శ్రీకాకుళం

తేలుకుట్టిన...దొంగలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: మధ్యవర్తుల మాటలను నమ్మవద్దని నిర్వాసితులకు విజ్ఞప్తులు..చట్టాని చేతుల్లోకి తీసుకోవడం తగదని హెచ్చరికలు..నిరాయుధులైన వారిపై దాడులు మంచిది కాదని సూచనలు..తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టులు చేసామంటూ వివరణలు..వీటికితోడుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 460 జి.వో. మేరకు 421.80 కోట్లును మంజూరు చేసింది. అర్హులైన వారందరికీ పరిహారం అందజేసింది. కేవలం ఐదు శాతం నిర్వాసితుల్లో రేగిన మంటలేనా..వంశధార ప్రాజెక్టును తగలబెట్టేస్తున్నాయి? 95 శాతం నిర్వాసితులకు అందించిన ప్యాకేజీల్లో దళారులకే సింహభాగం ముట్టచెప్పడం వల్ల ఐదు శాతం పరిహారం అందని నిర్వాసితులతో 95 శాతం పరిహారం పుచ్చుకున్న నిర్వాసితులు అన్యాయం జరిగిందని ఇప్పుడు గళం విప్పుతున్నారా?? అసలు రాజకీయ దళారీ ముఠాను ఏమీ చేయలేక సామాన్య ప్రజలపై లాఠీ విరుస్తున్నారా??? అన్న ప్రశ్నలకు ‘ఆపరేషన్ వంశధార’ అమలు చేసి, జిల్లా యంత్రాంగాన్ని చట్టబద్ధంగా నడిపించే బిగ్‌బాసులైన కలెక్టర్, ఎస్పీలు ఆలోచిస్తే..అసలు ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్న సిసలైన దళారీ ముఠాను ఏ రాజకీయ పార్టీలు, నేతలు అండదండలు ఇస్తున్నారన్న విషయాలపై నిఘానేత్రం పనిచేస్తే...ప్రాజెక్టు పనులకు ఎటువంటి అడ్డంకులు ఉండబోవన్న నిజాన్ని నిర్వాసిత గ్రామాల ప్రజలు నిలదీస్తున్న ప్రశ్న!?
పుష్కరకాలం కావస్తుంది - 2006-07 సంవత్సరంలో 11,687 ఎకరాల వంశధార ప్రాజెక్టు పనులకు భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. అప్పటి ధరల మేరకు ఎకరాకు రూ. 1.33 లక్షలు చెల్లించారు. సెక్షన్ 24(2) మేరకు వంశధార నిర్వాసితులకు నష్టపరిహారం 2009 వరకూ సేకరించిన భూమికి 80 శాతం చెల్లింపులు జరిగిపోయాయి. ప్రస్తుతం 2.10 లక్షల ఎకరాల ఆయకట్టు గల వంశధార దిగువభాగంలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి అయితే మరో 40 వేల ఎకరాలు ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి. దీంతో జిల్లాలో రెండుమూడు పంటలు వేసుకునే అవకాశం అన్నదాతకు కలుగుతోంది. అప్పుడు శ్రీకాకుళం జిల్లా అన్నపూర్ణగా సస్యశ్యామలం అవుతుందన్న ఆలోచనే ప్రభుత్వానిది, జిల్లా యంత్రాంగానిది. కాని - పోలీసు పహారా మధ్య, అనునిత్యం వేలమంది పోలీసు బందోబస్తు, ఘర్షణలు, ఆస్తులు ధ్వంసం చేసే కవ్వింపు చర్యలు, లాఠీ ఛార్జీలు, అరెస్టులు ఇలా..రాజకీయ కురుక్షేత్రానికి మూలాలు పాలకులకు తెలిసినా - తేలుకుట్టిన దొంగల్లా జనం మధ్యలో ఉన్న దళారీలను వదిలేసి అభంశుభం తెలియని నిర్వాసితులను నియంత్రించడం వల్ల ప్రాజెక్టు పనులు సాఫీగా, సులభంగా, సహకారంతో జరగవన్న విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వేరేగా తెలియజెప్పనవసరం లేదంటూ బిక్కుబిక్కుమంటూ అక్కడ ఘర్షణలతో సంబంధం లేని వేలాది మంది నిర్వాసితులు ‘ఆంధ్రభూమి’ ముందు గోడు పెట్టారు. ప్రస్తుతం 0.6 టి.ఎం.సి.ల నీరు నిల్వ చేసే రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే 19 టి.ఎం.సి.