కృష్ణ

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం,: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక టౌన్‌హాలు లో తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రవీంద్ర మాట్లాడు తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెసుకునేందుకు ఇటీవల వార్డుల పర్యటన చేపట్టామన్నారు. వార్డుల పర్యటనలో ప్రజలు లేవనెత్తిన సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు. పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 3వ తేదీ నుండి ఇ ంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గడిచిన మూడేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు. టి డిపి పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పా షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం (చంటి), పార్టీ సీనియర్ నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, చిలంకుర్తి తాతయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.