగ్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న కలెక్టర్.. ఇ-లెర్నింగ్ ప్రోగ్రామ్‌తో అధికారులకు జరిగే లాభాల గురించి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని 9000 మంది అధికారులకు ఇ-లెర్నింగ్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని 364 మంది అధికారులకు శిక్షణ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. తహశీల్దార్లు, ఎంపిడివోలు, ఎంఇవోలు, ప్రధానోపాధ్యాయులకు విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. ఇ-లెర్నింగ్ శిక్షకులను ఏర్పాటు చేశామని వివరించారు. దానికి జిల్లా ప్రణాళికాధికారి, జిల్లా విద్యాధికారి, జిల్లా ఐటి మేనేజర్లు సభ్యులని తెలిపారు. డిప్యూటీ డైరక్టర్ జనరల్ (ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డి) సేథి మాట్లాడుతూ అధికారులంతా 60 రోజులలోపు ఈ ప్రోగ్రామ్ పూర్తి చేస్తారని చెప్పారు. సమావేశంలో డిఆర్‌వో జి.సంధ్యారాణి, జిల్లా ప్రణాళికాధికారి దశరథ్, ఆర్డీవో విశ్వనాథ్ పాల్గొన్నారు.