శ్రీకాకుళం

బందోబస్తు నడుమ వంశధార పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం: వంశధార రిజర్వాయర్‌కు సంబంధించి పనులు పోలీసు పహరా మధ్య కొనసాగుతున్నాయి. పోలీస్ బలగాలు మోహరించి 17 రోజులు కావస్తుంది. వంశధార రిజర్వాయర్ పనులను వేగవంతంగా నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వాసితుల నిరసనలు దృష్ట్యా ఈ నెల 6 నుంచి పోలీసుల మోహరింపు చేశారు. తులగాం, పాడలి, దుగ్గుపురం, గార్లపాడు రహదారి కూడళ్లలో మోహరింప చేశారు. అయినా నిర్వాసితులు నిరసన కార్యక్రమం చేపట్టడం పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై మరిన్ని చర్యలు చేపట్టింది. వీటిలో భాగంగా ఐదు జెసిబి యంత్రాలు, 30 ట్రాక్టర్లను అందుబాటులో ఉంచి వర్షం కురిసినా పనులను ఆపకుండా చేపడుతున్నారు. బలగాలతో మరికొన్ని రోజుల్లో పనులను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 500 ఎకరాల వరకు భూమిని చదును చేసినట్టు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మట్టి తవ్వకం పనులు చేపట్టడానికి గుత్తేదారు నిర్ణయించారు. గార్లపాడు వెళ్లే రహదారి, తులగాం గెడ్డ గట్లు నిర్మాణంతో పాటు స్పిల్ వే పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్‌డి ఒ రెడ్డి గున్నయ్య, తహశీల్దార్ కాళీప్రసాద్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కోటి శివలింగ మందిర నిర్మాణానికి సహకరించండి
నరసన్నపేట: భారతదేశంలోనే గర్వించే విధంగా మన జిల్లాలో కోటి శివలింగాల మందిర నిర్మాణానికి శ్రీ రాజరాజేశ్వరి దేవి దివ్య సంకల్పమునకు ప్రతీ ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కుంచాలకూర్మయ్యపేట దేవీ ఆశ్రమ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి లింగాలను ఒకే చోట ప్రతిష్ఠ చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని ఈ దిశగానే మన సాంస్కృతిక ధర్మాలను కాపాడుకునే మన ఆచారాలు సుస్థిరంగా నిలబడాలంటే కోటి శివలింగాల మందిరం నిర్మాణమే ప్రధాన అంశమని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఒక ప్రస్తారంలో 1116 శివలింగాలను ఏర్పాటు చేస్తున్నామని ఇటువంటి ప్రస్తారాలు 8,960ను నిర్మించడం జరుగుతుందని ఆయన వివరించారు. దీనికి సంబంధించి భక్తులు ఎవరైనా కనీసం 108 శివలింగాలను ఒక్కొక్కరూ ఇవ్వగలిగితే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

ఆదిత్యుని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీకాకుళం(రూరల్): ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణస్వామివారిని ఆదివారం ప్రముఖులు దర్శించుకున్నారు. ఫిషరీస్ కమీషనర్ రామ్‌శంకర్‌నాయక్ హైకోర్టు న్యాయమూర్తి పి.రజనీలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు జరిపారు. ఆలయ విశిష్ఠతను, సూర్యనమస్కారాల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో స్వామివారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని , తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఈవో శ్యామలాదేవి, మంత్రి వెంకటస్వామి, సిబ్బంది వారి వెంట ఉన్నారు.

