ఆటాపోటీ

వివాదాలకు మారుపేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను వివాదాల రారాజుగా చెప్పుకోవాలి. సమర్థుడైన పేసర్‌గా కంటే, వివాదాలను కొనితెచ్చుకునే క్రికెటర్‌గా అతనికి ఎక్కువ పేరు ఉంది. 2012లో బెంగళూరు నుంచి ఢిల్లీకి విమానంలో వెళుతున్నప్పుడు అతను తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగాడు. అతనిని దూషించాడు. అత్యవసర ద్వారానికి సమీపంలో కూర్చోవద్దని సూచించిన విమాన సిబ్బందిపైనా ఒంటికాలిపై లేచాడు. ఈ సంఘటనపై విమర్శలు రేగడంతో, తాను ఎవరితోనూ ఘర్షణ పడలేదని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ, అతనిని నిర్దోషిగా ఎవరూ నమ్మలేదు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపిఎల్‌లో ఆడిన శ్రీశాంత్ 2008లో హర్భజన్ సింగ్‌తో ఘర్షణ పడి, చెంపదెబ్బతిన్న సంఘటనను ఎవరూ అంత సులభంగా మరచిపోలేరు. వారూవీరూ అన్న తేడా లేకుండా అందరితోనూ కయ్యానికి కాలుదువ్వడం అతని అలవాటు. మైఖేల్ వాన్, ఆండ్రూ సైమండ్స్, కెవిన్ పీటర్సన్, ఆండ్రె నెల్ తదితరులతో శ్రీశాంత్ తీవ్రంగా ఘర్షణ పడిన సంఘటనలు భారత క్రికెట్ చరిత్రలోనే చీకటి అధ్యాయాలు. యావత్ క్రికెట్ ప్రపంచం గౌరవించి, కీర్తించే సచిన్ తెండూల్కర్‌ను కూడా శ్రీశాంత్ విడిచిపెట్టలేదు. ‘నువ్వెంత? నాకు చెప్పే స్థాయి నీకు లేదు’ అంటూ సచిన్‌ను దుర్భాషలాడిన ఘనత శ్రీశాంత్‌దే. విదేశీ క్రికెటర్లు కూడా సచిన్‌పై ఆ స్థాయిలో విరుచుకుపడలేదు. ఇక 2013 ఐపిఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ భారత క్రికెట్‌ను కుదిపేసింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై శ్రీశాంత్‌ను ఢిల్లీ పోలీసులు ముంబయిలో అరెస్టు చేశారు. రాజస్థాన్ రాయల్స్‌లో అతని సహచర బౌలర్లు అంకిత్ చవాన్, అజిత్ చండీలాను కూడా అదుపులోకి తీసుకున్నారు. సుమారు నెల రోజుల జైల్లో గడిపిన తర్వాత శ్రీశాంత్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. బిసిసిఐ అతనిపై జీవితకాల సస్పెన్షన్‌ను విధించింది. సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా ఇటీవలే కేరళ హైకోర్టు అతని కేసును కొట్టేసింది. తాను నిర్దోషినని, కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వచ్చింది కాబట్టి తనకు జాతీయ జట్టులో అవకాశం కల్పించాలని శ్రీశాంత్ డిమాండ్ చేస్తున్నాడు. కానీ, వివాదాస్పదుడిగా ముద్రపడిన అతనిని తీసుకోవడానికి బిసిసిఐ సిద్ధంగా లేదు. పైగా, కేరళ కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించింది.