విశాఖపట్నం

నిముషం లేటు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి.

స్వప్నకు తొంభై ఎనిమిది శాతం మార్కులు

వచ్చాయి. అందరూ అభినందించారు. తండ్రి

సుకుమార్, తల్లి పవిత్ర ఎంతగానో

ఉప్పొంగిపోయారు.
‘‘నా పేరు నిలబెట్టావు తల్లీ’’ తండ్రి

ఆనందంగా అన్నాడు.
‘‘ఎంసెట్‌కు బాగా ప్రిపేరవ్వు. మంచి ర్యాంక్

సాధించాలి’’ అంది తల్లి.
‘‘అలాగేనమ్మా తప్పకుండా ర్యాంక్

సాధిస్తాను. కష్టపడి చదువుతాను’’ చెప్పింది

స్వప్న.
తల్లికిచ్చిన మాట ప్రకారం ఎంసెట్ కోసం

కష్టపడి చదవసాగింది.
సుకుమార్ ఉన్నది పట్టణానికి ముప్పై

కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న

గ్రామంలో. ఆర్‌టిసి బస్సులు

తిరుగుతుంటాయి కానీ టైముకి రావు.

పరీక్షకు ఎలా వెళ్లాలా అని

ఆలోచించసాగాడు.
‘‘నాన్నా మనం ఆరు గంటలకల్లా

బయలుదేరుదాం. అలా అయితేనే పరీక్షా

కేంద్రానికి ముందుగా చేరుకోగలం’’ అంది

స్వప్న.
‘‘నిజమే పరీక్షా కేంద్రం వెదకడానికి మనకు

టైం సరిపోదు. నిముషం లేటయినా

రానివ్వరట. ఇదేం నిబంధనో అర్ధం కాదు’’

అన్నాడు తండ్రి.
‘‘అలాగే
‘‘మనం వేగిరం వెళ్లిపోదాం నాన్నా’’ అంది

స్వప్న.
‘‘అలాగేలే. నువ్వు టెన్షన్ పడకు’’
పరీక్ష రోజు తెల్లవారి ఆరు గంటలకల్లా

బయలుదేరారు కానీ అనుకున్న టైముకు

బస్సు రాలేదు. టోల్‌గేట్ దగ్గర లేటయింది.

టౌన్‌లో దిగినప్పటికీ ఎనిమిదిన్నర

అయింది. పరీక్షా కేంద్రం ఎక్కడుందో

తెలుసుకుని అక్కడికి చేరుకునేటప్పటికి

తొమ్మిదవుతుంది. కళ్ల ముందే గేట్లు

మూసేస్తున్నారు. స్వప్న పరిగెత్తుకుని

వెళ్లింది. అయినా గేటు వేసేశారు.
‘‘సార్ గేటు తెరవండి సార్. నేను కరెక్ట్

టైముకే వచ్చాను కదా’’ బతిమాలింది.
‘‘నో. నిముషం లేటయినా నో ఎంట్రీ’’

కర్కశంగా అన్నాడు అధికారి.
‘‘సార్ నేను బాగా చదువుతాను. కష్టపడి

చదివాను సార్. గేటు తెరవండి సార్’’

ఏడుస్తూ బతిమాలింది స్వప్న.
‘‘లేదమ్మాయి. రూలంటే రూలే. గేట్

తెరవడం కుదరదు’’.
ముగ్గురు పోలీసులు, ఒక సబ్ ఇన్స్‌పెక్టర్

ఉన్నారు. ఇద్దరు అధికారులు గేట్

దగ్గరున్నారు. ఎవరూ కనికరించలేదు.
‘‘సార్ గేటు తెరవండి సార్. అమ్మాయి బాగా

కష్టపడి చదివింది సార్. ఇంటర్ తొంభై

ఎనిమిది శాతం మార్కులతో పాసయింది

సార్. మీరు అవకాశం ఇవ్వకపోతే డిప్రెస్

అయిపోతుంది సార్’’ సుకుమార్

బతిమాలాడాడు.
‘‘రూల్ అంటే రూలే. ఎట్టి పరిస్థితుల్లో గేటు

తెరవం. నీ దిక్కున్న చోట చెప్పుకో’’

గదిమాడు ఆఫీసర్.
స్వప్న పెద్దగా ఏడుస్తూ కూలబడింది.

