నెల్లూరు

కుక్క కావాలి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంజీ ఐదంకెల జీతగాడు. భార్య శకుంతల.

తనూజ, శిరీష పిల్లలు. హైదరాబాద్

మెహిదీపట్నంలో ఖరీదైన అపార్టుమెంట్‌లో

ఒక ప్లాట్‌లో నివసిస్తున్నాడు.

విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు.

వారు ఒక కుక్క షైనీని కూడా

పెంచుకుంటున్నారు. రాంజీ తల్లిదండ్రులు

కూడా వారితోనే ఉంటున్నారు.

నాలుగోతరగతి చదువుతున్న తనూజ

షైనీకి సపర్యలు చేయడంతోనే దినచర్య

ప్రారంభిస్తుంది. శిరీష కాలేజీలో బిటెక్

చదువుతోంది.
***
రాంజీ కారులో ఆఫీసుకు వెళ్తున్నాడు.

దారిపొడవునా అందరూ దినపత్రికలు

తదేకంగా చూడడం గమనించాడు. ఎందుకు

అయివుంటుందా అని అనుకున్నాడు.

కుక్క కావాలి అనే ప్రకటన ప్రముఖంగా

కన్పిస్తోంది. చివరగా కుక్క ఇచ్చినవారికి

బహుమతి కూడా భారీగా ఉంటుందని

చెప్పడంతో అందరూ దాని గురించే

చర్చించుకోవడం కూడా గమనించాడు.

ఓహో తాను నిన్న ఇచ్చిన ప్రకటనకు

అంత స్పందన ఉందా అని అనుకుంటూ

ఈరోజు రాత్రిలోగా షైనీ తనూజ చెంతకు

చేరుతుందని మనసులో అనుకుంటూ

కారును పార్కింగ్ చేసి చకచకా మెట్లెక్కేసి

ఆఫీసు సీటులో కూలబడ్డాడు. అప్పటికి

సమయం పదిన్నర.
***
అందరూ లంచ్‌కు రెడీకండి అని మైక్‌లో

అనౌన్స్‌మెంట్ రాగానే సుధాకర్, అతని

భార్య సుగుణమ్మ డైనింగ్ హాలులో టేబుల్

ముందు కూర్చున్నారు. అందులో ఒకావిడ

అందరికీ భోజనం సర్వ్ చేస్తోంది. అందరూ

సంతృప్తిగా తింటున్నారు. గేటు వద్ద తోక

ఊపుతూ షైనీ సుగుణమ్మవైపే చూస్తోంది.

సుగుణమ్మ త్వరగా భోజనం కానిచ్చేసి

చివరగా ఓ ప్లేట్‌లో కొంత అన్నం తీసుకుని

గుమ్మం బైట ఉన్న షైనీకి పెట్టింది. తోక

ఊపుతూ అన్నం తింది. మధ్యాహ్నం

భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుంటూ

సుగుణమ్మ సుధాకర్‌తో ఇలా అంది

‘మానవుల కన్నా మూగజీవాలే నయం

కదండీ’ ఒక్క ముద్ద అందిస్తే చాలు

విశ్వాసంగా ఉంటాయి. మన గారాల పట్టి

రాంజీ మనల్ని వృద్ధాశ్రమంలో చేరిస్తే

మనల్ని నమ్ముకున్న షైనీ మనతోనే వచ్చి

గేటుబైట ఉండడం ఆ జాతి విశ్వాసం

మరిచిపోగలమా చెప్పండి’ అంది. నిజమేనే

అందుకే ‘నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో

మనిద్దరమూ ఆప్తబంధువు’ సినిమాకు

వెళ్లాం గుర్తుందా ఆ సినిమాలో ‘అనగనగా

ఒకరాజు అనగనగా ఒక రాణి.. రాజు మనసు

వెన్న... కొడుకులతో రాజు కుక్కను కూడా

పెంచాడు’ అంటూ పాటే పెట్టారు. కొడుకులు

తల్లిదండ్రులను చీదరించుకున్నా వారితో

పాటు అదే ఇంటిలో పెంచుకుంటున్న కుక్క

వారికి అండగా ఉండడాన్ని ఆ పాటలో

చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఆ

దృశ్యమే ఇప్పుడు మన కళ్లకు కడుతోంది.

ఏమంటావు’ అన్నాడు. ఔనండి ‘చాలాకాలం

కిందటే మన వాళ్లు భవిష్యత్‌ను ఊహించి

సినిమాలు తీశారు’ అంది. అలా పిచ్చాపాటి

మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకున్నారు.

