హైదరాబాద్

మహాగణపతి విగ్రహం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి పనులు పూర్తి అయ్యాయి. శ్రీ చండీకుమార అనంత మహాగణపతిగా దర్శనం ఇవ్వనున్న గణనాథుడి విగ్రహానికి బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం శిల్పి రాజేంద్రన్ నేత్రాలు అమర్చారు. జూన్ మొదటి వారంలో ప్రారంభమైన పనులు రెండున్నర నెలల పాటు నిర్విరామంగా కొనసాగాయి. విగ్రహ ఏర్పాటు కోసం అమర్చిన కర్రలను గురువారం సాయంత్రం వరకు తొలగించి భక్తుల దర్శనానికి సిద్ధం చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
గణనాథుడికి భారీ చేనేత కండువా
గౌరీ తనయుడి ఆకారానికి తగట్టుగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణనాథుడికి 75 అడుగుల కండువా, గాయిత్రిని సమర్పించనున్నట్టు సంఘం అధ్యక్షులు కడారి శ్రీ్ధర్ తెలిపారు. గురువారం ఏకదంతునికి సమర్పించనున్న సంఘం గౌరవ అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామిలతో కలిసి కండువా, గాయిత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తమ సంఘం ఆధ్వర్యంలో దేవదేవునికి భారీ కండువాను అందజేస్తున్నామని, అదే అనవాయితీగా ప్రత్యేక మగ్గాలపై చేయించిన చేనేత కండువా, గాయిత్రిని అందజేస్తున్నట్టు చెప్పారు. ఈనెల 25న ఉదయం ఏడు గంటల సమయంలో సంప్రదాయబద్ధంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాల నడుమ వాటిని స్వామి వారి చెంతకు తీసుకెళ్తామని చెప్పారు. ముఖ్య అతిథులుగా హాజరయ్యే ఐఎఎస్ అధికారులు అనిత రాజేంద్ర, పార్థసారధి, చిరంజీవులు, శ్రీ్ధర్, మామిడి హరికృష్ణలు భక్తిశ్రద్ధలతో స్వామికి సమర్పిస్తారని చెప్పారు. ఖైరతాబాద్ మహాగణపతికి చేనేత కండువా అందించే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.