శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేత్రపర్వంగా చిన శేషవాహన సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి 35వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన అదివారం చిన శేష వాహనంపై వెంకయ్యస్వామి ఆశీనులై గొలగమూడి వీధుల్లో విహరించారు. తొలుత ఆశ్రమంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన చిన శేషవాహనంపై వెంకయ్యస్వామి ఆశీనులై భక్తులను అనుగ్రహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, మహిళల కోళాటాలు, భక్తజనం మధ్య స్వామి వారి గ్రామోత్సవం కనులపండువగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వెంకయ్యస్వామిని దర్శించుకున్నారు. అదేవిధంగా రాత్రికి హంస వాహనంపై కొలువుతీరిన వెంకయ్యస్వామి గొలగమూడి మాడ వీధుల్లో భక్తజన సందడిలో విరహరం చేశారు. ఈ సేవలను చూసి స్వామి అనుగ్రహం పొందేందుకు భక్తజనం ఎగబడ్డారు. అదివారం వేకువజామున గోపూజ, సుప్రభాత సేవ, అభిషేకం, హారతి, ప్రసాద వినియోగం, ఉత్సవమూర్తికి అభిషేకం, సహస్రనామ పూజ, ఏకాంత సేవలను వేదపండితులు నిర్వహించారు. ఉత్సవాలను ఆశ్రమ ఇవో బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షించారు. ఉదయం చిన శేషవాహన సేవకు సిహెచ్.శ్రీ్ధర్ నెల్లూరు, నరసింహారావు సౌత్‌రాజుపాళెం, సుబ్బరాజు కుల్లూరురాజుపాళెం, దిలీప్‌కుమార్‌రెడ్డి నెల్లూరు, రాత్రికి హంస వాహన సేవకు మోచర్ల మధు ఈదూరు, ఉప్పల మోహన్ వరిగొండ, నల్లగుండ్ల గాంధీ తెల్లపాడు, కాండ్ర రవీంద్రరెడ్డి నెల్లూరు ఉభయకర్తలుగా వ్యహరించారు. విఎస్ శ్రావ్య - నెల్లూరు వారిచే భక్తిరంజని కార్యక్రమం ప్రదర్శించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి ఉభయకర్తలుగా గారపాటి సూర్యనారాయణ - అనురాధ మందలపల్లి ఖమ్మం జిల్లా వారు వ్యవహరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అదివారం రాత్రికి శ్రీ సాయి నాట్యమండలి వారిచే శ్రీ రామాంజనేయయుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శించారు. సోమవారం ఆరాధనోత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు సూర్యప్రభ వాహన సేవ, రాత్రికి గజవాహన సేవలు నిర్వహించనున్నారు.