విజయవాడ

సహకార సుఖం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మటన్‌కొట్టు మస్తాన్ తన పదునైన కత్తితో దడదడా మాంసాన్ని కొట్టేస్తున్నాడు. అతగాడి పనితనాన్ని పరికిస్తూ తన తోకాడిస్తూ నాలుక బయటకు వదిలేస్తూ, కళ్ళప్పగిస్తూ చూస్తోంది కనకమనే శునకం. మస్తాన్ తనకు అవసరం లేని అడుగూ మడుగూ, దుమ్ము, వ్యర్థమూ దానికి పడవెయ్యడం, దాన్ని చకచకా నోట కరుచుకొని పారిపోవడం జరుగుతూ ఉంటాయి. అప్పుడు గట్టిగా పిక్కున్న కుక్కకే కక్క ముక్క చిక్కుతుంది. కనకం మస్తాన్ విసరబోయే ముక్కకోసం చూస్తోంది. అదిగో విసిరాడు.... ఓ ముక్క... సంబరపడిపోయి అందుకోబోయేసరికి ఎక్కడి నుండి వచ్చిందో ఒక దుక్కలాంటి కుక్క చటుక్కున ముక్కను లాగేసుకొని ఈ బక్క కుక్క పీకను తొక్కేసి, నొక్కేసి, రక్కేసి ఎంచక్కా పారిపోయింది. నోటి కాడ ముక్క దక్కకుండా పోయిందని దిక్కుతోచని బక్క కుక్క బిక్క ముఖం వేసుకొని దిక్కులు పిక్కటిల్లేలా నక్కలాగ ఓండ్ర పెట్టింది. ఈ కుక్క గోలకు తిక్కరేగిన ఓ పనివాడు దుక్కలాంటి కర్రను టపీమని దానిపై విసిరాడు. కుయ్యో మోర్రో అంటూ కాళ్ళకు బుద్ధి చెప్పి వీధి చివరకు చేరింది. ‘అయ్యో! నేనెంత వెర్రిదానిని? నా నోటికాడ ముక్కను ఆ దుక్కకుక్కకు చిక్కపెట్టాను... నాకు బలం తక్కువవడం వల్లనే కదా! ఇలా జరిగింది! సరే నా కండబలంతో ఏదీ సాధించలేకపోతున్నాను. బుద్ధి బలంతో ఆహారం సంపాదించుకుంటాను’ అనుకుంది. అలా నడుచుకుంటూ వెళుతుంటే ఓ కాకి తన నోట ఓ మాంసం ముక్క నోట పట్టుకొని కూర్చుని కనిపించింది. అది చూసిన కనకం కాకిని ప్రేమగా పలకరించింది. ‘‘కాకిబావా! నాకు మనసు బాగులేనప్పుడల్లా నీ పాట వినాలనిపిస్తుంది. దయచేసి నీ మధురమైన స్వరంతో ఓ పాట పాడవా?’’ అని కోరింది. తన పాటకు ఓ అభిమాని ఉన్నాడని మైమరచి, ఒళ్లు మరచి, నోరు తెరచి పాట పాడింది. కాని నోరు తెరచి పాట పాడడం, మాంసం ముక్క నేల జారడం, జారిన ముక్కను కనకం నోట కరుచుకు పారిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి.
మాయల మారి కుక్క మాటలకు ముక్కను జార్చుకుని బేజారైన కాకి ‘అయ్యో! నేనెంత వెర్రిదాన్ని ఎవరో పొగిడితే వెనకాముందూ చూడకుండా మోసపోయాను! ఇది నాకొక పాఠం’ అనుకుంది.
