కృష్ణ

మైలవరం నియోజకవర్గానికి రూ.8.34 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం,: మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి రూ. 8.34కోట్ల రూపాయలు మంజూరైనట్లు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. శనివారం రాత్రి జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగిన మైలవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 31 పనులకు గానూ పంచాయితీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నిధులు 5.95 కోట్ల రూపాయలు, మరియు 27అంగన్‌వాడీ భవన నిర్మాణాలు ఒక్కొక్కదానికి ఏడు లక్షల రూపాయల చొప్పున 1.89 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయతలపెట్టిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం సెప్టెంబర్ 3నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తాను పాదయాత్ర చేయనున్నట్లు పేర్కొన్నారు. గడచిన మూడేళ్ళలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి జరగాల్సిన అభివృద్ధికి ప్రణాళికలను తయారు చేయనున్నట్లు తెలిపారు. గడచిన మూడేళ్ళలో జరిగిన అభివృద్ధికి సంబంధించి గ్రామగ్రామాన కరపత్రాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్ కన్వీనర్‌లను నియమించి ప్రతి వంద మంది ఓటర్లకు ఒక క్రియాశీలక ప్రతినిధిని నియమించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈనెలాఖరులో చింతలపూడి ఎత్తిపోతల పధకం భూమి పూజ కార్యక్రమం మైలవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబుచే ఉంటుందని, ఈకార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. నియోజకవర్గంలో సిసి రోడ్లు, డ్రైన్లకు డిఆర్‌ఎఫ్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. జి కొండూరు మండలంలోని కొండూరు, దుగ్గిరాలపాడు, కోడూరు, కవులూరు, పినపాక, గుర్రాజుపాలెం గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణానికి 280.40 లక్షల రూపాయలు, మైలవరం టౌన్‌లో 61.40 లక్షల రూపాయలు, టి గన్నవరంలో 25.10 లక్షల రూపాయలు, రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి, రెడ్డిగూడెం, రాఘవాపురంకు 228.60 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో జి కొండూరుకు 6, చెవుటూరు, బొర్రగూడెం, చండ్రగూడెం, భీమరాజుగుట్ట, కొండపల్లి పంచాయితీ ఏరియా కొండపల్లి పుట్టలమ్మగట్టు, త్రిలోచనాపురం, మైలవరం-12, సూరిబాబుపేట, మైలవరం వెంకటేశ్వర టెంపుల్, వెదురుబీడెం, దేవునిచెరువు, కొండపల్లి అడవిక్వారి, గుంటుపల్లి, గాజులపేట ఏరియా, సుందరయ్యనగర్, ఫెర్రి ఎస్సీ ఏరియా, కందులపాడు, దుగ్గిరాలపాడు, కవులూరు, కట్టుబడిపాలెం, వెల్వడం, తాడిగూడెం, వెలగలగూడెం గ్రామాలలోని 27 అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు రు.1.89కోట్ల రూపాయలు విడుదలైనట్లు మంత్రి ఉమ వెల్లడించారు. నిధులు మంజూరైన పనులకు సంబంధించి వెంటనే పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు.