హైదరాబాద్

గాంధీ ఆసుపత్రిలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ధర్మాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజులుగా ఎమర్జెన్సీ వార్డు వద్దనే ఓ మృతదేహం ఉండడం కలకలం రేపింది. రోగులను చూసేందుకు వచ్చిన సహాయకులు, బంధువులు దుర్వాసన భరించలేక ముక్కుమూసుకుని తిరిగారు. ఇదేంటని అధికారులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో రోగుల తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా గాంధీ ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మృతదేహాన్ని భద్రపరిచాం: సూపరింటెండెంట్
గాంధీ ఆసుపత్రిలో ఒక మృతదేహంతోపాటు శ్రీనివాస్ అనే రోగి విషయంలో మీడియా, సోషల్ మీడియా అనవసర రాద్దాంతం చేస్తుందని, సోమవారం గుర్తు తెలియని ఒక మృతదేహం ప్రసూతి వార్డు సమీపంలో సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి సమాచారం ఇచ్చిందని, ఆ మృతదేహాన్ని పంచనామా నిర్వహించి భద్రపరిచామని ఆసపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహారావు తెలిపారు. అయితే ఆ మృతదేహం ఎవరిదో గుర్తించలేకపోయామని, ఎవరో ఆసుపత్రి వద్ద వదిలివెళ్లినట్టు చెప్పారు.
శ్రీనివాస్ అనే రోగి విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని, శ్రీనివాస్‌కు హై షుగర్ వల్ల ఆపరేషన్ చేయడంలో ఆలస్యమైందని డాక్టర్ నరసింహారావు తెలిపారు.
ప్రతి రోజు వేలాది మంది నిరుపేదలకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రిపై దుష్ప్రచారం చేయడాన్ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీ ఆసుపత్రిలో మంచి వైద్యం, అధునాతన పరికరాలు, అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారని, ఆసుపత్రిపై అనవసర ప్రచారానికి లోనుకావద్దని డాక్టర్ నరసింహారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.