విజయవాడ

ఈ నగరానికి ఏమయ్యింది? (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నగరానికి ఏమయ్యింది?
ఒకపక్క ఆధునికత పేరుతో పబ్బులు
మరోపక్క కూలగొడుతున్న
కట్టడాల మట్టికుప్పల దిబ్బలు!!

ఈ నగరానికి ఏమయ్యింది?
రెండు దశాబ్దాల క్రితం
నాయకుడి హత్యకు ప్రతీకారంగా
భవనాల తలల్ని నేలరాల్చి
ఇటుకల గూడుల్ని
గుట్టగా పోసేస్తే
మళ్లీ ఈ దేహం కొత్తందాలతో
మొలకెత్తినందుకు ఆనందించింది

ఈ నగరానికేమయ్యింది?
రాజధాని హంగులకు
రోడ్డుపక్క అంగళ్లను
బలివాడగా వెలివేసి
బడా మాల్స్ వెలిసి మురిసి
మెరిసిపోయింది!!

ఈ నగరానికి ఏమయ్యింది?
గుళ్లు, బళ్లను రాలగొట్టి
రోడ్డు నోటిని విశాలపరుస్తుంటే
ఈ నగరం మహానగరమై
సుందరవదనంతో దర్శనమిస్తోందన్న
ఆశ చిగురించి పెద్ద దోశగా
కళ్ల ముందు నోరూరించింది!!!

కాని, ఈ నగరానికి ఇప్పుడేమైంది?
రోడ్డు అంచుల నుంచి
నివాసాలను వేరుచేసేసి
మనుషుల్ని నగరం నుంచి
వెలివేసేసి
బెజ్జవాడగా పిలిచే నగరాన్ని
బెజ్జాలవాడగా తూట్లు పొడిచేసి
‘నుజ్జువాడ’గా-
ఆనవాళ్లు చెరిపేసే
‘మరుగుజ్జు వాడ’గా
అమరావతి అనకొండ నోటికి
ఆహారమై జీర్ణించుకుపోతోంది!
అజీర్ణ తేన్పులు తేన్చడానికి
సంసిద్ధమైపోతోంది!!
- చలపాక ప్రకాష్,
విజయవాడ.
చరవాణి : 9247475975

క్షతగాత్రం..
సమాజ జీవన చిత్రం
మారుతున్న జీవన విధానం
అడుగడుగునా స్వార్థం
ఆర్థిక బంధనాల చీకటిలో
మానవ విలువలు భూసాయ్థపితం
క్షతగాత్రం సమాజ జీవన చిత్రం
తల్లి ప్రేమకీ, కన్నీటికీ
ఖరీదు కడుతున్న రాక్షసత్వం
వలస పక్షుల వైపు చూసి
మాతృభూమి గర్భశోకం
యంత్రాలతో పనిచేసీ చేసీ
మనిషి కూడా యంత్రంగా
మారాడన్నది నిజం
క్షతగాత్రం సమాజ జీవన చిత్రం
అడుగడుగునా ఎదురుదెబ్బలతో
కుంటి నడక నడుస్తున్న ఆదర్శం
అబద్ధాల తెరల వెనుక
క్షీణించిపోతున్న మానవత్వం
ఎదురుగా ఎన్ని ఘోరాలు జరిగినా
నాదాకా రాలేదుకదా..
అనుకునే అచేతనత్వం
క్షతగాత్రం సమాజ జీవన చిత్రం
ఏదీ ఈ ప్రశ్నకు సమాధానం?
ఎటువెదికినా అంతా చీకటిమయం
గురువులే మార్గదర్శకులై
చూపించే మెరుపుల దారిలో
మారాలి మన జీవన మార్గం
అప్పుడే సమాజం..
నవచైతన్య
సజీవ చిత్రం!
- ఇనగంటి సువర్ణ, విజయవాడ. చరవాణి :

ముసుగు!
మనందరికీ అన్నీ తెలుసు
బతకడమెలాగో
ఇంకా బాగా తెలుసు
ఐనా..
ఎందుకో ఎదుటివారితో గొడవ
ఇదొక ముసుగు!
నేను చేసేదే ఒప్పంటూ
నా అవసరాల్ని తీర్చేసుకుంటూ
ఆత్మగౌరవాన్ని అవతలకు నెట్టి
బలహీనుణ్ని అణచివేస్తూ
బ్రహ్మాండంగా బతికేస్తున్నానని
అనుకుంటున్నాను!
ఇది మరో ఆత్మవంచన ముసుగు!
స్నేహితునికి అభయమిచ్చి
అర్థించిన నాడు
కాదుపొమ్మంటే
అదో నమ్మకద్రోహమనే ముసుగు!
ఏదో సాధిద్దామని
ఆశయం అనే దురాశ కలిగితే
చిత్తశుద్ధి లేని
పదిమందినీ పోగుచేసి
గతానుభవాల్ని సమాధి చేసి
సమాజాన్ని ఉద్ధరిద్దామని పయనిస్తే
ఇది కీర్తి కండూతి ముసుగు!
మార్పు అనివార్యం
అది మనోగతంతోనే సాధ్యం
అందుకే..
ఈ ముగుసులన్నిటినీ పెకలిస్తూ
ఈ క్షణం నుంచే
ఆత్మపరిశీలనతో
సాగాలి మన పయనం!!
- గోలి మధు,
మంగళగిరి
చరవాణి : 9989186883