గేటు బైట షైనీ తన యజమానితో పాటు

వచ్చి వారం రోజులైనా ఇంటి ముఖం

పట్టలేదు. వృద్ధాశ్రమం గేటుబైటే ఉంది

సుగుణమ్మ చేతి ముద్దకోసం పరితపిస్తూ.
ఎప్పటిలాగే సాయంత్రం 5 గంటలకు ఇంటికి

చేరుకున్నాడు రాంజీ . ఫ్లాట్‌కు

చేరుకోడానికి మెట్లెక్కుతుంటే ఒక డాక్టర్

తన ఇంటిలోనుంచి వెలుపలకు రావడం

చూసి అతన్ని చిరునవ్వుతో పలకరించి

ఒక్క ఉదుటున ఇంట్లోకి వెళ్లాడు. ఏమైంది

అని కళ్లతోనే భార్యను ప్రశ్నించాడు.

తనూజకు ఒకటే జ్వరమండి ఒళ్లు

కాలిపోతోంది. హై ఫీవర్‌గా ఉంటే భయమేసి

డాక్టర్‌కు ఫోన్ చేశా.. అతను వచ్చి చూసి

ఎవరిపైనో బెంగ పెట్టుకున్నట్టు

అనిపిస్తోందని చెప్పి టానిక్, టాబ్లెట్లు ఇచ్చి

వెళ్లారండి’ అంది. ఎవరిపై బెంగ నాన్మమ్మ,

తాతపై బెంగా అనుకుని. అలాంటిదేమీ

ఉండడానికి అవకాశమే లేదు. ఎందుకంటే

ముసలివాళ్లు ఇద్దరూ ఇంట్లో ఉన్నమాటే

కాని ఎప్పుడూ వాళ్లదగ్గర అంత చనువూ

లేదు. అలాంటప్పుడు వారిపై బెంగ ... నో

నెవర్ అనుకుంటూ గదిలోకి వెళ్లి డ్రస్ చేంజ్

చేసుకుని సోఫాలో కూలబడ్డాడు. చేతిలో

రిమోట్‌తో చానల్స్‌ను ఒక్కొక్కటే

మారుస్తున్నాడు. ఎందులోనూ తనకిష్టమైన

ప్రోగ్రాం రాకపోవడంతో ఆఫ్ చేసి తనూజ

వద్దకు వెళ్లాడు. మంచంపై కూర్చుని

నుదుటిపై చెయ్యివేసి మృదువుగా

అదిమాడు. అమ్మా అంటూ

మూలుగుతోంది. షైనీ అంటూ

పలవరిస్తోంది. పాపం తనూజకు ఎంత కష్టం

వచ్చింది. పదేళ్లలోనూ ఇంత జ్వరం వచ్చి

మంచాన పడిన దాఖలాలు లేవు. ఇప్పుడు

ఎందుకిలా అంటూ ఒకింత బాధ పడ్డాడు.
***
ముసలివాళ్లతో మనకేంటి పని అని భర్త

ముందు ఒకటే పోరేది రాంజీ భార్య

శకుంతల. భార్య శకుంతల పోరు పడలేక

అయిష్టంగానే తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో

చేర్పించాడు రాంజీ. వారి బాగోగులకు కొంత

సొమ్ము కూడా ఆశ్రమ నిర్వాహకులకు

ఇచ్చాడు. తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో

చేర్పించాక ఇల్లంతా వెలితిగా అనిపించింది.

ఎప్పుడూ నిండుగా ఉండే ఇల్లు ఖాళీగా

అన్పించింది. పిల్లలిద్దరూ స్కూలుకు

వెళ్లడం, తాను ఆఫీసుకు వెళ్లడంతో ఇల్లంతా

బోసిపోయింది. తోక ఆడిస్తూ వెంట తిరిగే

షైనీ కూడా కన్పించలేదు. అయితే ఆ

విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు

రాంజీ. మంచాన పడిన తనూజ షైనీ

అంటూంటే ఇంట్లో ఇన్నాళ్లూ పెరిగిన షైనీ

ఏమైందన్న ప్రశ్న తొలిసారి ఉదయించింది

రాంజీ మదిలో. గబగబా లోనికి వెళ్లి

‘శకుంతలా మన షైనీ ఏది’ అని అడిగాడు.

