రాజమండ్రి

ఒక యోధుని బాధ! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ యోధుడు ఆ చెట్టు కింద
కదలక మెదలక కూర్చుండిపోయేడు
దరిజేరిన నావైపు ఆశగా సౌంజ్ఞ చేశాడు
దీర్ఘకాల యుద్ధం రాత్రితో ముగిసింది
ధరాతలంమీద మృతవీరుల సాక్షిగా

తెల్లవారింది!

‘అయ్యా! నాకో సాయం చేస్తారా?’
అంటూ పేలవంగా నవ్వాడు-
‘గుక్కెడు నీళ్లు నా గొంతులో పోస్తే
నేను తప్పక బతుకుతాను!’
‘రాత్రనక పగలనక పోరాడి అలసిపోయేం-
తడి ఆరిన నా గొంతు గుక్కెడు
నీళ్లతో శాంతించి, బాధ తగ్గచ్చు!’

అతని చొక్కా రక్తసిక్తమై పోయింది
అతని వెచ్చని నెత్తురుతో మాతృభూమి
తడిసి, తనిసి తనిసి పరిమళిస్తుంది
‘్ఫరవాలేదు, అందరికన్నా నేనే నయం!
వారంతా గతించేరు; నాది చిన్న గాయం-
‘అలసివుంటాను, ముదిమి ప్రభావం
సూర్యుడు మండుతున్నా నేను

వణుకుతున్నా
మాదళం కొండనధిరోహించి జయించినా
భళ్లున తెల్లవారింది; నా ఒళ్లు చల్లబడింది!
సాయం కోసం చుట్టూ చూసేను-
లోయల్లో గోతుల్లో శవాలే శవాలు
శక్తివంచన లేకుండా గుళ్ల వర్షం

కురిపించాను
చివరికి ఇలా ఛాతి నొప్పితో చతికిలబడ్డాను!

నాదగ్గరున్న ఆహారాన్ని అందించాను-
‘మీకు రుణపడి ఉంటాను’- నసిగాడు
ఎన్నడూ చూసివుండని వెలుగు చూసేను
అతని ముఖమండలంలో-
‘నా అంతటి వీరుడిలా ఛాతినొప్పికి
లొంగి ఇలా చతికిలబడడం సిగ్గుచేటు!
నా భార్య, ఏమనుకుంటుందోగదా!
పాలిచ్చి పెంచిన తల్లి తన బిడ్డడు
ఒకనాడిలా ఛాతినొప్పికే చతికిల
బడగలడని తలపోసి ఉంటుందా?’

‘చీకటి అలుముకొస్తూన్నదా?’
వేదనతో వెలుగుల రేడుని బేలగా చూసేడు-
తెలతెలవారుతూందనుకున్నాను
పయనించడానికి ముందు...
కాస్తంత విశ్రాంతి లభిస్తుందని ఆశిస్తూ...’
అంతే.. అతడు స్వల్ప ఛాతినొప్పితో
ఆఖరి శ్వాస విడిచిపెట్టాడు

ఆ తర్వాత జరిగింది నాకేం తెలీదు
నేను తప్పక యేడ్చే ఉంటాను
చేతులారా అతడికి దగ్గరకు లాక్కుని
గుండెలకు అదుముకున్నాను-
మా యిద్దరి గాయాలు రేగుతున్నాయి
నా గుండె గాయం అతని ఛాతినొప్పి
కలిసిపోయి.. ఒకటిగా మారి!
- మరా శాస్ర్తీ
సెల్: 9885267370

ఆహ్వానం
సమాజ రూప నిర్మాణమొక చిత్రం
అడుగడుగున మార్పుల వలయాలు
ఆకర్షణ పుష్పాలై వికశిస్తాయి
మనిషి జీవన స్రవంతిలోనూ
లబ్‌డబ్‌ల సాక్షిగా
ఊహాతీతమైన పరిణామాలు
మూల మూలల్లోకి చొరబడుతూ ఉంటాయి
స్వార్థం, ప్రవాహంలా నెత్తురులో కలుస్తుంది
కోరికలు వింత రెక్కలు తగిలించుకుని
నేలను వీడి, నింగిన విహరిస్తాయి
సమస్త పరిణామాలకీ కేంద్రం
చంచలమైన మనసు
బహుముఖాలతో శతాధిక నేత్రాలు కలిగి
లోక వృత్తంలో అమరిన
వర్ణవైవిధ్యాన్ని ఆవిష్కరిస్తుంది
ఎక్కడ స్వార్థం చూపుల చుక్కలు
కేంద్రీకృతవౌతాయో ఆ ప్రాంతం
నల్లటి పెనుచీకటై భయపెడుతుంది
ధనకాంక్ష విసిరిన వలలో
నీతి జాడలు చేప పిల్లలౌతాయి
అవినీతి పర్వతంలాగ పెరిగి
నియంతృత్వపు శిరస్సున
మెరుపుల వజ్రకిరీట వౌతుంది
ఆ అట్టహాసపు దృశ్య సౌందర్యం
వికృత శృంగార రసక్రీడకి
ఆహ్వానం పలుకుతుంది
నిరోదపు ముళ్లై మొలకెత్తవలసిన వాళ్లు
వాడి, వేడి సెగలో అరిగించి
ప్రజల నెత్తిన కుచ్చుటోపీ లౌతారు
ప్రజల శిరస్సామ్రాజ్యాలపై
ప్రకాశిస్తున్న ఓటు వౌలిక రూపాన్ని
కుచ్చుటోపీ కృత్రిమ అందం మింగేస్తుంది
విశ్వమంతా విస్తరించిన
అవినీతి అత్తరుని ఒంటికి పులుముకొని
ఆనందపు పారవశ్యంలో విహరిస్తారు
మేధావుల్లారా! స్తబ్దతని వీడండి
నియంత్రణకి మార్గాల ననే్వషించండి
సమాజాన్ని విషమయం చేస్తున్న
ఆలోచనా తరంగాలను అడ్డగించండి
మన జాతిపైన, మన జెండాపైన
వెనె్నల పూజలు కురిసే రోజును
ఆహ్వానించండి! మనసారా ఆహ్వానించండి!
- ఎస్.ఆర్.పృథ్వి, రాజమహేంద్రవరం

అపురూపమైన భాష
అమ్మలోని లాలన
నాన్నలోని పాలన
ఆంధ్రుల అభిమానం
మన తెలుగు భాష

వజ్రములోని కాంతి
బంగారములోని ఆకర్షణ
మన తెలుగు భాష

స్వచ్ఛమైన భాష మన తెలుగు భాష
సరళమైన భాష మన తెలుగు భాష
చిరునవ్వుల పలకరింపు మన తెలుగు

భాష
ఆనందాన్ని పంచేది మన తెలుగు భాష

తెలుగునాడ ఆప్యాయత తెలుగు భాష
ఆంధ్రుల అభిమాన భాష
మన తెలుగు భాష
అంతటి అపురూపమైన భాష
మన తెలుగు భాష
- సిహెచ్ అనూష సౌజన్య
హుకుంపేట, రాజమహేంద్రవరం
సెల్: 9618621951