మంచి మాట

సత్యం విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగత్తున సర్వదేశాలలో సర్వ ధర్మములో సత్యమే గొప్పది. సత్యాన్ని నమ్ముకున్నవారు, సత్యధారణ చేసేవారు, సత్యము తప్ప అన్యమెరుగని వారు, అసత్యం పలుకని వారు ఇలాంటివారికే ఎన్నటికీ గౌరవమే దక్కుతుంది. సత్యమే పలకడానికి సంకల్పబలం ఉండాలి. సత్యం పలకడం, ధర్మం ఆచరించడం అనేవి మనిషి కర్తవ్యాలు. సత్యమే శివం. అదే సుందరం.
సత్యం ఫలకడం ఎంత మంచి గుణమో త్యాగ భావన కలిగి ఉండటమూ అంతే మంచిగుణం. త్యాగం ఒక సుగుణం. త్యాగం చేయడంమంటే మనకున్న దాన్ని లేకుండా చేసుకోవడం కాదు. ఉన్నదానిలో మరొకరికి సాయంచేయడమే. మరలా ఈ త్యాగగుణంలో పటాటోపాలు, ఆర్భాటాలకు తావుండకూడదు. ఎందుకంటే అది గర్వం పెరగడానికి పనికివస్తుంది కాని త్యాగగుణాన్నిపెంచదు. కనుకనే కర్ణుడు కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనవసరం లేదంటాడు. అలాంటి గుణసంపత్తిని పెంచి పోషించుకోవాలి. ఈ రెండు గుణాలు జీవితాంతం ఉండాలంటే ముందు మనలో సంకల్పబలం ఉండి తీరాలి.
సంకల్పబలం కేవలం ధర్మయుతమైన పనులు చేయడానికి శక్తి నిస్తుంది. శ్రీరాముడు అధర్మపరుడైన రావణుని సంహరించాలని అనుకొంటే అతనికి వానరులు సహాయం అందించారు. అగస్త్యులవారి లాంటి మునుల సహాయం కూడా లభ్యమైంది. విశ్వామిత్రుడు సర్వశస్త్రఅస్త్రాలను అనుగ్రహించాడు. అపుడే రావణుని సంహారం జరిగింది.
అట్లానే శ్రీకృష్ణుడు అపరశ్రీమన్నారాయణుని అవతారం కనుక అతనూ కూడా భగవంతుని పూజించి సర్వులకు కల్యాణం జరగాలని కోరుకుని ధర్మయుతంగా ప్రవర్తించాడు కనుకనే అతనికి అన్నింటా విజయం కలిగింది.
సత్యహరిశ్చంద్రుడు సత్యం పలుకుతానని ధర్మమే ఆచరిస్తానని దృఢసంకల్పం చేసుకొన్నాడు. ఆయన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయ. ఎన్నో ఆటుపోట్లకు గురైనాడు. కాని దృఢసంకల్పబలం వల్ల సత్యం కోసమే రాజ్యాన్ని, భార్యాబిడ్డలను పోగొట్టుకున్నా వాటినితిరిగి పొందడానికి సత్యాధర్మాలనే ఆయుధాలుగా చేసుకొన్నాడు.
ఆంజనేయుడు ధర్మపాలనకే పట్టం కట్టేవాడు కనుక అతని రాముని అండ దొరికింది. ఆంజనేయుడు ఎపుడు శ్రీరాముడిని తనకు ఏది అయనా ఇమ్మని అడగలేదు. కేవలం సుగ్రీవుడు వాలి వలన బాధపడుతున్నాడు. ఆయన్ను రక్షించమని కోరాడు. ఆ తరువాత రావణుని చెరలోని సీతమ్మ ఉందని రామునికి చెప్పి ఆయనకు దుఃఖవిముక్తిని కలిగించాడు.
ఆ తరువాత రామలక్ష్మణులతో కలసి వానరులందరినీ తీసుకొని వారధి నిర్మించి లంకాప్రవేశం చేసి రావణుని సంహరించడంలో రామునికే తోడుగా నిలిచాడు. ఇటువంటి నిస్వార్థగుణుడిని సత్యమే బలంగా నిలుస్తుంది.
పాండవులు సత్యధారణ, ధర్మపాలన చేసేవారు కనుక దుష్టులైన కౌరవులను ఎదరించగలిగారు. కౌరవులు పెట్టిన కష్టాలనుండి గట్టెక్కడానికి వీరు సత్యపాలురు కనుక వీరికి శ్రీకృష్ణుని అండ లభ్యమైంది.
లక్ష్యాన్ని సాధించాలని మనసులోకోరుకోవడంకంటే ఆత్మలో సంకల్పించుకుంటే మంచి బలం వస్తుంది. మనసుకంటే ‘ఆత్మస్థితి’ లోతైనది. శరీరం కంటే ఇంద్రియాలూ, ఇంద్రియాల కంటే మనస్సూ, మనస్సు కంటే బుద్ధీ గొప్పవి. ఆ బుద్ధిని కూడా దాటి వున్నదే ఆత్మ. బుద్ధిచేత మనసును స్వాధీనపరుచుకొని ఇంద్రియాలను జయించగలిగితే లక్ష్యం చేరువవుతుంది. సంకల్పం నెరవేరుతుంది.
మనది కర్మభూమి, వేదాలు ప్రణమిల్లిన భూమి.
ఎవరిని వారు ఉద్దరించుకొని ఎవరి భావాలను వారు మంచిదారిలో పెట్టుకొంటే చాలు ఇతరులకు మేలు చేసినట్టే. ధర్మం కోసం సత్యం కోసం జీవించే వ్యక్తి మాత్రమే చివరకు ప్రగతి కారకుడు అవుతాడు. ఆ మనిషినే సమాజంఅభ్యుదయకారకుడుగా గుర్తిస్తుంది.
కనుక ధర్మాన్ని ఆచరించాలి. సత్యానే్న పలకాలి. ఇదేమనుషుల్లో మానవత్వాన్ని ప్రోది చేస్తుంది. మానవత్వంతో మసలితే మానవుడే దివ్యుడు అవుతాడు. దివ్యపథంలో సంచరించేవారికి మానవ లోకమే స్వర్గాన్ని మించిన పథము అవుతుంది.

- ఎస్. నాగలక్ష్మి