విశాఖపట్నం

అమ్మలాంటి అత్త (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చూడమ్మా వేదిత మంచి కుటుంబంలో

నుండి వచ్చిన దానివి. పైగా చదువుకున్న

దానివి. నీకు నేను కొన్ని జాగ్రత్తలు

చెప్పాలమ్మ. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి

అంటారు పెద్దలు. అలాగని ఒక్కొక్కరికి

ఒక్కో రకం వంట చెయ్యమని కాదు నేను

చెప్పడం. ఏ పని చేసినా, ఏ వంటకం

వండినా కాస్త రుచిగా, శుచిగా ఉండాలమ్మ.

మగవాళ్లు కష్టపడి మధ్యాహ్నం, రాత్రి

భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఏ

విషయంలో కూడా వాళ్లకి బాధ గాని,

విసుగు గాని కలిగించకుండా మనం

మసలుకోవాలి’’ అంటూ అత్తగారు

సుదీర్ఘపాఠం పీకేసరికి కొత్తకోడలు వేదితకి

కొంచెం బాధనిపించింది. కారణం పెళ్లై

మునె్నల్లు దాటినా, తను చదువుకున్న

దాన్నైనా, ఇంట్లో అందరి మనసులు

తెలుసుకుని తన పని తాను

చేసుకుపోతున్నా ఇదేమిటి అనుకుంది.
ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు

అయిదుగురు. అత్తగారు, మామగారు, భర్త

సందేష్, పెళ్లికి ఎదిగిన ఆడపడుచు

సునంది. భర్త తనని ప్రేమగానే

చూసుకుంటున్నారు. మామగారు,

ఆడపడుచు కూడా సరదాగా, ఆప్యాయంగా

ఉంటారు. అత్తగారే ఏదో ఒక సాకుతో కొంచెం

కోపంగా హెచ్చరికలు చేస్తున్నారు. నిజంగా

తాను చేస్తున్న సేవల్లో లోపాలున్నాయా?

వేదిత మనసులో బాధ సుడిగాలిలా

లేచింది.
‘‘వేదీ’’ భర్త పిలుపుతో వంట గదిలోని వేదిత

పడగ్గదిలోకి వెళ్లింది. అప్పటికే సందేష్ లేచి

పేపరు చదువుతున్నాడు. భార్యను

ముద్దుగా ‘వేది’ అని పిలుస్తాడు సందేష్. ఆ

పిలుపుకే ఎంతో సంబరపడిపోతుంది వేదిత.
‘‘ ఏమిటోయ్ ఈ ఉదయం టిఫిన్’’ ఆమె

చేతిని ఆప్యాయంగా నిమురుతు అడిగాడు

సందేష్. ఆ ఆప్యాయతకే వేదిత తనువంతా

పులకరించిపోతుంది.
‘‘ఉప్మా పెసరట్టు’’
‘‘అల్లుడు మామలన్న మాట’’ భర్త అలా

అనగానే వేదిత నవ్వింది. ‘‘అదేమిటి’’ అంది.
‘‘అమోఘమైన ఆ జోడీని అలాగే అంటారు.

కానీ సారీ వేదిత. కడుపులో కొంచెం

గందరగోళంగా ఉంది. మరోసారి నువ్వు

చేసినప్పుడు తింటాను, నేను వెళ్లేటప్పుడు

కాఫీ మాత్రం నీ చేత్తో ఇవ్వు చాలు’’ అని

సందేష్ అనేసరికి ఒకింత బాధ పడింది

వేదిత.
‘‘మీ ఇష్టం’’ అంటూ వంటగదిలోకి

వెళ్లిపోయింది.
‘‘అబ్బాయి టిఫిన్ చెయ్యకుండా

వెళ్లిపోయాడేంటి? ఏమైనా గొడవలా’’

అత్తగారు అడిగింది.
‘‘్ఛ అదేం లేదండి. కడుపులో బాగా

లేదంట. అందుకే ముంచు చూపుతో కాఫీ

మాత్రమే తాగి వెళ్లారు’’ అంది వేదిత.
అయితే ఆ సమాధానం నచ్చలేదు

అత్తగారికి.
‘‘చూడమ్మా కొన్నికొన్ని చిన్న సమస్యలని

ఊరుకుంటే అవే మును ముందు పెద్ద

సమస్యలుగా మారి కాపురాలను

చిన్నాభిన్నం చేస్తాయి. జాగ్రత్త ఏదైనా

సమస్య ఉంటే నిర్భయంగా నాతో చెప్పు’’
‘‘అబ్బే మీరు భయపడుతున్నంత

సమస్యలు మా మధ్య ఏవీ లేవండి. మేము

హ్యాపీగానే ఉన్నాం’’ అంది వేదిత.
‘‘జాగ్రత్తమ్మ’’ అని మెల్లగా సుందరకాండ

చదవడానికి తన గదిలోకి వెళ్లిపోయింది

అత్తగారు.
ఎంత సర్దుకుపోతున్నా వేదిత మనసు

అత్తగారి ధోరణికి బాధపడకుండా

ఉండలేకపోతుంది.
ప్రతిరోజూ ఏదో ఒక సాకుతో అత్తగారు

హెచ్చరించడం, జాగ్రత్తలు చెప్పడం ఈ

మధ్య మరీ ఎక్కువైపోయాయి. ఎందుకిలా

జరుగుతుంది. అత్తగారు పెత్తనం

చెలాయిస్తున్నారా? ఇంట్లో కోడలే

నెంబర్‌వన్ అయిపోతుందని భయమా?

