రాజమండ్రి

తెలుగు భాషా మాధుర్యం (మాతృభాషామృతం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుజాతి గొప్పదనం, తెలుగుభాష

కమ్మదనం తెలుసుకున్న వాళ్లకి తెలుగే

ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి

మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్లను

నువ్వు మరచినట్టురా అన్నాడో సినీ కవి.
తెలుగు గురించి చెప్పుకోవడమంటే అమ్మ

గురించి మాట్లాడుకోవడమే. అందమైన

అజంతా భాష స్వచ్ఛమైన తెలుగు భాష.

భాష పద సంపద కలిగినది, ఉచ్ఛారణ

సౌలభ్యం కలిగినది, మాధుర్యాన్ని

కలిగినట్టిది మన తెలుగుభాష. అటువంటి

మాధుర్యం కలిగి ఉండటం వలనే ఈ భాష

ఎందరికో ఆనందాన్ని కలిగించింది. అందుకే

కన్నడ ప్రభువు అయిన

శ్రీకృష్ణదేవరాయలుచే కూడా ‘దేశ

భాషలందు తెలుగు లెస్స’ అని కీర్తించబడిన

రాజభాష మన తెలుగుభాష.
‘మాతృభాష మన ఇల్లు
తెలుగు కవిత పన్నీటి జల్లు
ఏ ఒక్కరు కలం పట్టినా జాలు పరిమళాలు

వ్రాలు’
- అంటారు కుందుర్తి ఆంజనేయులు.

అజంతాల సుందరి అదే తెలుగు పందిరి.

తెలుగు నుడికారం మనందరికి అలంకారం.

ఆత్మశక్తి గూర్చు అజరామరమైన భాష

మన తెలుగు భాష.
దేశము పట్టినంతటి మహాకవి విశ్వనాథ

సత్యనారాయణ తెలుగు గురించి

మృదుమధురంగా వివరించారు.
ఒక సంగీతమేదో పాడుచున్నట్లు
భాషించునపుడు విన్పించు భాష

స్పష్టోచ్ఛారణంబు ననొనరు భాష
రసభావముల సమర్పణ శక్తియందున

అమర భాషకు దీటైన భాష
జామలలోనున్న చేమ యంతయు

చమత్కృతి

పల్కులన్ సమర్పించు భాష
భాషలొక పది తెలిసిన ప్రభువుచూచి

భాష యన నిదియని చెప్పబడిన భాష
తనదు ఛందస్సులోని యందమ్ము నడక
తీర్చి చూపించినట్టిది తెలుగు భాష
తేనెసొనలు కురియు భాష తెలుగు భాష
అటువంటి గొప్ప తేనెలూరు భాష, తేటయిన

భాష, తరతరాల వారధిగా తలెత్తుకుని

నిలబెట్టి భాష మన తెలుగు భాష. ఏ

ప్రక్రియలోనైనా ఒదగటం భాషకు

ఉండాల్సిన విశిష్ట లక్షణం. ఆ రకంగా చూస్తే

తెలుగు వెలుగు ఏనాడైనా దేదీప్యమానమే!
భాషామూర్తి చదువుతల్లి ఎందరు కవి

పండిత మునిగాయక జనావళిని

పొదువుకుందో! ఆ ప్రస్థానం ఇప్పటిదా!

పదకొండో శతాబ్దం నాటిది. తెలుగుల

కన్నయ్య ఆదికవి నన్నయ వినిపించే

ప్రథమనామం. తెలుగు పద్య విద్యకు

ఆద్యుడు నన్నయ. తెలుగు నుడికారానికి

గుడి కట్టినవాడు తిక్కన. ఆంధ్ర

మహాభారతానికి నిండుదనం

సమకూర్చాడు ఎర్రన.
ప్రతి గుండెలో గుడి కట్టుకున్న ధర్మమూర్తి

రామయ్య వాల్మీకి ఆర్తికాదా! ఇంకా

బసవన్నను కీర్తించిన పాల్కురికి, నిత్య

పారాయణం నోచుకున్న తెలుగుల

పుణ్యపేటి పోతన భాగవతం--
అక్షరమూర్తికి ఆభరణాలై అలరాయి.

