రాజమండ్రి

పండుగ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి దగ్గరున్న ఓ పల్లెటూరుకి ప్రతి

ఐదేళ్లు ఒకసారి పండగ జరుపుతారు. ఆ

పండక్కి ఎక్కడో స్థిరపడిన ఆ ప్రాంత

వాసులు పండగ జరుపుకోవడానికి

తరలివస్తారు.
రామయ్య కొడుకు అమెరికాలో ఉండటం

వలన ఈసారి రాలేకపోతున్నాడు.

రామయ్య పండగలో చురుకుగా

పాల్గొనటలేదు. అందరింట్లో ఉన్న

బంధువులు చూసి రామయ్యకు కన్నీళ్లు

ఆగడంలేదు!
కట్టుకున్నది చనిపోయి బతికిపోయింది.

లేకపోతే పండగ అనాథగా చూడటం కష్టం.
రామయ్య ఆలోచనలు వెనక్కి వెళ్లాయి.

అప్పట్లో పండగను ఒక జాతరలా

చేసుకొనేవారు. అందరూ వచ్చేవారు.

ఎవరైనా రాకుండా ఉంటే జరిమానా

విధించేవారు. ఇంతలో పక్కింట్లో ఉండే

నరేష్ రామయ్య దగ్గరికి వచ్చి,
‘దిగులు పడకండి, మీకు మేమున్నాం’
నరేష్ బాబు నీది చాలా మంచి మనస్సు. ఆ

మంచి మనస్సు అబ్బాయి శ్రీకర్‌కి ఉంటే

ఆనందించేవాణ్ణి!
పండగంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం

క్రమంగా కష్టంగా మారుతుంది. ఒకప్పుడు

నా ఇంట్లో ఇరవై మంది ఉండేవారు.

క్రమంగా మారి ఒక్కడిగా మిగిలాను.

ఇప్పుడు పండగ వచ్చినా సుఖమేమి?
ఎవరైనా ఊరు వెళితే తొందరగా

వచ్చేయండి అని చెప్పిన నేను ఇప్పుడు

ఊరు వెళితే వెళ్లండి డబ్బు కోసమే కదా

అని చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగానే

శ్రీకర్‌ని పంపించా కానీ వాడు అక్కడే

ఉండిపోతారని అనుకోలేదు.
తన తల్లి చనిపోయినప్పుడు రాత్రి వచ్చి

ఉదయం వెళ్లిపోయాడు. నేను చచ్చిపోతే

వస్తారో రారో. నాకు తెలిసి అక్కడ వాడికి

పెళ్లయిపోయి ఉంటుంది. ఇప్పుడు పండగకి

వస్తే ఆనందించేవాణ్ణి. ఈ ఊరిలో పుట్టి,

పెరిగి పండగ వస్తే ఎగిరిగెంతేవాడు. నా

చావుకి వచ్చినా రాకపోయినా పండగకి

మాత్రం రావాలని ఫోన్ చేసి

చెప్పాలన్పించింది.
ఎందుకంటే తర్వాత పండగకి నేను ఉండను

కదా!
ఊరి పండక్కి లక్షమంది వచ్చినా ఎక్కడా

ఏ కష్టం రాకుండా చూసుకొనేవాణ్ణి. మన

ఊరు అమ్మవారు వలనే మనకి ఏ కష్టం

రాలేదు. అలాంటి అమ్మవారు నాకెందుకు

ఊబి కలిగిన జీవితం ఇచ్చింది!
ఊరి వాళ్లు వచ్చి ‘రామయ్యా ఈసారి నీ

చేతులలో పండగ జరపడం కష్టం’ అని

చెప్పగానే నా గుండె ఆగిపోయింది.

ఒంటరివాణ్ణి కదా అందుకే ఆ మాట

అన్నారు. ఇలాంటి జీవితం ఎవ్వరికీ

ఉండకూడదు. అమ్మవారు ఎంత త్వరగా

తీసుకువెళ్లిపోతే అంత మంచిది. కొడుకు

చూడక ఊరిలో వారు చూడక ఏంటి నా

పరిస్థితి.
తెల్లారింది ఊరు పండగ మొదలైంది.

సాయంత్రం అయ్యేసరికి రామయ్య ఇంటి

ముందు కారు ఆగింది. శ్రీకర్, అతని భార్య,

వాళ్ల కొడుకు శ్యామ్ కారు దిగారు.
రామయ్య ఆశ్చర్యపోయాడు. ఒక క్షణం నోటి

నుండి మాట రాలేదు.
‘నాన్నా నన్ను క్షమించు’ కాళ్లు మీద

పడ్డాడు.
రామయ్య కన్నీరు తుడుచుకుంటూ ‘లే..

బాబూ’ అంటూ లేపి ‘ఇప్పటికైనా తండ్రి

గుర్తొచ్చాడు అదే సంతోషం’
మీరు ఎలా కుమిలిపోతున్నారో అర్థం

చేసుకొన్నాను. రాత్రికి రాత్రే ఫ్లైట్ ఎక్కి

వచ్చేశాము. భార్యను, కొడుకును

పరిచయం చేశాడు.
నరేష్ రామయ్య చెప్పిందంతా వీడియో

తీశాడు. అది వాట్సప్ ద్వారా నరేష్ శ్రీకర్‌కు

పంపాడు. అది చూసి చలించాడు శ్రీకర్.
రామయ్య ఊరి పండగను హుషారుగా తన

చేతులమీదుగా జరిపించారు. ఇది చూసి

శ్రీకర్ కూడా చాలా సంతోషించాడు.

- నల్లపాటి సురేంద్ర, సెల్: 9490792553