Others

వయోజన విద్యతో సామాజిక మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండవ ప్రపంచ యుద్ధం అన్ని దేశాలనూ ప్రభావితం చేసింది. ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది. ఈ మార్పులే అన్ని దేశాలలో ప్రజాస్వామిక వ్యవస్థకు పాదులు వేశాయి. రాజకీయ పార్టీలు తమ పంథాను మార్చుకుని ప్రజలను అక్కున చేర్చుకునే దశకు వచ్చాయి. ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రతి దేశంలో చిగురించాయి. గతితర్కంగా ఆలోచించే దశ వచ్చింది. ప్రపంచ దేశాలు తమ తమ ప్రాంతాలలో అందర్నీ అక్షరాస్యుల్ని చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నాయి. అన్ని దేశాలు వయోజన విద్యపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాయి. అక్షరాస్యత లేని దేశాలలో వయోజన విద్యా కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేయటంతో ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ వర్గాలు తెలుసుకోగలిగాయి. దానివల్ల ప్రాపంచిక దృక్పథం పెరిగింది. విశ్వవిద్యాలయాల్లో ఈ అంశాలపై ప్రత్యేకమైన పరిశోధనలు జరిగాయి. వయోజనుల స్థితిగతులను తెలుసుకునేందుకు, వారిలో విద్యావ్యాప్తికి విస్తృతంగా పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల ఫలితంగానే చదువు అందని వర్గాల కోసం విద్యా కేంద్రాలు పెట్టారు. గిరిజన కేంద్రాలు వెలిశాయి. దూర విద్యా కేంద్రాలు వచ్చాయి. సమాచార రంగంలో వచ్చిన విప్లవాలు ప్రసార సాధనాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 20వ శతాబ్దం చివరి నాటికి వయోజన విద్యా స్వరూపమే సంపూర్ణంగా మారిపోయింది.
వయోజన విద్యకు, తరగతి చదువుకు తేడా వుంటుంది. తరగతి విద్యలో గతాన్ని పుస్తక రూపంలో పాఠ్యాంశంగా అందిస్తారు. గతం నుంచి వర్తమానానికి దారులు వేసుకునేందుకు మూలాలు ఆ పాఠ్యాంశంలో ఉంటాయి. అవే భవిష్యత్ ఆలోచనలకు పునాదులై ముందుకు సాగుతాయి. ఈ ఆలోచనల సాధనాలే పుస్తకాలు. వయోజన విద్యకు మూలం సమాజం. అక్షర జ్ఞానం లేనివారిలోనూ అద్భుతమైన ఆలోచనలు ఆవిష్కృతమవుతాయి. వారి ఆలోచనలు సమాజం నుంచి వస్తాయి. వయోజన విద్యకు మూలాలు వెతకటం అంటే అది యాక్షన్ రీసెర్చి. ప్రజలతో మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణలు చేయటం అంత సులభమైనది కాదు. అందుకోసం సాధన చేయాలి. 60 ఏళ్ల క్రితం గ్రామాలకు వెళ్లి రాత్రి పాఠశాలలు పెట్టి వయోజనులకు చదువు చెబుతుంటే వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన అమోఘమైంది. వయోజనులకు మాక్సిం గోర్కీ రాసిన అమ్మ నవలను చదివి వినిపించాం. గోర్కీ నవలలో వున్న అమ్మ ముఖం తమ ఇంట్లో వున్న అమ్మ ముఖంలానే వుంటుందన్న భావన వారిలో కలిగింది. ఇలాంటి పుస్తకాలలో తమ జీవితాలు కూడా వుంటాయని తెలుసుకుని తాము కూడా చదువుకుంటామని మావూరి ఎల్లయ్య అక్షరాలు నేర్చుకున్నాడు. వయోజనులలో అక్షరాలు నేర్చుకుంటే ఫ్యూడల్ సమాజాన్ని కూల్చవచ్చుననే భావన ఆనాటి ఆంధ్ర మహాసభ కార్యకర్తలలో ఉండేది. చివరకు ఆ భావనే నిజమైంది. దొర గడీలను కూల్చటానికి వయజన పాఠశాలలు పునాదులు వేశాయి. వయోజన విద్యాలయాలు చాలా దేశాల ముఖచిత్రాలను కూడా మార్చివేశాయి. క్యూబాలో విద్యా విధానం వర్థిల్లటానికి ప్రధాన కారణం వయోజన విద్య. అక్కడి విద్యార్థులు ప్రపంచ దేశాలకు డాక్టర్లుగా వెళుతున్నారు. క్యూబాలో కుటుంబ పెద్దలు సంపూర్ణ విద్యావంతులు కావటంతో వారు పిల్లలను బాగా చదివించగలిగారు. వయోజన విద్య సిలబస్ వారి జీవిత పాఠాల నుంచే వస్తుంది. అందుకే దీన్ని యాక్షన్ రీసెర్చి అంటారు. సమస్యలను విశే్లషించే అనుభవం వారికుంటుంది కాబట్టి ఆ కోణం నుంచి పుస్తకాలను అధ్యయనం చేస్తారు. పుస్తకాలను సులభంగా విశే్లషించగలుగుతారు.
వయోజన పాఠశాలలను నిర్వహించే మనిషి ఆలోచనలు కూడా పదునుగా వుంటాయి. పాఠం వినేవారి అనుభవాలు పుస్తకంలోని భావనలతో ఇంటరాక్ట్ అవుతాయి. అదే చైతన్యానికి మూలం అవుతుంది. వరికుప్పల దగ్గర పడుకునే పాలేర్లు యజమాని చెప్పినా వినకుండా రాత్రి పాఠశాలలకు వచ్చేవారు. కుప్పకాడికి వెళ్లమని గద్దిస్తే రాత్రి పాఠశాల ముగిశాకే వెళతానని యజమానితో చెప్పేవారు. ఇలా యజమానికి ఎదురుచెప్పటం రాత్రి పాఠశాలల వల్లనే జరిగింది. సామాజిక ఉద్యమాలకు మూలం వయోజన విద్యలో ఉన్నాయి. దూరవిద్యలో వుండే వారి ప్రమాణాలు మామూలు తరగతి గది విద్యా ప్రమాణాల కంటే ఎక్కువగా వుంటాయి. వీటిని విద్యార్థి సెల్ఫ్ స్టడీతో వచ్చిన పరిణామాలుగా గుర్తించాలి. వయోజన విద్య తరగతి గది సాంప్రదాయ వాతావరణాన్ని ఛేదిస్తుంది.
విద్య లక్ష్యం సమాచారం కాదు. చదువుకునే విద్యార్థిని కార్యోన్ముఖున్ని చేయాలి. దీనివల్ల వినేవారిలో ఆకాంక్షలు పెరుగుతాయి. వారి ఆలోచనలు పదునెక్కుతాయి. విశ్వవిద్యాలయాలలోని ఎక్స్‌టెన్షన్ వర్క్‌ను, వయోజన విద్యా సంస్థ కార్యకలాపాలను ప్రజల దగ్గరకు తీసుకుపోతాయి. అంబేద్కర్ యూనివర్సిటీ చేసే పనులు బయటకు కనపడకున్నా, వాటి ఫలితాలు సమాజంలో విస్తృతంగా కనిపిస్తాయి.

- చుక్కా రామయ్య