తన నోట్లో ముక్కను ప్రశాంతంగా తిందామని పరుగులు తీస్తోంది కనకం. మధ్య మార్గంలో ఒక కాలువపై తాటిమాను వంతెనను దాటుతూ ఉండగా కింద కాలువలో ఓ కుక్క నోట మాంసం ముక్క పట్టుకొని కనిపించింది. ఆతృతతో ఆ కుక్క నోట్లోది కూడా లాగేసుకోవాలని మొరిగింది. తక్షణం తన నోట్లో ముక్క కాస్త కాలువలో పడింది. ‘అయ్యో! ఎంత పని చేసాను. దొరికిన దానితో తృప్తి పొందక తప్పుగా ఆశపడ్డాను’ అనుకుంటూ బాధపడింది. కనకాన్ని గాలిలో వెంబడిస్తూ వస్తున్న కాకి ఇది గమనించి కాలువలో తేలుతున్న ముక్కను రయ్యన వాలి నోట కరచుకొని రివ్వున ఎగిరిపోయింది. తిక్క తీరిపోయిన కుక్కకు చుక్కలు కనపడి కాకిని మళ్ళా కాకా పట్టడానికి బయలుదేరింది.
‘‘కాకి బావా! నన్ను క్షమించు ఇందాక నీ పాట పూర్తిగా వినలేదు. ఈలోపు నాకు ముక్క దొరికితే వెళ్ళిపోయాను. మళ్ళీ పాడవా?’’ అని ప్రాధేయపడింది.
‘ఒకే రకం మాయ మాటలకు రెండుసార్లు ఎందుకు మోసపోతాను?’ అనుకొని తన నోట ముక్కను కాళ్ళమధ్య గట్టిగా పట్టుకొని పాడింది.. కనకం వెర్రి చూపులు చూస్తూ తోకాడించింది. కాకి తన మాంసాన్ని ఆరగించింది. కనకం తీవ్ర ఆలోచనలో పడింది. ‘అయ్యో! నేను తోటి కుక్క చేతిలో ఓడిపోయాను. మోసం చేసి కాకి నుండి సంపాదించిన ముక్కను తిని సంతృప్తి పొందక దురాశతో కాలువలో జారవిడుచుకున్నాను. నాకు బలమూ లేదు, తెలివీ లేదు, ధర్మము లేదు, బ్రతుకు తెరువూ లేదు ఏమిటి దారి?’ అని విచారించింది. ఏదో ఆలోచన తట్టింది. వెంటనే కాకిని సమీపించి ‘కాకి బావా! నేను నిన్ను మోసం చేయాలని చూసాను. నాకు తగిన శాస్తి జరిగింది. నన్ను క్షమించు. ఇక మీదట నుండి మనమిద్దరం మంచి స్నేహితులుగా ఉందాం’ అని ప్రాధేయపడింది.
‘అబ్బో! ఇదేమిటీ! ఇదో కొత్తరకం పన్నాగమా? నేను నీతో స్నేహం చేయను’ అని కాకి బదులిచ్చింది. ‘కాకి బావా! దయచేసి నా మాట విను... నాకు సరియైన స్నేహితులు లేక ఆహారం దొరకడం కష్టంగా ఉంది. నేను చక్కగా పరిగెత్తగలను. నీవు ఎంచక్కా ఎగరగలవు మనిద్దరం కలిస్తే సులువుగా ఆహారం సంపాదించుకోవచ్చు. నీకు నమ్మకం కలగడానికి ననే్నమి చేయమన్నా సిద్ధమే’ అంది.
తను చెప్పింది సబబుగా అనిపించి సరే అంది కాకి. ‘ఇదిగో చూడు. నేను గాలిలో ఎగురుతూ ఎక్కడ ఏ ఆహారముందో నీకు చెబుతాను. నీవు పరుగున వెళ్ళి సంపాదించు. ఈలోపు ఎవరైనా వస్తే సూచన ఇస్తాను. నీవు అప్రమత్తమవ్వాలి. ఇద్దరం ఒకరికొకరం సహకరించుకుందాం. మళ్లా నీవు నన్ను మోసం చేయాలని చూస్తే నష్టపోయేది నువ్వే’ అంది. ఆ మాటకు కనకం సంతోషించింది. ఇద్దరి స్నేహం కుదిరింది. పరస్పర సహకారంతో సుఖంగా జీవనం సాగించాయి.

- చావలి శేషాద్రి సోమయాజులు చరవాణి : 9032496575.