సబ్ ఫీచర్

అపురూప శిల్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమె పేరు సుహాని. నగల డిజైనర్. అందానికి మెరుగులు దిద్దేపనే కదా అని కొట్టిపారేయకండి. ఎందుకంటే ఈ ఆధునిక డిజైనరే నేడు హైదరాబాద్‌లో జరిగి మారథన్, సోర్ట్స్ పతకాల రూపకర్తగా మారింది. చిన్న వయసులోనే ఎంతో సృజనాత్మకంగా, కళాత్మకంగా రూపొందించే ఈమె పతకాల డిజైన్లు విజేతలకు కొండంత సంతృప్తిని ఇస్తున్నాయి. హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేసే డిజైన్లు ఆటల్లో గెలిచిన వారికి మానసికోల్లాసాన్ని అందిస్తాయి. అందుకే హైదరాబాద్‌లో ఎలాంటి మారథాన్ జరిగినా ఆ మారథాన్‌లో అందించే పతకాల వెనుక సుహాని ఉంటారు.
మారథాన్‌లకు నిలయం..
హైదరాబాద్ నగరం మారథాన్‌ల నిర్వహణకు నిలయంగా మారింది. ఎందుకంటే తరచూ ఇక్కడ మారథాన్లు నిర్వహించటం సర్వసాధారణం. ఏదో ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ నిర్వహించే మారథాన్‌లలో పిల్లల నుంచి పెద్దల వరకు ఇళ్లను వదలి ఆహ్లాదంగా.. ఆనందంగా పాల్గొంటున్నారు. అందుకే ఇలాంటి ఈవెంట్‌లలో ఇచ్చే పతకాలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది 42కె, 21కె, 10కె మారథాన్‌ల పతకాలను డిజైన్ చేసే అవకాశం సుహానికి దక్కింది.
ఆటతోనే నైపుణ్యం
సుహాని కూడా ఆటల్లో మేటి. ఫుట్‌బాల్ ప్లేయర్. ఇప్పటికీ రన్నింగ్ పోటీల్లో పాల్గొంటుంది. డిజైనర్‌గా రకరకాల ప్రాజెక్టులు చేపట్టినా.. పతకాల డిజైన్ ఆమెకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అందుకే పతకాల విలువ ఎలా ఉండాలో ఆమెకు బాగా తెలుసు. ఆటలే ఆమెలో నైపుణ్యాన్ని మెరుగుపరిచాయి.
ట్రోఫీలు, మెడల్స్ డిజైనింగ్‌లో ఏర్పడిన మక్కువ ఆమెను పతకాల రూపకర్తగా మార్చేసింది. దశాబ్ద కాలం నుంచి సుహానికే డిజైన్ చేసే అవకాశం దక్కుతోంది. స్పోర్ట్సు, అథ్లెటిక్ రెండూ కలిపి పతకాలను డిజైన్ చేస్తే ఆకట్టుకుంటుందని ఆమె ఉద్దేశ్యం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా వారు పడిన కష్టాన్ని మరిచిపోయేలా డిజైన్ చేస్తోంది. అంతేకాదు హైదరాబాద్ ప్రత్యేకతలను ప్రతిబింబించేలా చార్మినార్ వంటి కట్టడాలను అందులో పొందుపరుస్తుంది. ఆటగాడి ప్రతిభాపాటవాలు ఈ పతకాలలో కనబడుతోంది.