భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్.శ్రీకృష్ణ - అంబర్‌పేట, హైదరాబాద్
ప్ర: గురువుగారూ! మీ భవిష్యకాలం రెగ్యులర్‌గా చదువుతాను. వ్యక్తిగత సమస్యలే కాకుండా దేశ కాల మాన పరిస్థితుల గురించిన ప్రశ్నలకు మీ సమాధానాలు నిజం అయ్యాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గురించి సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పండి.
సమా: సామాన్య పౌరుడిగా మనం కోరవలసింది రాష్ట్రంలోనైనా- కేంద్రంలోనైనా సుస్థిరత- కేంద్ర ప్రభుత్వం సమీప భవిష్యత్తులోనే కాదు సుదూర భవిష్యత్తులో కూడా సుస్థిరంగా ఉంటుంది. అయితే అక్టోబర్ - నవంబర్- డిసెంబర్‌లలో చైనా, పాకిస్తాన్‌లతో ప్రమాదకరమైన సంఘర్షణ జరిగే అవకాశం వుంది. ఊహించని పరిస్థితుల కారణంగా కాని భగవంతుని దయవల్ల కాని ఘర్షణ తప్పే అవకాశం ఉందని ఆశిద్దాం. ఏమైనా భారతదేశ ప్రతిష్ట పెరుగుతుందే కాని తరగదు. అంతర్గత వైరుధ్యాలే అంతం కావాలి. ఏకీయత చోటుచేసుకోవాలి.
పున్నా మురళీధర్ - పొల్లాడు- శ్రీకాకుళం
ప్ర: ఇల్లు పని ప్రారంభించాలనుకుంటున్నాం- పూర్తికాగలదా?
సమా: ఆ విషయం మీరు ప్రారంభించిన ముహూర్తంమీద ఆధారపడి వుంటుంది. ముందు ప్రారంభించండి.
నారాయణభట్ల భవభూతి శాస్ర్తీ- వరంగల్ (తెలంగాణ)
ప్ర: మన దేశంలోనే మాతృదేశ వ్యతిరేక నినాదాలు పరాయి దేశ ప్రస్తుతి- త్రివర్ణ పతాకానికి అవమానం వంటి సంఘటనలు బాధ కలిగిస్తున్నవి. దీనికి కారణమేమిటి? నివారణ ఏమిటి?
సమా: స్వాతంత్య్రానంతరం మధ్యకాల చరిత్రలో స్వార్థశక్తులు- అధికార వ్యామోహంగల శక్తులు బలపడ్డాయి. రాజ్యాంగం ప్రసాదించిన వాక్‌స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇంట్లో గాలి- వెలుతురు కోసం కిటికీలు వెంటిలేటర్లు పెట్టుకుంటాం- అందులోనుండి దొంగలు దూరితే ఏం చేస్తాం- అట్లాగని కిటికీలు లేని ఇల్లు కట్టుకోగలమా? దానికితోడు మన దేశ చట్టాలు కూడా పటిష్టంగా లేవు. బ్రిటిష్ వారివే కొంత మార్చి అనుసరిస్తున్నాం కాని దూరదృష్టితో ఆలోచించటంలేదు. అందుకే ఉర్దూలో ఒక సామెత ఉంది. ‘ఖానూన్ ఔర్ తల్వార్ తేజ్ రహానా చాహియే’ అని. చట్టం పటిష్టంగానూ - కత్తి పదునుగానూ ఉంటే నేరస్థులు భయపడతారు. అన్నిటికంటే ముందు మనం భావదాస్యం నుండి బయటపడాలి.
కట్టా హరికృష్ణ, తాటిపాక (రాజోలు)
ప్ర: జీవితంలో స్థిర్వం లేదు. ఎప్పుడు వస్తుంది?
సమా: అనేక విషయాలమీద కాకుండా ఒక విషయంమీద ఏకాగ్రత కేంద్రీకరించండి. మార్పు వస్తుంది.
కె.నాగభూషణం. పేటేరు, గుంటూరు
ప్ర: మా అమ్మాయి ఇంటిలో ఈశాన్యంలో ‘వాటర్ టాంక్’ వుంది. ఉండవచ్చా? ఇంట్లో గొడవలకు కారణం అదేనా?
సమా: ఈశాన్యంలో వాటర్ టాంక్ ఉండటం శ్రేష్ఠం. పల్లానికి ప్రాధాన్యం ఈశాన్యం. అయితే ఇంట్లో గొడవలకు కారణం కేవలం వాటర్ టాంక్ అనుకోవడం పొరపాటు. వేరే కారణాలు ఉండవచ్చు. మీరు ఏ నంబరు ఇవ్వలేదు. ఇస్తే కారణాలు చెప్పగలిగేవాణ్ణి.
