విశాఖపట్నం

దేశానికి ఏమిచ్చా? (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మనిచ్చు అమ్మను
వృద్ధి చేయు నాన్నను
చదువు నేర్పు గురువును
బతుకునిచ్చు గాలిని
కడుపు నింపు ఫలమును
భార్య అనే స్వర్గమును
మోక్షమిచ్చు గీతను
అందించెను నీ దేశం
ఏమిచ్చిందని అడగకు
ఈ దేశానికి నేను
ఏమిచ్చానో అని
గుండెలపై చేయుంచుకు
ప్రశ్నించుకో ఒక్కసారి
- విద్వాన్ ఆండ్ర కవి మూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.

నిరీక్షణ
నిరీక్షణ ఆనందమే జనవాహిని

నిరంతరయాన
అంతర్భాగమే నిరీక్షణ
పరుగులిడే ప్రవాహానికి
కొండకచో అడ్డుకట్ట వేయాలి
ఆనకట్ట కట్టాలి
ప్రవాహం ఉద్ధృతం కాకపోతే
సంతోషమే
మనసుకూ అప్పుడప్పుడూ కలిగే
పరవశమూ సంతోషమే
మనసు నిశ్చలతలో, నిలకడలో
సంతోషపు పరమావధి సాధించాలి
ఆనంద హేలలనధిగమించాలి
మనసు డోలాయమానమై
వర్తమానంలోనే స్పందించాలి
ఆనందపు లోగిటిలోలను క్షణం
ప్రతిస్పందించాలి
నిరంతర జీవనయానంలో
జీవన వాహినిలో నిరీక్షణ
అంతర్భాగమై
ప్రతిఫల సాధనతో
దానికై వీక్షణతో
ఎదురు చూచే ఆశే నిరీక్షణ
సాధించని ఫలంతో ఫలితంతో
నిరీక్షణతో నిట్టూర్పే
కాస్తంత మన:స్వాంతన
- యలమంచిలి శివాజీ,
పినగాడి రోడ్డు,
పెందుర్తి మండలం,
విశాఖపట్నం-530047.

కొత్తదనం
మనిషి ఆలోచన తన గురించే
తాను అనుకున్నది
తప్పక జరగాలని
తన అభిప్రాయమే సరైనదని
చేతి నిండా పనుంటే
ఆలోచనలకు
అవకాశం ఉండదు
ఆర్థిక స్థితి బాగుంటే
ఆలోచనలు బాగుంటాయా?
మనిషి ఇంటైనా బయటైనా
గుర్తింపు కోరుకుంటాడు
పదవి, అధికారం, హోదా
పేరేదైనా
మనిషి కోరుకుంటాడు
- జి. కృష్ణకుమారి,
బాబామెట్ట,
విజయనగరం.
సెల్ : 9441567395.