కృష్ణ

చెదురుమదురు వర్షాలతో ఊపందుకున్న ఖరీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా కురుస్తున్న చెదురుమదురు వర్షాలకు డెల్టాలో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. ఇప్పటివరకు సాగునీటి ఇబ్బందులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగులో కొంత జాప్యం ఏర్పడింది. తొలకరి ఆశాజనకంగా ఉండటం, జూన్ నెలలోనే పట్టిసీమ ద్వారా కాలువలకు నీటిని విడుదల చేసినా ఆ తర్వాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా డెల్టాలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. శివారు భూములకు నీరు అందకపోవటంతో నాట్ల ప్రక్రియ అంతంత మాత్రంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రైతాంగానికి ఆశాజనకంగా మారాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ చేసిన ప్రకటన రైతులకు మరింత ఉపశమనాన్ని కలిగిస్తోంది. వర్షాల కారణంగా పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటితో సేద్యాన్ని మరింత వేగవంతం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 2.35 లక్షల హెక్టార్లలో వరి సాగు చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు లక్షా 85 వేల హెక్టార్లలో నాట్ల ప్రక్రియ ముగిసింది. కాలువ శివారు ప్రాంతాలైన బంటుమిల్లి, కృత్తివెన్ను, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు తదితర ప్రాంతాల్లో నాట్ల ప్రక్రియ పూర్తి కావల్సి ఉంది. మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్‌కు సాగుకు ఎంతగానో ఉపయుక్తంగా మారుతున్నాయి.