విజయవాడ

ప్రజల మనిషి టంగుటూరి (నివాళి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఆంధ్ర రాష్ట్రంలో ఎందరో నిస్వార్థ రాజకీయ నాయకులు ఉదయించారు. నిర్భీతి, నిజాయితీ, ధైర్య సాహసాలు కలిగిన అలాంటి నాయకుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు అగ్రగణ్యులు. ప్రకాశం గారు ప్రజల మనిషి. ‘ఆంధ్రకేసరి’ బిరుదుతో ఆయనను ప్రజలే సత్కరించుకున్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన బారిష్టరుగా పట్టా పొంది అపార ధనరాశులు సంపాదించారు. ఆ మొత్తాన్ని నిస్వార్థంగా ప్రజల కోసమే ఖర్చుచేశారు. ప్రకాశం పంతులు గారి స్వగ్రామం టంగుటూరు. వారి ఇంటిపేరు కూడా టంగుటూరు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మ. ఆయనకు 12వ ఏటనే తండ్రి మరణించారు. ప్రకాశం గారికి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారితో పరిచయ భాగ్యం కలిగింది. నాయుడు గారు ప్రకాశం గారికి అనేక విధాలుగా సహాయపడ్డారు. ప్రకాశం గారు భారత జాతీయోద్యమ నాయకుల్లో అగ్రగణ్యులని భారతరత్న ఇందిరా గాంధీ ప్రశంసించారు. ‘బ్రిటీష్ తుపాకులకు గుండె చూపిన సాహసి’ అని మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆయనను కీర్తించారు. నిస్వార్థ ప్రజాసేవకులైన ప్రకాశం గారు గొప్ప త్యాగమూర్తి. ఆయన ధైర్య సాహసాలు, శక్తిసామర్థ్యాలు అనన్య సామాన్యమైనవి. ప్రకాశం గారు ఆంధ్రుల ముద్దుబిడ్డ. 1953లో ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు మోసిన ప్రకాశం పంతులు గారు రైతులకు భూమిశిస్తు రద్దు చేశారు. జమీందార్లను తొలగించారు. తన సర్వస్వాన్నీ ప్రజల శ్రేయస్సు కోసం ఖర్చుచేసి, ప్రజాసంక్షేమానే్న కలగంటూ 1957లో మనకు దూరమైన ‘ఆంధ్రకేసరి’కి సదా సలామ్.
(23న జయంతి సందర్భంగా..)

- త్రిలోచన్ జంపని, 7వ తరగతి, గుంటూరు. చరవాణి : 9052716555