ప్రకాశం

వైభవంగా వరుణయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం: వర్షాభావ పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు మార్కాపురంలో చేపట్టిన వరుణయాగం ఆదివారం వైభవంగా ముగిసింది. శుక్రవారం ప్రారంభమైన ఈ వరుణ యాగం చివరిరోజైన ఆదివారం వివిధ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శుక్ర, శనివారాల్లో పూజా కార్యక్రమాలు శ్రీలక్ష్మిచెన్నకేశవస్వామి ఆలయంలో నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం చెన్నరాయునిపల్లె సమీపంలోని చెరువులో యాగశాలను ఏర్పాటుచేసి పూజలు నిర్వహించారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలంతా ఒకేచోటికి చేరి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రెండు రోజులపాటు చెన్నకేశవస్వామి దేవస్ధానం సన్నిధిలో శాస్రోక్తంగా యాగాలు నిర్విహించిన అనంతరం మూడోరోజైన ఆదివారం పట్టణ ప్రజలంతా ఒకేచోటికి చేరి పండుగ వాతావరణంలో యాగాన్ని నిర్వహించారు. మంటప దేవత పూజలు, మహామంత్ర అనుష్టానములు, వారుణ అనువకపారాయణ, విరాటపర్వ పారాయణ, రుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం కార్యక్రమాలతోపాటు మహామంత్ర అనుష్టానములు, నవగ్రహ హోమం, రుద్ర హోమం, వరుణ హోమం, నీరాజన మంత్ర పుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు తండోపతండాలుగా యాగశాల వద్దకు వెళ్లి స్వాములకు పూజలు నిర్వహించారు. చెన్నకేశవుని చుట్టూ గుండం ఏర్పాటుచేసి జలదివాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శృంగేరి పీఠం నుంచి వచ్చిన ఋత్వికులు యాగశాలను ఏర్పాటుచేసి ఘనంగా యఙ్ఞం చేశారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం పట్టణంలో వెలసిన శ్రీలక్ష్మిచెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా బ్యాండు మేళాలతో యాగశాల వద్దకు తీసుకువెళ్లారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో యాగం జరిగే ప్రదేశంకు వెళ్లి నేవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈకార్యక్రమం మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, శ్రీలక్ష్మిచెన్నకేశవస్వామి ట్రస్టుబోర్డు చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాధం, టిడిపి జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వక్కలగడ్డ మల్లిఖార్జున్, మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక, ఆలయ ఇఒ రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. డివైఎస్‌పి ఎన్‌వి రామాంజనేయులు, ఆర్డీఓ పెంచలకిశోర్, డిఎఫ్‌ఓ జయచంద్రరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ జరిగింది. గత 20 సంవత్సరాల క్రితం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇదే ప్రాంతంలో వరుణయాగం చేయగా వర్షాలు కురిసి ఈప్రాంతం సశ్యమలం అయిందని వృద్ధులు తెలిపారు. దీంతో ఈ పర్యాయం కూడా ఇదే ప్రాంతంలో వరుణ యాగాన్ని నిర్వహించారు. యాగశాల ప్రాంతానికి భక్తులు తరలివెళ్లేందుకు పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన బస్సులను ఏర్పాటుచేశారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే వరుణయాగం జరుగుతున్న ప్రాంతంలో ముస్లిం, క్రైస్తవులు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.