ఉత్తర తెలంగాణ

అత్తా కోడళ్లు! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో

అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. ఇంట్లో

ఉండేది అమ్మ, నేను. డిగ్రీ పట్టా పొందిన

తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగం

వచ్చింది. అమ్మ చెప్పినట్లుగానే ఉద్యోగంలో

చేరిన ఏడాదిలోపే పెళ్లి చేసుకున్నాను.
చాలా అందమైన పిల్ల, బంగారమంత

శృంగారం. నా అదృష్టంగా భావించాను. ఎగిరి

గంతేసి ఎంతో సంతోషపడ్డాను. కాని ఆ

సంతోషం చాలా రోజులు సాగలేదు. ఇంట్లో

అడుగుపెట్టి నెల కూడా కాలేదు. అంతలోనే

సమస్యలు మొదలయ్యాయి. ఐనదానికో,

కానిదానికో లొట్టిమీది కాకోలే లొల్లే లొల్లి!

వదరుడు, చిన్న చిన్న విషయాలకు

అపార్థాలు చేసుకొనుడు. ఇంట్లో లొల్లిలేని

రోజు లేదనుకో!
భార్య ఏ పని చేయదు. వంట చేస్తే

చేసినట్టు, లేకుంటే లేనట్టు! వంట

గిట్లుందంటే, గది లేదంటే ఇంట్ల

గిదివుండదు. గిదివుంటే గది వుండదనుడు.

ముందే గిది కావాలనీ చెప్పదు. చాయి

లేదా కాఫీ తయారు చేసి అమ్మకిచ్చుడు

కూడా ఆమెకు కష్టమే! లేనిపోని

అభాండాలు ఒకరిమీద ఒకరు

చెప్పుకునుడు. నేను విని విని చచ్చుడు.
పెళ్లి కాకముందు పెళ్లి చేసుకొమ్మనుడు.

పెళ్లి చేసుకున్నాక గీగతి! ఇటు చూస్తే

కన్నతల్లి, అటు చూస్తే కట్టుకున్న భార్య.

ఎవరిని ఏమనాలి! నోరుకు తాళమేడిది!

ఎవరినేమనాలి!
విడువడాలనీ భార్య.. నాకు విలువివ్వడం

లేదని అమ్మ! ఓ రోజు అనుకోకుండా అమ్మ

కాలు జారి బాత్‌రూమ్‌లో పడిపోయింది.

అందువల్ల ఒకరి సహాయం లేకుండా ఆమె

నడవలేని చాలా దుర్భరమైన పరిస్థితి!

మంచి, చెడులు ఇంట్లో కొంతవరకైనా

చూసుకునే బాధ్యత భార్యది కాదా!

రోజురోజుకు చేతనైతలేదు నాకెందుకని

అమ్మ కనీసం నోరైనా మూసిందా! అదీ

లేదు. నా అత్త నాకు అమ్మలాంటిదేనని

ఎప్పుడైనా భార్య భావించిందా! అదీ లేదు!
భార్య చేయవట్టి ఆయమ్మను పెట్టడం అన్ని

విధాల మంచిదని, ఐదు వేలకు

మాట్లాడాను. అమ్మ మంచిచెడులు

అన్నివిధాల చూసుకుంటూ, ఖాళీ

సమయంలో భార్యకు తోడుగా వంటింట్లో

సహకరిస్తుంది. కారు తుడుచుడు వద్దన్నా

వినదు. బ్రేక్‌ఫాస్ట్ వెంట వెంటనే ఆఫీస్‌కై

లంచ్ బాక్స్ రెడీ. ఇతర పనులు ఎన్నున్నా

చేసి పెట్టడం. ఒక్క నిమిషం కూడా విరామం

లేదు. వీలును బట్టి పనులన్నీ చకచకా

చేస్తున్నది! ఎంత ఆత్మీయతో! ఆమె

మాటల్లోనే ఆనందపు కమ్మదనం!
ఓరోజు భార్య నా దగ్గరికి వచ్చి నాన్పిచ్చుడు

వద్ద నల్లికుట్లోనోలే ఎందుకు! ‘నేను కావాలో

మీ అమ్మే కావాలో! ఇప్పుడే ఏదోటి చెప్పు’

అంది.
విలువల్ని కాపాడుకోని జీవితం జీవితమేనా!

అది బతుకేనా! మనిషంటే ఏంటి? అత్తా,

కోడళ్లంటే నిజంగా తల్లి బిడ్డల్లా కలిసుండాలి!

సుందరమైన ఈ సృష్టిని చూసైనా

నేర్చుకోవాలి! ఇతరులకు ఆదర్శంగా

నిలవాలి!
ఏ సమస్య వచ్చినా సామరస్యంగా

పరిష్కరించుకోవాలి గాని తొందరపాటు

తగునా! ఎంత పెద్ద సమస్యనైనా భర్తతో

చెప్పుకోవాలి భార్య. కానీ ఐందానికో,

కాందానికో గొడవ మంచిదా! అది రాను

రాను అలవాటుగా మారే ప్రమాదముంది!
‘అలాగని కోడలు, బిడ్డతో సమానమనే

ధ్యాస కొంతవరకైనా అవసరమే! ఎంతో

కొంత పరిజ్ఞానం లేకుంటే ఎలా! మనుగడే

కష్టం’.
‘ఒక రోజు! రెండు రోజులు! గడుస్తూనే

వున్నవి. బయటెంత పలుకుబడున్న ఏమి

లాభం! ఇంట్లో చక్కదనం లేంది గోసనే!

నల్గురి చెవ్వుల పడితే నాల్గు ఊర్లకు

తెలుస్తది. ఆ సోయుంటే బాగుండు! లేకనే

గోసాయే!
ఐన ముచ్చటకు, కాని ముచ్చటకు

ఒకరికొకరు తిట్టుకొనుడు. చెంబులు,

ముంతలు.. చేతులేదుంటే దానే్న

ఎత్తేసుకునుడు. దేనిగురించి! ఏ రోజైనా

ఆలోచన రావాలా! వద్దా! ఏమో చేసినట్లు

ఇంట్లో భార్య చేతగాని అమ్మ అదురుడు.

‘నేను నీవోలె వున్నప్పుడు సెల్క పని

చేసినా, నా అత్తకు సేవ చేసినా ఏమన్నా

నీలాగా నోరు తెరిచి ఎదురు మాట్లాడిన్నా!

అమ్మ అనుడు..
అంటుకున్న కుంపటి ఆరుతదా! గాలికింక

రాజుకుంటూనే వుంటది. రోజు లొల్లేనాయె!

ఇంట్లో నరకంవలె ఉండే. ఇద్దరు

ఇద్దరేనాయే! బతుకుదెరువు ముచ్చట

ఎక్కడా! ఎంత నచ్చజెప్పినా గంతేనాయే!
నీ గూర్చి ఎంత అలోచించినా వృథే!

బూడిదలో పోసిన పన్నీరు లాగే ఉంది.

ఎందుకంటే మీరు మారే మనుషుల్లా లేరు.

మీరున్నా లేకున్నా ఒకటే! విలువల కోసం

బతికే నన్ను పిచ్చోన్ని చేయకండి!

ఆలోచించుకోండ్రి. మీ ఇష్టం. మీ కన్నా ఈ

ఆయమ్మే నయం!

- పెరుక రాజు సెల్.నం.9443091384