ల నీటినిల్వ ప్రతీ ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలకు చివరి వరకూ సాగునీరు అందుతుందని, ఆరుతడి పంటలకు రబీలోను నీటిపారుదల కల్పించేందుకు అధికారులు సమిష్టిగా పనిచేస్తుంటే - ఆ ఫలాలు భావితరాలకు, తమ కుటుంబాలకు అందుతాయన్న ఆశ నిర్వాసిత గ్రామాల్లో చాలా మంది అన్నదాతలు ఆనందంగా అంగీకరిస్తున్న తరుణంలో వంశధార ప్రాజెక్టు పనులు నిలిపివేయాలన్న గళం ఎక్కడ నుంచి పుట్టుకొచ్చింది? ఎవరి గళంతో కలిసి గొంతెత్తి అరుస్తోంది?? అన్న అంశాలపై కలెక్టర్, ఎస్పీలు ఎందుకు ఆరా తీయలేకపోతున్నారన్న మిలియన్ డాలర్ల ప్రశ్నలకు సమాధానం పుష్కరకాలంగా ఏ అధికారి చెప్పలేకపోతున్నారు! కేవలం దళారీలు దశలవారీగా ప్రభుత్వం అందించిన పరిహారాన్ని పక్కదారి పట్టించి, చివరికి రెవెన్యూ పట్టాదారు పుస్తకాలు సైతం బోగస్‌వి తయారు చేసి, అనర్హులైన వేలాది మందికి రూ. కోట్లు అప్పనంగా అందించిన బోకర్లను కటకటాల వెనక్కి నెట్టేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందన్న చిన్నపాటి సూచనను సైతం ఆచరించలేని గత పాలకులు, అధికారులు వారసత్వానికి నేటి అధికారులు వ్యతిరేకంగా నడుంబిగించి పనిచేస్తున్నందుకు గర్వకారణమే! తలదించుకునేలా నిబంధనలు, నిర్దేశాలు, నిర్ణయాలు ప్రస్తుత జిల్లా యంత్రాంగంలో కన్పించడం లేదు. కాని - కీళ్ళరిగి వాత పెట్టాల్సిన తెలివైన ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.లు ఆ దిశగా ఎందుకు దూకుడు పెంచడం లేదన్న ప్రశ్న మాత్రం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
గత ప్రభుత్వాల్లో వేల కోట్ల రూపాయలు అవినీతికి వంశధార ప్రాజెక్టు ఆధారంగా మారింది. అందుకే, జాయింట్ కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెట్లకు ఇచ్చిన పరిహారం, స్టెక్చర్లకు పంపిణీ చేసే నష్టపరిహారం అవకతవకలు బట్టబయలు చేస్తే ఆయనను అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తన కోటరీ ఒత్తిడి చేసి బదిలీ చేయించింది. ఆ తర్వాత కాలంలో వంశధార ప్రాజెక్టు కోసం అవినీతి మరకలు లేకుండా పనిచేసే ఎంతోమంది చీఫ్ ఇంజనీర్లపై దళారీవ్యవస్థ దాడులు చేసి, చివరికి వారంతటవారే బదిలీలు చేయించుకునేలా చేసింది. ప్రాజెక్టు నిర్మాణ విలువలు ఎప్పటికప్పుడు పెంచేసి, గుత్తేదారులకు కొమ్ముకాసే అప్పటి సర్కార్‌లో దళారులదే అగ్రస్థానం. అదే స్థానంలో ఇప్పటి ప్రభుత్వంలో కూడా దళారీలు వ్యవహారిస్తున్నారన్న పచ్చినిజం అందరికీ బహిరంగ రహస్యమే! వారిపై ‘లాఠీ’పడకుండా ‘కాపు’కాస్తున్న నేత వల్ల ఎక్కడ నుంచో ఉద్యోగరీత్యా వచ్చే ఉన్నతాధికారులు గత కొద్ది నెలలుగా ఎన్నో అవస్థలు పడుతున్న విషయం నిర్వాసితుల్లో చాలా మందికి ఎరుకే. కాని - రాజకీయ దళారులపై ఉక్కుపాదం మోపితేగాని ప్రాజెక్టులో పరిహారం తీసుకున్న 95 శాతం మంది నిర్వాసితులు ప్రభుత్వానికి, అధికారులకు అనుకూలంగానే ఉంటారన్న విషయాన్ని గ్రహించినప్పటికీ ‘తేలుకుట్టిన దొంగల్లా’ నేతలు, అధికారులు వ్యవహారించినంత వరకూ ప్రాజెక్టు పనుల్లో ఘర్షణలు జరుగుతునే ఉంటాయి. ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, సమయపాలన పాటిస్తూ కవ్వింపు చర్యలకు దూరంగా శాంతియుతమైన వాతావరణాన్ని తన సైన్యానికి నేర్పి బుద్ధిబలంతో పనిచేయాలంటూ సూచనలు ఇచ్చే ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమవర్మలు వ్యూహాత్మకంగా రాజకీయ దళారీలను అదుపులోకి తీసుకుంటే 95 శాతం నిర్వాసితులపై 5 శాతం బోకర్ల ప్రభావం పడకపోతే - ప్రాజెక్టు జనవరి 5, 2018కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశించినట్టుగా ప్రజలకు అంకితం ఇవ్వడం ఖాయం!!