విజయవాడ

వేటూరి మాట.. పాట.. బాట! (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషా పరిశోధనలు కొత్త ఒరవడికి నాంది

పలుకుతాయి. కొన్ని కేవలం మొక్కుబడి

పరిశోధనలుంటాయి. కొన్ని ఎత్తిరాసినవీ

ఉంటాయి. కొండొకచో ఘోస్ట్ (కష్టం ఒకరిది,

ఫలితం ఒకరిది) పరిశోధనలూ ఉంటాయి.

చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జాతికి

పనికొచ్చే పరిశోధనలు వస్తుంటాయి. అదే

కోవకు చెందినది డాక్టర్ జయంతి చక్రవర్తి

పరిశోధించి, పరిశీలించి, వేధించి

వెలువరించిన పుస్తకం ‘వేటూరి పాట’

(వేటూరి పాటలు - సాహిత్యపు విలువలు).
సినీ మాటలు, పాటల రచయిత వేటూరి

సుందరరామమూర్తిలో అనేక కోణాలు,

సంప్రదాయ విద్యల పట్ల మమకారం, భాష

పట్ల అనురక్తి ఆయనను పాటలీపుత్ర

రారాజును చేశాయి. 1974లో ప్రారంభమైన

ఆయన పాటల ప్రస్థానం కనుమూసే వరకూ

దశాబ్దాల పాటు సాగింది. ‘ఆరేసుకోబోయి

పారేసుకున్నాను.. వేణువై వచ్చాను

భువనానికీ..’ అని చాటినా, ‘మానసవీణా

మధుగీతం’ అని నినదించినా, ‘రాలిపోయె

పూవా నీకు రాగాలెందుకే’.. అని జీవిత

సత్యాలు వివరించినా అది వేటూరికే చెల్లింది.

ఆయన నిర్మాతల కోరికల మేరకు పాటలు

రాసినా తన వాణి, బాణిని ఏనాడూ

వదులుకోలేదు. పాటకు జీవలక్షణం

ఉండాలనేవారు వేటూరి. పుస్తకం

ప్రస్తావనలోకి వస్తే పాటల పూదోటలో

పూలపల్లకి వేటూరి సుందరరామమూర్తి

పాటలు - సాహిత్యపు విలువలు పరిశోధనా

గ్రంథం 390 పేజీల్లో వేటూరి పూర్తి సాహిత్య

విలువలు ప్రతిబింబించకపోయినా ఆయన

పాటకు సంబంధించిన అనేక అంశాలను

పరిశోధకుడు డాక్టర్ జయంతి చక్రవర్తి

వివరించారు. చాలామందికి ఆయన పాటల

రచయితగానే తెలుసు.
కానీ ఆయనలోని అనేక కోణాలను దగ్గరగా

చూసిన వారిలో జయంతి చక్రవర్తి ఒకరు.

74తో ప్రారంభించిన ఆయన పాటల

ప్రస్థానాన్ని 1999 వరకు పరిశోధనా

అంశంగా రచయిత తీసుకున్నారు. 99

సినిమా పాటలకు సంబంధించిన ప్రధాన

అంశాలను ప్రస్తావించారు. పాట చరిత్ర,

జీవిత పరిచయం, పాటల సాహిత్య

విలువలు, పాటలో వస్తు వైవిధ్యం,

వేటూరిజం (శైలి పరిశీలన), వ్యక్తిత్వం,

ఆయన అంతరంగ కథనం అంశాలను ఈ

పుస్తకంలో పాఠకులు తెలుసుకోవచ్చు.

పుస్తకం : వేటూరి పాట
రచయిత : డాక్టర్ జయంతి చక్రవర్తి
పేజీలు : 390, వెల : రూ. 500
ప్రతులకు : అన్ని పుస్తక
విక్రయ కేంద్రాలు

- వేలూరి కౌండిన్య, విజయవాడ. చరవాణి : 9392101586