నెల్లూరు

పునర్జన్మ (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంధాలన్నీ చితికిపోయాక
ఆత్మలేని దేహం ఒంటరిదయిపోతుంది
అవయవ పుష్పాలు వాడిపోకుండా
అవయవదానం చేస్తున్న మనుషులు
నిజంగా కాలానికి కట్టిన జీవజండాలు
అమ్మలు చెక్కిన ఈ దేహాలు
ఒక్కసారిగా మట్టిలోకి జారిపోకుండా
మరలా మరలా చిగురించాలని
సంకల్పం చేయడం గొప్ప విషయం

కొన్ని కలలెప్పటికీ నిజాలు కావు
మానవత్వపు చిహ్నాలే ఎప్పుడూ
నిజ జీవితంలో పుష్పించి పరిమళిస్తాయి

కాలం మారిపోతూ ఉంది
దానితో పాటుగా మనుషులు కూడా
మారిపోతున్నారు
మరణించాక పనికిరాని అవయవాల్ని
మరొక దేహంలోకి ప్రవేశపెట్టి
మనిషై వెళ్లిపోవడమే నిజమైన బ్రతుకు

ఇప్పుడు మరలా బతికిపోయాక
మమతలు జీవిస్తాయి
అనురాగాలు జీవస్వప్నాల పుటల్లో చేరి
పుట్టడంలోని నిజ అర్థాన్ని చెప్తాయి
మరణించిన వ్యక్తి మరలా
ఎన్నో జీవదర్పణాల్లో కన్పిస్తాడు

ఈ చెట్లు చేమల మధ్య
ఒక జీవిలా ఎందుకు
మానవత్వం నిండుగా నింపుకుని
కాలం మీద సంతకం చేసిన
మనుషులవ్వాలి
ఆత్మీయతల్ని సాటి మనుషులకి పంచి
నిజమయిన మానవత్వాన్ని

ఆవిష్కరించాలి
మనమిప్పుడు మనుషులమవ్వాలి
మానవత్వపు పుష్పాలై పరిమళించాలి
- షారోన్ బేగం, సోమశిల
చరవాణి : 8985963150

ఎందుకు?.. ఎందుకు..?
పచ్చదనాన్ని, ప్రాణవాయువులను
బహుమతిగా మీకందిస్తుంటే నేస్తం
బాధలెరుగని మమ్ముల్ని బాధలకు
గురిచేస్తావెందుకు నేస్తం
సెగలు పొగలు నిండిన
జగతిని నిందిస్తావెందుకు?

గాలి, నీరు, మట్టితో
హాయిగా, స్వతంత్రులుగా ఎదుగుతున్న

మమ్ము
పాపం, పుణ్యమని తలవక
నాశనం చేస్తావెందుకు?
మేము ప్రేమగా చూస్తే జీవితమంతా నీకు

సేవలు చేస్తామే నేస్తం.

పందిరి వేసి, తీగలు అల్లి,
పరవశంగా మేముంటే
కరుకు యంత్రాలతో కఠినంగా నరికి
కాలుష్యం... కాలుష్యమంటూ

రోదిస్తావెందుకు
నీ కష్టసుఖాలతో అండదండగా ఉన్న

మమ్ము
కాంక్రీటు వనాల కోసం నాశనం
చేస్తావెందుకు నేస్తం!

మా జాతులను రోజూ కూల్చేస్తూ
అవసరమున్నా, అవసరం లేకున్నా
అంతం చేస్తూ
వానచుక్క రాలలేదని వరుణ దేవుడిని
నిందిస్తావెందుకు
కూర్చొన్న కొమ్మ నరికిన అమాయకుడిలా
భూగోళములో వేడెక్కిస్తున్నావే నేస్తం.

వ్యాపారాల కోసం, వాణిజ్యాల కోసం
పెరుగుతున్న జనం కోసం.. స్వార్థంతో నీవు
పచ్చని గూడులు, చల్లని నీడలు
రోజురోజుకు మాయం చేస్తున్నావెందుకు ?
భావితరాల వారికి భూగర్భ గృహాలు
నిర్మిస్తున్నావెందుకు
బుద్ధుడు, అశోకుడు, గాంధీ,
థెరిసా, రామకృష్ణుడు
రమణుడు, వివేకానందుడు,
సాయిబాబాలు చెప్పినదే
అహింసోపరమో ధర్మ:
మూగజీవుల ఎడల కరుణ
ఉద్యానవన సంరక్షణలే...
జగతికి ఆదర్శములు నేస్తం...
- లక్కరాజు శ్రీనివాసరావు,
అద్దంకి చరవాణి : 9849166951

కవితోపాఖ్యానం
కవిత అంటే
ప్రకృతిలోని గుణ తత్వాలను
రాగరంజితం చేసి
హృద్యమైన భావలహరుల్లో
పారవశ్యపు మునకలేయడం
అందుకే కవిత
మనసును తాకే ఓ మధురిమ
హృదయాన్ని మీటే ఓ సరిగమ
గుండె లోతుల్ని పలకరించే ఓ చతురిమ
అంతరంగాల్ని వెలిగించే ఓ అరుణిమ
***
కవిత అంటే
కూర్చిన ప్రతి పదం వెనుక
అనుభవాల శకలం ఉంటుంది
సమాహరించిన ప్రతి పంక్తి వెనుక
అనుభూతుల సూత్రీకరణ ఉంటుంది
పల్లవించిన ప్రతి పాదం వెనుక
కొట్టుమిట్టాడిన
ఆలోచనల అనుక్రమణ ఉంటుంది
అందుకే కవిత
ఓ సునిశిత భావాల సూక్ష్మదర్శిని
వివేకించే మనస్కుల స్థూల భావాన్ని
ప్రాకృతిక సత్యాల సుబోధిని
సమకాలీన ప్రభావాల సామాజిక ప్రయోజని
***
కవిత అంటే
చందోబద్ధయ తిగణాది ప్రాసలతో
సుదీర్ఘ సమాసాది అలంకారాలతో
అలరించునది
అందుకే కవిత
రసమయ కావ్యసుధా లహరుల్లో
విహరించే
అక్షర తరంగిణులు
పురాణేతిహాసాల పారమార్థాన్ని
సుబోధించే
కమనీయ కావ్యాలంకృతులు
కవుల డెందములో కవాతుచేసే
అక్షరాల అక్షౌహిణులు
మది శారదాదేవి పదసీమల వెలుగొందే
సహజాత్మక సాహిత్యపు
విరులాలంకృతులు
అందుకే ఎప్పటికైనా కవితలు
రసమయ భావ స్ఫోరకాలే
సద్భావనల సంస్కృతులను స్పృశించే
జనజాగృతుల జనరంజితాలు
ఎదలోని భావాలను వర్షించడానికి
అనవరతం ఎదురుచూసే
ఓ విశ్వచైతన్యపు సుందర అభిసారికలే!
- రవీంద్రబాబు, పాకాల చరవాణి : 9492935005