అర్చన, గుత్తి, అనంతపురం
ప్ర: మేము సకుటుంబంగా విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నాము. నెరవేరగలదా?
సమా:దేశం- దిశ- ఆ దేశ చట్టాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీకు విదేశీయానం మాత్రమే ఉంది. సెటిల్‌మెంట్ అనేదానికి వెళ్లిన తరువాత ప్రశ్నించండి.
ఆర్.కిరణ్‌బాబు, విద్యానగర్, హైదరాబాద్
ప్ర: ఉద్యోగం?
సమా: మీకు వ్యాపారం యోగిస్తుంది. స్ర్తి మూలకంగా అభివృద్ధి కలదు.
హారతీదేవి, కాకినాడ (తూ.గో.)
ప్ర: ఆరోగ్యం ఎలా ఉంటుంది?
సమా: మీకు ఉదర సంబంధమైన అనారోగ్యం- ఏదైనా ఒక ఒత్తిడి సూచించబడుతోంది. మానసిక ఉద్వేగాన్ని తగ్గించుకోండి. జీర్ణావయం- లీవర్- సంబంధమైన పరీక్షలు జరిపించుకొని ఔషధాల్ని పొందండి. నవంబర్‌లో మంచి మార్పు వచ్చే అవకాశం వుంది.
జి.వి.లక్ష్మి, విజయవాడ, కృష్ణా
ప్ర: నోములకు వాయనాలు తీసుకున్న చేటలు ఏం చేయాలి?
సమా: చేటలో వాయనాలు సౌభాగ్యంకోసం ఇచ్చే వాయనాలు. వీలయితే అవసరమైన బ్రాహ్మణ మత్తయిదువలకు పసుపు కుంకుమ- బియ్యముతో దానమివ్వండి. కాదంటే కనకదుర్గమ్మ గుళ్లో సమర్పించండి. అది కూడా వీలు కాకపోతే- పరిమళాల పూలు, పసుపు కుంకుమలు, గాజులు కలిపి కృష్ణానదిలో సమర్పించండి.
క్రొవ్విడి లక్ష్మీ నరసింహం, సజ్జాపురం, తణుకు
ప్ర: నాకు స్వంతముగా తణుకులో ఇల్లు కొనగలనా?
సమా: ఈ ప్రశ్న మీరు చాలాసార్లు వేశారు. నేను సమాధానం చెప్పాను. ప్రయత్నశీలం లేని కోరికలు ఫలించవు.
అయ్యగారి చంద్రశేఖర్, రామంతాపూర్, హైదరాబాద్
ప్ర: వివాహ యోగం కలగటం లేదు. నిరాశా నిస్పృహ కుంగదీస్తున్నాయి. ఏం చేయాలి?
సమా: ప్రతి మనిషి జీవితంలోను కొన్ని అదృష్ట ఘడియలు ఉంటాయి. అదృష్ట దేవత తలుపు తట్టుతుంది. అప్పుడు సరిగ్గా స్పందిస్తే జీవితం సుఖప్రదం అవుతుంది. అలాగే మీ జీవితంలో రాకపోలేదు. ఆ సమయంలో మీరు సరిగా స్పందించలేదు. ఇపుడు కూడా సుదీర్ఘమైన లేఖ వ్రాసారు కాని సంఖ్య మాత్రం వ్రాయలేదు.
సుమిత్ర- కడప- రాయలసీమ
ప్ర: భర్త నిరాదరణ- బాధ్యతా రాహిత్యం- కర్తవ్యమేమిటి? విడిపోవటమేనా?
సమా: తొందరపడకండి. మీ బంధువులలో పెద్దవారితో చెప్పించండి. అప్పటికీ వినకపోతే ఆయన ఉద్యోగ జీతం నండి మెయింటనెన్స్ ఇప్పించే చట్టాలున్నాయి. అయితే ఎవరో ఒక పెద్ద వయసున్న స్ర్తి యొక్క ప్రమేయం కూడా సమస్యకు కారణంగా కనిపిస్తోంది. సావధానంగా ఆలోచించి అనుభవజ్ఞులైన పెద్దల సలహా పాటించండి.
ఎమ్.లక్ష్మీకుమారి- బేతంచర్ల, కర్నూలు
ప్ర: గృహయోగం ఉందా?
సమా: మీరు చెప్పినది అనుకూలంగానే ఉంది. వాస్తు సరి చూసుకోండి.
కె.యశోద, విజయవాడ (కృష్ణా)
ప్ర: ప్రస్తుతం వ్యాపారం బాగా సాగటంలేదు. మళ్లీ ప్రారంభించమంటారా?
