కృష్ణ

రెండు ఫ్యాన్సీ నెంబర్లపై ఎమ్మెల్యే కొడాలి మోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ: గుడివాడ ఆర్టీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల టెండర్ ప్రక్రియలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏపి16 డిఎస్ 9999, 7777 నెంబర్లను చేజిక్కించుకున్నారు. ఈసారి ఎలాగైనా 9999 నెంబర్‌ను ఎమ్మెల్యేకు దక్కకుండా చేయాలని కొంతమంది రాజకీయ నాయకులు రెండు రోజులుగా పలువురు పారిశ్రామికవేత్తలను సిద్ధం చేసినప్పటికీ టెండర్ వేసే సమయానికి ఎవరూ రాకపోవడంతో రూ.50 వేల మొత్తానికి కొడాలి నాని దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. అలాగే 7777 నెంబర్‌ను కూడా రూ.30,500కు చేజిక్కించుకున్నారు. అంతేగాక 5555 నెంబర్ రూ.2.05 లక్షలు, 6666 నెంబర్ కోసం తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్ గుత్తా చంటి పోటీపడినప్పటికీ ఆయనకు దక్కలేదు. ఈ నెంబర్ రూ.1.86 లక్షలు పలికింది. 8888 నెంబర్ రూ.86 వేలకు దక్కించుకున్నారు. దీంతో గుడివాడ ఆర్టీవో కార్యాలయ పరిధిలోని ఏపి16 డిఎస్ సిరీస్‌లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం ప్రక్రియ పూర్తయిందని ఆర్టీవో సురేష్ చెప్పారు.