అత్తగారికి ఇచ్చే గౌరవం ఆమెకు

ఇస్తున్నానే. ఇంకా ఎందుకీ సాధింపులు?

ఆలోచనలతో వేదిత మనసు, శరీరం

భారంగా అనిపించింది. ఈ రోజు అత్తగారి

విషయం ఏదో ఒకటి తేల్చేయాలి అని

నిర్ధారించుకుంది.
వంట పూర్తి చేసింది. మధ్యాహ్నం అందరి

భోజనాలు అయ్యాక విశ్రాంతి

తీసుకుంటున్న భర్త పక్కన కూర్చుని

వేదిత కళ్లనీళ్లు పెట్టుకుంది. కంగారు పడ్డ

సందేష్ ‘‘ ఏమైంది’’ అంటూ ప్రశ్నించాడు.
వేదిత ఏడుస్తూ భర్తను ఒక్కసారిగా

కౌగలించుకుంది. అత్తగారి తీరును భర్తకి

చెప్పింది.
‘‘ప్రతిరోజు చేస్తున్న పనుల్లో లోపాలు

ఎత్తిచూపడం, హెచ్చరించడం చేస్తున్నారు.

నేను ఎవరికీ ఏ లోటూ రానివ్వకుండా

తల్లికన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను.

ఇంకా ఆమెకు నాపై ఆ చిన్నచూపు

ఏమిటి? ఆ హెచ్చరికలకు అర్ధమేమిటి?’’

ఏడుస్తూనే బాధను వెళ్లగక్కింది వేదిత.
పకపకా నవ్వుతూ భార్యని ఆప్యాయంగా

అక్కున చేర్చుకున్నాడు సందేష్.

‘‘పిచ్చిదానా ఇవన్నీ మా అమ్మ నాకు

ప్రతిరోజు చెబుతూనే ఉంది. నువ్వు ఇంట్లో

కొత్త కోడలిగా అడుగు పెట్టిన మొదటి

నెలలోనే ఒకరోజు మా అమ్మ నాతో

ఏమందో తెలుసా? బాబూ కోడలి

విషయంలో ఇలా అంటున్నానని ఏమీ

అనుకోవద్దు. అమ్మాయి చాలా తెలివైనది.

పనిమంతురాలు. కానీ ఏ విషయంలోనైనా

కీడెంచి మేలంచాలన్నారు మన పెద్దలు. ఏ

మనిషికైనా పొగడ్తలు, ప్రేమలు కొంచెం

గర్వానికి కారణం అవుతాయి. అప్పుడే

మనిషిలో, చేసే పనుల్లో మార్పు ప్రారంభం

అవుతుంది. కోడలి విషయంలో అందుకే

ముందు జాగ్రత్తగా నేను కొన్ని నిర్ణయాలు

తీసుకున్నాను. నువ్వు ఓకే అంటే అవి

ఆచరణలో పెడతాను అంది. అమ్మ

ప్రవర్తనకు అదే కారణం. నువ్వు

అనుకుంటున్నట్లు అమ్మ అత్తగారి

హోదాలో నీకు చెప్పడంలేదు. నీ

విషయంలో మా అమ్మ తల్లిలాంటి అత్త.

అత్తగారింట్లో అందరూ నిన్ను ఆప్యాయంగా

చూస్తే ఎక్కడ నీలో మార్పు వస్తుందోనని

అమ్మ భయం’’ భర్త మాటు విన్న వేదిత

కళ్లు తుడుచుకుని ఉప్పొంగుతున్న

ఆనందంతో పరుగున వెళ్లి అత్తగారి కాళ్ల

మీద పడిపోయింది వేదిత.
ఆమెను ఆప్యాయంగా అక్కున

చేర్చుకున్నారు అత్తగారు.
‘‘తల్లిలాంటి అత్తగారిని అనుమానించాను

క్షమించండి’’ అంటూ తాను పిన అపోహను

చెప్పింది వేదిత.
‘‘నా మాటలు, హెచ్చరికలతో బాధపెట్టాను

కనుక నువ్వే నన్ను క్షమించాలి’’ అన్నారు

అత్తగారు.
అత్తగారు అలా అనగానే వేదిత ఆమెను

లతలా అల్లుకుపోయింది.

- కాళ్ల గోవిందరావు, ఆమదాలవలస.