విజయవాడ

బివి మెమోరియల్ ట్రస్ట్ జాతీయ స్థాయి కవితల పోటీ (వేదిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, మల్లెతీగ

సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో

రచయిత, కార్టూనిస్ట్ బండికల్లు జమదగ్ని

తమ తండ్రి స్మారకార్థం ‘బండికల్లు

వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్’ను స్థాపించి

జాతీయ స్థాయి కవితల పోటీకి కవితలను

ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన ఉత్తమ

కవితలకు ప్రథమ బహుమతిగా రూ.

2వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 1500,

తృతీయ బహుమతిగా రూ. 1000, మూడు

ప్రోత్సాహక బహుమతులుగా రూ. 500

చొప్పున ఇవ్వనున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక

అధ్యక్షుడు బండికల్లు జమదగ్ని, కార్యదర్శి

బండికల్లు శ్యామ్‌ప్రసాద్ ఒక ప్రకటనలో

తెలిపారు. కవిత నిడివి 30 పంక్తులకు

మించకుండా సామాజిక స్పృహ కలిగినదై

ఉండాలి. కవిత ఈ పురస్కారం కోసం

ప్రత్యేకించి రాసినదై ఉండాలి. కవితతో పాటు

రెండు జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో

పంపాలి. ఒక్కొక్కరు రెండు కవితలు

పంపవచ్చు. కవితల ఎంపికలో ట్రస్ట్‌దే తుది

నిర్ణయం. విజేతలకు గుంటూరులో జరిగే

సభలో నగదు పురస్కారం అందజేస్తారు.

ఆసక్తి కలిగిన కవులు తమ కవితలను

‘బండికల్లు జమదగ్ని, ఎంబిఏ, 402,

హిమజ టవర్స్, 3/10 బ్రాడీపేట, గుంటూరు-

522002’ చిరునామాకు సెప్టెంబర్ 30లోగా

పంపాలని నిర్వాహకులు కోరారు.