‘ఏమోనండి బైటకెళ్లి తిరిగి వస్తుందని చూశా

రాలేదు’ అంది. ఇంకో గదిలోకి వెళ్లి ఫోన్లో

చాటింగ్ చేస్తున్న శిరీషను పిల్చి షైనీ

గురించి తెలుసా అని అడిగాడు. ‘ఏమో

నాన్నగారూ నేను గమనించట్లేదు’ అని

అంది ఫోన్లోనుంచి తలతిప్పకుండానే.
ఆ రాత్రి ఎలానో పడుకున్నాడు. పక్కపై

అటు ఇటు దొర్లాడు. నిద్ర పట్టలేదు. తన

గారాల పట్టి తనూజను బతికించుకోవాలంటే

షైనీని తీసుకురావాలి. అని

నిశ్చయించుకున్నాడు. తెల్లారిన తర్వాత

కాఫీ తాగుతూ పేపరు ముందేసుకున్నాడు.

అందులో వార్తలతోపాటు వివిధ ప్రకటనలు

కూడా కన్పించడంతో మన షైనీ గురించి

కూడా ప్రకటన ఇస్తే పని సులువు

అవుతుంది కదా అని భావించాడు.

ఆలోచన వచ్చిందే తడవుగా ఆఫీసుకు

బయల్దేరే సమయంలో సికింద్రాబాద్

సరోజినీ దేవిరోడ్డులో ఎప్పుడు బిజీగా ఉండే

ఆంగ్ల దినపత్రిక కార్యాలయానికి వెళ్లాడు.

తన ఫోన్‌లో షైనీతో తనూజ సెల్పీ దిగిన

ఫోటోలను చూపించి ఈ కుక్క కన్పించడం

లేదని యాడ్ ఇచ్చాడు. తీసుకొచ్చిన వారికి

బహుమానం కూడా అని ఆ యాడ్‌లో

ప్రకటించాడు. అలానే ఆఫీసుకు

వెళ్లిపోయాడు.
***
మరుసటిరోజు షైనీ ఆచూకీపై సమాచారం

అందుతుందని భావించాడు. కాని ఒక్క

ఫోనూ రాలేదు. మరుసటి రోజు ఒక ఫోన్

వచ్చింది. మీ కుక్క మా వద్ద ఉందని.

రాంజీ ఆనందానికి అవధుల్లేవు. షైనీని

పట్టుకొచ్చి తనూజకు ఇస్తే స్వస్థత

పడుతుందని అనుకుంటుండగా ఫోన్‌లో

అవతలి వ్యక్తి చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు.

కారులో అలా వెళ్తుంటే ఆ ప్రాంతం గతంలో

వెళ్లినట్టు గుర్తుకొస్తోంది. అలా కొంచెం

దూరం వెళ్లి అక్కడ ఒక చోట ఆగాడు. అది

వృద్ధాశ్రమం. తన తల్లిదండ్రులను దింపింది

అక్కడే. కారు దిగి లోనికి

అడుగుపెడుతున్న సమయంలో తోక

ఊపుతూ రాంజీ కాళ్లచుట్టు చేరి తిరగడం

ప్రారంభించింది షైనీ. లోనికి వెళ్లి వృద్ధాశ్రమం

మేనేజర్‌ను కలిసి ఫోన్ చేసింది మీరేనా అని

అడిగాడు. అవునండి నేనే. గత వారం మీరు

వదలి వెళ్లిన మీ అమ్మానాన్నలతో పాటు

ఒక కుక్క కూడా వచ్చి ఇక్కడే గేటు

బయట ఉంటోంది. ఈరోజు దినపత్రికలో

యాడ్ చూసి సుగుణమ్మగారు

మనవరాల్ని గుర్తుపట్టి మీకు ఫోన్

చేయమన్నారు. అందుకే ఫోన్ చేశాను.

ఇదుగో మీ షైనీ అని అందించాడు. తన

తప్పును తెలుసుకుని రాంజీ తల్లిదండ్రులను

కూడా కారులో ఎక్కించుకుని ఇంటిముఖం

పట్టాడు. తల్లిదండ్రులు ఇంట్లోకి

అడుగుపెడుతుండగా షైనీని చూసిన

ఆనందంలో నాన్నమ్మా అంటూ తనూజ

సుగుణమ్మ ఒంట్లో వాలిపోయింది. షైనీ

గుమ్మం వద్దే తోక ఊపుతూ

ఉండిపోయింది.

- గౌతమి, నెల్లూరు 9347109377