విశాఖపట్నం

ఆలోచింపజేసే వలి శతకాక్షరి (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు పెట్టి చదివితే ఎన్నో నీతిసూత్రాలు

కనిపిస్తాయి ఈ వలి శతాక్షరిలో. వలి

వయసులో చిన్నవాడైనా సమాజాన్ని

చదవడంలో మనసున్న పెద్దవాడే.
పాటకి పల్లవి ఎంత ముఖ్యమో పద్యానికి

మకుటం అంతే ముఖ్యం. పద్యం చివరి

పాదం ‘వ్యర్థమేనోయ్... వలి’ ఎవరో గురువు

‘హలో వేస్ట్ వలి’ అని సంబోధిస్తున్నట్లుగా

చాలా చక్కని మకుటంతో వలి శతాక్షరిని

రక్తి కట్టించారు. వలి వృత్తిరీత్యా

జంతుశాస్త్రంలో అధ్యాపకులు అయినప్పటికీ

ముఖచిత్రంలో కొత్తదనం చూపారు. ఆడపిల్ల

విలువతో పాటు వన్యప్రాణి రక్షణ

ప్రాముఖ్యత చాటారు. తెలుగు భాషపై

మక్కువ ఎక్కువ. కాబట్టి తెలుగుకు

వెలుగులద్దారు కొన్ని పద్యాల ద్వారా.
ఈ శతాక్షరిలో ఏది వ్యర్థమో కొన్ని

జీవితసత్యాలు సరళంగా తెలుపుతూ

వాటిని ఏరిపారేస్తూ పాఠకులని

చైతన్యపరిచారు ఈ పుస్తకంలో.
తెలుగు భాష విలువను తెలుపుతూ ‘తల్లి

పాల రుచి తెలియనివాడు మాతృభాషనే

మరిచిన వాడు తెలుగు వెలుగులు చూడని

వాడు వర్థమేనోయి వలి’ అంటారు. తెలుగు

భాషకు వెలుగులు విరజిమ్ముతూ ‘రాజు

లేని కోట పల్లవి లేని పాట అనుభవం లేని

ఆట వ్యర్థమేనోయి వలి’ అంటారు. నిజమే

పల్లవి లేని పాట ఎక్కడైనా ఉంటుందా?
అదే విధంగా వృక్షాలపై రాస్తూ ‘వృక్షాలను

ఖండించుట అమాయకుల్ని శిక్షించుట

దేశద్రోహుల్ని రక్షించుట వ్యర్థమేనోయి వలి’

అంటారు.
వృక్షోరక్షతి రక్షిత: అని ఓవైపు చెబుతూనే

వందమంది దోషులు తప్పించుకున్నా

ఫర్వాలేదు కానీ ఒక నిర్దోషి శిక్షింపబడడం

ఘోరం అని చెబుతారు. ఇవి పద్యాలు

అనలేం. కవితలూ అని చెప్పలేం గానీ ఈ

రచయితలో ఏదో చెప్పాలన్న తపన, తృష్ణ

మెండుగా ఉన్నాయి. వలి ఇంకా ప్రాథమిక

దశలో ఉన్నా సమాజానికి మంచి

అందించాలన్న ఆశయం గల కవి.
‘తాగుబోతుల మాట/కర్ణకఠోర పాట/

ఆరోగ్యాన్ని ఇవ్వని ఆట మూడూ వ్యర్థమే

అంటారు. అదే విధంగా ఈ కవి ఈ చిన్న

పద్యం ద్వారా మనిషి జీవితపు విలువలు

తెలిపారు.
‘అదుపులో లేని నోరు/ ఇంటిలోన పోరు

ఉన్నట్లయితే మనిషి మనుగడ కష్టం.

ఎలాగంటే అధికంగా పెరిగిన నోరు వల్ల ఏ

ప్రయోజనం ఉండదు. ఆ వ్యక్తికి గౌరవం

ఉండదు.
ప్రతులకు : షేక్ మస్తాన్‌వలి,
చంచర్లపాటు (మం), గుడిమెట్ల (పోస్టు),
కృష్ణా జిల్లా-521182. సెల్ : 9948931373.

- ఈవేమన, సెల్ : 7893451307.