ఎంసిఏ కుర్రాడు డేట్ ఇచ్చేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబుల్ హ్యట్రిక్ హీరో, నాచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఎంసిఏ’ షూటింగ్ 50 శాతం పూర్తయింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ సంస్థలో ఇటీవల ‘్ఫదా’తో తెలుగువారి మనసుల్ని దోచుకున్న సాయిపల్లవి తొలిసారి నానితో జోడీ కడుతున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్‌రాజు మాట్లాడుతూ- మా బ్యానర్‌లో నాని హీరోగా ఏడాది ‘నేను లోకల్’ సినిమా విడుదలై బాక్సాపీస్ వద్ద సూపర్ డూపర్‌హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మా హిట్ కాంబినేషన్ మరోసారి పునరావృతం అవుతుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందనున్న ‘ఎంసిఏ’ చిత్రం మా బ్యానర్‌లో మరో హిట్ చిత్రంగా నిలుస్తుంది. అద్భుతమైన కథ, అన్ని సమపాళ్ళలో వున్న ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో నానిని దర్శకుడు వేణు సరికొత్త స్టైల్‌లో చూపించనున్నారు. నేను లోకల్ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. సాయిపల్లవి నానికి జోడీగా నటిస్తుండగా, ప్రముఖ హీరోయిన్ భూమిక ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తప్పకుండా సినిమా అందరినీ ఆకట్టుకోవడమే కాదు, ప్రేక్షకుల్లో మా బ్యానర్ వాల్యూను పెంచే చిత్రమవుతుందని భావిస్తున్నాను. సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టాం. డబ్బింగ్ పూజతో ఈ కార్యక్రమాలకు నాంది పలికాము. సినిమాను డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.