అదేవిధంగా శృంగార మధువు సీసాలలో

నింపి విద్యదౌషధం కావించాడు శ్రీనాథుడు.

తెలుగు సరస్వతిని సువర్ణ పుష్పములతో

అలంకరించిన రాయల యుగం తెలుగు

భాషకు స్వర్ణయుగం. చేమకూర వేంకట కవి

పద్య చమత్కారానికి పెద్దపీట వేశాడు.

ఆధునిక కవితా విహాయాసన

పద్యకవిత్వాన్ని విహరింపజేశారు తిరుపతి

వేంకట కవులు, కొప్పరపు సోదరులు.

ఆధునిక యుగ దస్తూరి కందుకూరి,

తెలుగమ్మచే వ్రాలు రాయప్రోలు,

అడుగుజాడ గురజాడ, సంప్రదాయ కవితా

కల్పవృక్షము విశ్వనాథ సత్యనారాయణ,

అభ్యుదయ కవిత్వోద్యమ రథసారథి శ్రీశ్రీ,

భావకవుల కల్పవల్లి దేవులపల్లి గేయ

కవిత్వానికి చిరునామా సినారె, ఆంధ్ర

కవితా కుమారిని అర్చించినవాడు కరుణశ్రీ,

కవితా మాధుర్యమందు భేషువా

అనిపించుకున్నాడు జాషువా.
గాన యోగ్యతల భాష మన తెలుగు భాష.

మధుర కవితా దార్శనికుడు అన్నమయ్య

వాడిన మాటలు అమృతకావ్యంగా, పాడిన

పాటెల్ల పరమగానంబుగా జీవితాంతం

కీర్తనల రచన, ప్రచారం, సంరక్షణకే

కృషిచేసిన ధన్యజీవి అన్నమయ్య.
వీరంతా తెలుగు భాషకు ఎనలేని సేవ

చేశారు. తెలుగు భాషను సుసంపన్నం

చేశారు. వీరంతా తెలుగును ఆరాధించారు.

తెలుగును ఆదరించారు. తెలుగుకు

ప్రణమిల్లారు. ఇంత గొప్ప తెలుగు

మాతృభాషగా లభించినందుకు కారణం

మన పూర్వజన్మ సుకృతం. అందుకే

రాయప్రోలు సుబ్బారావు గారంటారు -
ఏ ప్రపుల్ల పుష్పంబుల నీశ్వరునకు
పూజ చేసితినో ఇందు పుట్టినాడే
కలదమేని పునర్జీన్ము కలుగుగాక
మధుర మధురంబైన తెన్గు మాతృభాష
తెలుగు మనకు ప్రాణం. పలకాలి అనుక్షణం.

అమ్మ బాష అందం కమ్మనైన బంధం.

తెలుగు భాషా మాధుర్యాన్ని ఖండ

ఖండాంతరాల విస్తరింపజేసింది పద్యకవిత.

ఇది తెలుగు ప్రజల సొమ్ము. తెలుగు పద్యం

ఎంత పాతదో అంత కొత్తది. ఆపాత మధురం,

ఆలోచనామృతం. ఆస్వాదయోగ్యం.

‘తల్లిపాల వంటిది మాతృభాష, పోత పాల

వంటిది పరభాష’ అటువంటి అమ్మ భాషను

మరిచి పరభాషకు అంకితమైపోతున్నాము.

మాతృభాష కళ్లు లాంటిది, ఇతర భాష

కళ్లజోడు లాంటిది. కళ్లజోళ్లు ఎన్నైనా

మారుస్తాము కానీ కళ్లు మార్చలేము.

మాతృభాష తపస్సు, మహిత జగతికి

ఉషస్సు. తెలుగే మన ప్రాణం భవితకు

మాగాణం.
తెలుగు నాడును గొల్వరా తమ్ముడా
తెలుగు గాలిని పీల్చరా
తెలివిగలవారంతా తెలుగువారేనోయి
- అంటారు కర్లపాలెం కృష్ణారావుగారు.

కనుక మనందరం ముద్దులొలికే తెలుగును

ముచ్చటగా పలకాలి. పలుకు పలుకులో

కులుకు పరవశించి పలకాలి.

- గుంటూరు వెంకటాచారి సెల్: 9866545926