రాజమండ్రి

కన్పించని జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తొందరగా పద.. టిక్కెట్లు దొరకవు’ అంటూ

కంగారు పెట్టాడు అవినాష్ నానిని ఉద్దేశించి.
‘దొరకకపోతే బ్లాక్‌లో కొనచ్చులే’ అన్నాడు

నాని.
‘నీదేం పోయింది, నీకు డబ్బులు చెట్టుకు

కాస్తాయి’
‘ఇంట్లో పది చెట్లు ఉన్నాయి నీకొకటి

ఇస్తానులే’ అంటూ హాల్ దగ్గరికి

ప్రవేశించారు ఇద్దరు.
టిక్కెట్ కౌంటర్ దగ్గర జనాలు విపరీతంగా

ఉన్నారు. బ్లాక్‌లో కొందామంటే ఆస్తి

అడిగేలా ఉన్నారని అర్థం చేసుకొని లైన్లో

నిల్చున్నారు!
లైన్లో నిల్చుని టిక్కెట్ తీసుకొనేంత ఓపిక

నాకు లేదు. ‘నాక్కూడా అన్నాడు అవినాష్

నానీ మాటలకి’
‘పద.. బ్రతిమాలుకొని బ్లాక్‌లో కొందాం!’
ఇంతలో ఒక వ్యక్తి లైన్లో నిల్చున్నారు
అవినాష్‌కి, నానికి ఆ వ్యక్తిని ఎక్కడో

చూసినట్లు అన్పించింది. ఇద్దరు ఒకేసారి

మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధుసూదన్ కదా

అన్నారు.
‘అవును’ అంటూ చిరునవ్వుతో సమాధానం

ఇచ్చారు.
‘మీరేంటి సార్ ఇక్కడ?’ అన్నాడు నాని.
‘ఏమైంది.. లైన్లో నిల్చుని టిక్కెట్

తీసుకోకూడదా?’
తర్వాత ఇద్దరు సెల్ఫీలు తీసుకున్నారు.
థియేటర్‌కి వస్తున్న జనం కొంతమంది

గుర్తుపడుతున్నారు.
నానీ ఆయనతో ‘మీలాంటి వారు ఇలాంటి

చిన్న హాల్‌కి రావడం.. పైగా లైన్లో నిల్చుని

సినిమా చూడటం నాకు నచ్చలేదండి!’

మనస్సులో ఉన్నదంతా చెప్పాడు!
అవినాష్ మాత్రం ‘ఇదీ పబ్లిసిటీ’. సార్ ఈ

సినిమాలో నటించారు అని తేలికగా

చెప్పేశాడు!
మధుసూదన్ నవ్వి ‘మీరు నేను నటుడిని,

కోటీశ్వరుడు అనుకుంటున్నారు ముందు

ఆ ఆలోచన నుండి బయటకు రండి’!
‘నేను మీలాంటి వాడిని. సినిమాల్లో

నటిస్తున్నాను అనే మాటేగాని చేతికి

అందిన డబ్బులు మాత్రం చాలా తక్కువ.

అలాగే ఇప్పుడు పోటీతత్వం బాగా పెరిగింది.

ఎవరు తక్కువగా వస్తే వాళ్లని సినిమాలో

పెట్టుకుంటున్నారు’ డిమాండ్ చేస్తే

ఛాన్సులు రావు. ‘పైగా హీరోలు నచ్చిన

వాళ్లని కొంతమందిని, హీరోయిన్లు నచ్చిన

వాళ్లని కొంతమందిని సినిమాలో

పెట్టుకొంటారు. వాళ్ల వల్ల మా ఆదాయం,

మా సినిమా ఛాన్సులు తగ్గిపోతున్నాయి!
ఈమధ్య కుల సమస్య బాగా పెరిగింది. ఆ

తర్వాత జిల్లాలు, రాష్ట్రాలు భేదాభిప్రాయాలు

కూడా వచ్చేశాయి. కారు కొనుక్కొన్నా

బాధే, నవ్వినా బాధే. ఏదోవిధంగా జీవితాన్ని

నెట్టుకొస్తున్నాను. మీకు కన్పించిందంతా

నిజం కాదు. మా జీవితాలు పైకి

కన్పించినంత స్టార్ హోదా కాదు. ‘తెరపై

కోటీశ్వరులు బయట కన్నీటి తెరపై లాగే

బతుకు బండి’.
మధుసూదన్ మాటలు వాళ్లిద్దరిని

ఆలోచింపచేశాయి. సినిమా వాళ్ల జీవితాలు

వెండి చందమామ అన్నంత ప్రకాశవంతంగా

కావు, బొగ్గు గనిలో వచ్చే దుమ్ము ధూళి

కూడా సినిమా వాళ్లలో ఉంటాయి అని

తెలుసొచ్చింది.
టిక్కెట్లు దొరికాయి. సినిమా చూశారు. కానీ

వాళ్లిద్దరు సినిమాను సినిమాగా చూశారు.

అందులో నటులను చూసి మనం అలాగే

అవుదాం అనే కలలకు ఆనకట్ట

వేసుకొన్నారు!

- నల్లపాటి సురేంద్ర సెల్: 9490792553