సమా: మీరు చేసినది- చేయబోయేది ఏ వ్యాపారమో తెలియనిది చెప్పటం సాధ్యంకాదు.
జి.పద్మలత, తిరుపతి (చిత్తూరు)
ప్ర: ప్రస్తుత అనారోగ్యం పీడిస్తోంది. ఎప్పుడు కుదుటపడుతుంది?
సమా: మీకు హృదయస్థానంలో సమస్య గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకూ ప్రశాంతతను అలవాటు చేసుకోండి. కలౌ వేంకట నాయకః- మీ క్షేత్రాధి దేవునికి ప్రతి మంగళ- శనివారాలు బూందీ లడ్డూ, పులిహోర- దధ్యోజనం చేసి నివేదన చేయండి. అంతకుముందు ఆవు నెయ్యితో జ్యోతి (ఊర్థ్వముఖదీపం) వెలిగించండి. సహస్రనామ పారాయణం చేయండి.
జమ్మిశెట్టి లీలారాణి, పాత గుంటూరు, గుంటూరు
ప్ర: ఉద్యోగం- వివాహం ఎప్పుడు సాధ్యవౌతాయి?
సమా: డిసెంబర్‌లో కొన్ని మంచి మార్పులు రాగలవు. తూర్పువైపునుండి వివాహయోగం- మ - ప - స - ల అక్షరాలు.
మంచినీళ్ళ రాజారెడ్డి, మెదక్ (తెలంగాణ)
ప్ర: మంచి జరగాలంటే గ్రహచారం బాగుపడాలంటే పూజలు ముఖ్యమా? యజ్ఞయాగాదులు ముఖ్యమా?
సమా: వ్యక్తి సంబంధమూ- కుటుంబ సంబంధమూ వంటి స్వల్ప స్థాయికి దేవతాపూజలు, హోమాలు శాస్త్రోక్తంగా చేయాలి. చేయించాలి. సమాజానికి దేశానికి, సార్వజనీనమైన ప్రయోజనం కోసం ప్రకృతిలోని పర్యావరణ శుభ్రత కోసం యజ్ఞయాగాదులు చేయాలి. లేదా చేయించాలి. ‘యజ్ఞాత్ పర్జన్యః’ అంటుంది భగవద్గీత. యజ్ఞమువలన వర్షమునీయగలిగే మేఘాలు ఉత్పన్నమవుతాయి. మామూలు మేఘాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిలో నీరుండదు. ఫ్యాక్టరీల పొగలతో - ఉపగ్రహ వ్యర్థ శకలాలతో అంతరిక్షం కలుషితమవుతోందని శాస్తజ్ఞ్రులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
బషీరుద్దీన్ బాబా - న్యూభైంసా- తెలంగాణ
ప్ర: పూజల పేరుతో దేవుడికి డబ్బులు వేయడం దేవుడికిచ్చే లంచం కాదా?
సమా: కాదు. పొరపాటు- ప్రభుత్వానికి మనం రకరకాల పన్నులు చెల్లిస్తున్నాం. అది లంచమా? అలాగే విశ్వ ప్రభుత్వానికి మనవంతుగా పూజల రూపంలో పన్ను చెల్లించాలి- అది మన కర్తవ్యం. ఏదైనా మనమిచ్చేదే తిరిగి మనకు వస్తుంది. అది ప్రకృతి నియమం.
పన్యాల గుణభూషణరావు, హైదరాబాద్
ప్ర: బాసర క్షేత్రంలో జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానసరస్వతి ఆలయంలో అటువంటి సంఘటనలు జరగటమేమిటి? అది కూడా పూజార్లే చేయటం మన దౌర్భాగ్యం కాదా?
సమా: ఔను! చాలా శోచనీయమైన సంఘటన- అయితే ఒక విషయం మనం గమనించాలి. దీపం ఎంత కాంతివంతంగా వెలిగినా దూరపు చీకటిని తరిమివేయగలదే కానీ తన క్రిందనే ఉన్న చీకటిని పోగొట్టలేదు. ఆ బాసర తల్లి బయటివారిని ఉద్ధరించగలుగుతోంది కాని బాసర వాసుల్ని కాదు- అందుకే తెలుగులో ఒక సహజ సత్యాన్ని చెప్పే సామెత ఉంది. ‘గుడికి దగ్గరైతే దేవుడికి దూరం అవుతాము’ అని.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
ఖ్ఘౄఔ్ఘఆ్దజఒ్ద్ఘ్ఘౄబక్ఘౄజ.ష్యౄ

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