వనిత కార్డులపై అవగాహన అవసరం
గార: ఆర్.టి.సి. బస్సు ప్రయాణంలో వనిత కార్డుపై ప్రయాణీకులకు ఆవగాహన కల్పించే దిశగా గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహింపజేస్తున్నట్లు డిప్యూటి సి.టి. ఎం. కుప్పిలి శ్రీనివాసరావు అన్నా రు. మండలం బందరువానిపేటలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎల్.ఎస్.నాయుడు ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాన్ని శ్రీకాకుళం ఆర్టీసి అధికారులు ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సి.టి.ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ తెల్లకార్లు లబ్ధిదారులకు ప్రభుత్వం వనిత కార్డులను అందజేస్తుందని, ఈ కార్డు ద్వారా ప్రయాణీకులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందన్నారు. 5గురు కుటుంబ సభ్యులు వరకు ఈ కార్డు ద్వారా ఆర్టీసి బస్సుల్లో పది శాతం రాయితీపై ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ కార్డు కాలపరిమితి రెండు సంవత్సరాలని, ప్రయాణంలో ప్రమాద బీమా రూ. 2లక్షలు, ఈ కార్డు ద్వారా ఒక్కరే బస్సు ప్రయాణం సాగించాలంటే అదనంగా మరో రూ.20 చెల్లించి యాడ్ ఆన్ కార్డు ద్వారా వనిత రాయితీలు పొందవచ్చన్నారు. ప్రభుత్వం అందజేసిన తెల్ల రేషను కార్డు లబ్ధిదారులకు మాత్రమే వనిత కార్డులను అందజేస్తున్నామని, ఈ కార్డులపై ప్రయాణీకుల్లో అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టామని డిప్యూటి సి.డి.ఎం. శ్రీనివాసరావు అన్నారు. ఈయన వెంట అసిస్టెంటు మేనేజరు శ్రీనివాసరావు, ట్రాఫిక్ మేనేజర్ ఎల్.ఎస్.నాయుడు, స్థానికులు ఉన్నారు.
వినాయక మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి
గార: వినాయక చవితి సందర్భంగా భక్తులు గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరని స్తానిక ఎస్సై బలివాడ గణేష్ స్పష్టం చేసారు. ఆదివారం సాయంత్రం స్తానిక పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వారు ఇచ్చిన ఆదేశాలు మేరకు వినాయక మండప నిర్వాహకులు ముందస్తుగా శ్రీకాకుళం సబ్ డివిజినల్ పోలీసు అధికారి అనుమతి తప్పనిసరన్నారు. వినాయక విగ్రహం ఎత్తు మరియు నిర్వాహకుల జాబితాను స్థానిక పోలీసు స్టేషనుకు ముందస్తుగా తెలియజేయాలన్నారు. విగ్రహాలు కొనుగోలు చేసిన ప్రాంతం.. ఏ మార్గంలో గ్రామానికి తరలిస్తున్నారు అన్న సమాచారం కూడా ముందస్తుగా తెలియజేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా మండపాలు పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని, విగ్రహాలు నిమజ్జన స్థలం, నిమజ్జనానికి తీసుకువెళ్లే మార్గం కూడా ముందస్తుగానే తెలియజేయాల్సి ఉందన్నారు. మట్టి విగ్రహాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎక్కువ శబ్ధం వచ్చే మైకు సెట్లు రాత్రి పది గంటలు తరువాత వినియోగిస్తే సీజు చేస్తామన్నారు. విగ్రహాలు ఊరేగింపులో ఎటు వంటి రంగులు జల్లడం, అశ్లీల నృత్యాలు, మందుగుండు సామాగ్రి వినియోగం, బలవంతపు వసూళ్లు వంటి కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మండపాలు నిర్వహణలో నిర్వాహకులు పోలీసుకు సహకరించాలని ఎస్సై గణేష్ స్పష్టం చేసారు.
ఉచిత మొబైల్ స్మార్ట్‌సిమ్ సౌకర్యం
బలగ: బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిమ్ మొబైల్ ల్యాండ్‌లైన్, బ్రాండ్‌బాండ్ ప్లాన్‌లను ప్రజలను మరింత చేరువగా అందిస్తున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేశ్వరరావు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 నుండి 24 వరకు జిల్లాలోని అన్ని ముఖ్య కేంద్రాల్లో మేళాను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేళాలో ఉచిత మొబైల్ స్మార్ట్ సిమ్, మొబైల్ పోర్టుబులిటి పొందవచ్చునని తెలిపారు.