హైదరాబాద్

హరితహారంలో నాటిన మొక్కలు అరకోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:మహానగరంలో పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం చురుకుగా సాగుతోంది. జిహెచ్‌ఎంసి పరిధిలో అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో దాదాపు కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న జిహెచ్‌ఎంసి బుధవారం నాటికి సుమారు అరకోటి మొక్కలను వివిధ ప్రాంతాల్లో నాటినట్లు, మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్యాలయాలు, జిహెచ్‌ఎంసి ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటడటంతో పాటు ఇప్పటి వరకు 50లక్షల 84వేల 300 మొక్కలను పంపిణీ చేశారు. ముఖ్యంగా హరితహారం కార్యక్రమం కింద కేవలం మొక్కలను నాటడమే గాక, నాటిన ప్రతి మొక్కను పరిరక్షించుకునే దిశగా బల్దియా ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇందుకు గాను జిహెచ్‌ఎంసి ఖజానా నుంచి పైసా కూడా ఖర్చు చేయకుండా పలు కార్పొరేట్ సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ట్రీగార్డులను సమకూర్చుకుంటుంది. నిర్ణీత గడువు అయిన వచ్చే నెల 23వ తేదీలోపు కోటి మొక్కలను నాటి, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని ఖాళఈ స్థలాల్లో 38వేల మొక్కలను నాటగా, ఎవెన్యూ ప్లాంటేషన్ 22వేలు, గ్రీన్ కర్టెన్‌లలో 12వేలు, గ్రీన్ వేలలో 4800, చెరువుల ప్రాంతాల్లో 12వేలు, గత హరితహారం కార్యక్రమంలో చనిపోయిన మొక్కల స్థానంలో 68వేల మొక్కలను నాటగా, నగరవాసులకు ఉచితంగా సుమారు 48లక్షల 60వేల 558 మొక్కలు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, 11లక్షల 32వేల మొక్కలను నాటడంలో సెంట్రల్ జోన్ ముందంజలో ఉంది. 9లక్షల 56వేల 995 మొక్కలను పంపిణీ చేసి వెస్ట్‌జోన్ రెండో స్థానంలో, 8లక్షల 87వేల 365 మోక్కలను పంపిణీ చేసిన సౌత్ జోన్ తృతీయ స్థానంలో నిలవగా, 8లక్షల 7వేల 844 లక్షల మొక్కలను పంపిణీతో నార్త్‌జోన్ నాలుగో స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
78 శాతం పూర్తయిన జియోట్యాగింగ్
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటుతున్న మొక్కల్లో ఇప్పటి వరకు 779 స్థలాల్లోని సుమారు 36లక్షల 58వేల 600 మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేసిన జిహెచ్‌ఎంసి ఈ ప్రక్రియలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. హరితహారం కింద నాటిన మొక్కల వివరాలను, వాటి స్థితిగతులను కేవలం అధికారులే గాక, నగరవాసులు కూడా తెల్సుకునేందుకు ఈ జియో ట్యాగింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
8వేల 612 మంది గ్రీన్ బ్రిగేడియర్లు
ఈ ఏటా చేపట్టిన హరితహారం కార్యక్రమం గతంలో కన్నా కాస్త భిన్నంగా నిర్వహిస్తున్నారు. కేవలం మొక్కలు నాటి పనైపోయిందనుకోకుండా వాటి పరిరక్షణకు ప్రత్యేకంగా 8వేల 612 మంది హరిత ప్రేమికులతో గ్రీన్ బ్రిగేడియర్లను నియమించారు.