వీరాజీయం

భార్య భౌతికకాయాన్ని భద్రపరచిన భర్త! (వార్త - వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భౌతికకాయాన్ని చెడిపోకుండా దాచిపెడితే వ్యక్తి మున్ముందు శాస్త్ర పురోగతి ఫలితంగా సజీవుడవుతాడన్న నమ్మకం చైనాలో వుంది. తూర్పు చీనాలోని షాన్డాంగ్ పరిశోధన సంస్థ ఆసుపత్రిలో చట్టపరంగా -ఝాన్ వేనిలియన్ (49) అనే రోగి- లంగ్ కాన్సర్ వ్యాధితో మరణించింది అని వైద్యులు నిర్థారించారు. తరువాత భర్త షాంఘైకి చెందిన గ్విజుమిన్ భార్య భౌతికకాయాన్ని చెడిపోకుండా రసాయనిక (క్రోయోజెనిక్) పద్ధతిలో నత్రజని ద్రవంలో అంటే మైనస్ 196 డిగ్రీల శీతోష్ణస్థితిలో ఒక పాత్రలో భద్రపరిచే ఏర్పాట్లు చేసుకున్నాడు. మూడు మాసాలైంది. ఆమె బ్రతికి వుండగా వున్న రుగ్మతకు కొత్త చికిత్స వస్తే దానితో ఆమెని బ్రతికించి తిరిగి తెచ్చుకుందామని ఎదురుచూస్తున్నాడు. ఆమె విశ్రాంతి తీసుకుంటున్నది అన్నది అతని నమ్మకం. ఝాంగ్ అంతిమశ్వాస తీసుకోగానే రెండు నిమిషాల వ్యవధిలోనే షాంగైలోని క్విలూ ఆసుపత్రి నిష్ణాతులు, అమెరికాకి చెందిన ఆరోన్ డ్రేక్ జీవ భద్ర ఫౌండేషన్‌కి చెందిన సైంటిస్టులు, డాక్టర్లు అంతా వచ్చి యాభై అయిదు గంటల బాటు తంటాలు పడి ఆ ‘మృతదేహం’ చెడిపోకుండా అవసరమైన రసాయనాలు ఎక్కించి రెండు వేల లీటర్ల పాత్రలో నైట్రోజన్ ద్రవం వున్న పాత్రలోకి దించారు. హుటాహుటిన అమెరికాకు పంపారు. ‘సజీవ భద్రతా సౌకర్యాల పరిశోధనాగారం’ అక్కడే వున్నది. సైన్సు అండ్ టెక్నాలజీ పోస్ట్ పత్రిక ప్రకటించిన వివరాల ప్రకారం శరీరాన్ని ఇలా భద్రపరచడానికి 30 లక్షల అమెరికన్ డాలర్లుఖర్చు అయ్యింది. ఏటా యాభై వేల చైనా కరెన్సీ యువాన్లు అద్దె అమెరికన్ డాలర్లలోకి మార్చి ఇవ్వాలి. నా భార్య చితిమంటల్లో మాడి బుగ్గయిపోవడం నాకు అస్సలు ఇష్టంలేదు. త్వరలో ఊపిరితిత్తుల కాన్సర్‌కి చికిత్స కనుగొనబడుతుంది అన్న నమ్మకం నాకుంది అంటాడు. ప్రేమకి నిదర్శనమా? ఇది.

-వీరాజీ