అయినా వాళ్లు కనికరించలేదు. సుకుమార్

కోపం నెత్తికెక్కింది.
‘‘మీరు ఆఫీసులకి కరెక్టు టైంకు

వెళుతున్నారా? నిముషం లేటయితే మీకు

ఆబ్సెంట్ వేస్తే ఎలా ఉంటుంది?’’
‘‘నాకే ఎదురు చెబుతావా? ఎవడ్రా నువ్వు?’’
‘‘రూల్ రూల్ అంటూ వేలాడుతున్నావు.

నువ్వు రూల్స్ పాటిస్తున్నావా? పిల్లల

జీవితాలను నాశనం చెయ్యడమే నీ రూలా?’’
‘‘నా ఇష్టం. నీవెవడితో చెప్పుకుంటావో

చెప్పుకో’’
‘‘స్వప్నా పదమ్మా. వీళ్లందరూ పనికి

మాలిన వాళ్లు. బోడి మన రాష్టమ్రే ఉందా?

నిన్ను తమిళనాడులో జాయిన్ చేస్తాను

పద’’ కూతురిని లేవదీశాడు సుకుమార్.
‘‘నాన్నా నేను డిగ్రీలో జాయినవుతాను.

కష్టపడి’’
‘‘వద్దమ్మా నీ కోరిక ఇంజనీరింగ్ చదవాలని.

నేను నిన్ను చదివిస్తాను. ఇతర

రాష్ట్రాలున్నాయి. అక్కడ చదువుదువు

గాని’’
‘‘మీ ఇష్టం నాన్నా’’ కన్నీరు

తుడుచుకుంటూ అంది.
స్వప్నను చెన్నైలోని ఓ మంచి ఇంజనీరింగ్

కాలేజీలో జాయిన్ చేశాడు. కాలం గడిచింది.

స్వప్న ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

పట్టుదలతో ఐఎఎస్‌కు ప్రిపేరవసాగింది.

బాగా కష్టపడి చదివింది. కష్టానికి తగ్గ

ఫలితం దక్కింది. ప్రిలిమ్స్‌లో సెలక్టయింది.

మెయిన్స్‌లో మంచి ర్యాంకు సాధించింది.

ప్రథమ ప్రయత్నంలోనే నాలుగవ ర్యాంక్

సాధించింది.
విషయం తెలుసుకున్న మీడియా ఆమె

ఇంటికి పరిగెత్తింది.
‘‘నిముషం లేటయితే నో ఎంట్రీ అన్న

అధికారులు విద్యార్థుల జీవితాలతో

ఆటలాడుకుంటుంటే మీరేం చేశారు? ఎవరూ

విద్యార్థులకు మద్దతు ఇవ్వలేదు. నేనా రోజు

ఎంత రోదించినా ఎవరూ కనికరించలేదు. ఈ

రోజు నా దగ్గరకు పరిగెత్తుకుని వచ్చారు.

మీకు విద్యార్థుల సమస్యలు అక్కరలేదు.

వాళ్లు పడిన శ్రమ నిముషం లేటుతో

బూడిదలో పోసిన పన్నీరవుతుంటే

మీరందరూ వౌనంగా ఉండిపోయారు. వివిధ

కారణల వల్ల ఒకరిద్దరు లేటయితే వారిని

పరీక్ష రాయనీయకుండా అడ్డుకున్నారు.

నేను దానికి బలయ్యాను. అందుకే నేను

మీకేమీ చెప్పదలచుకోలేదు’’
మీడియా వౌనంగా ఉండిపోయింది.
నిజమే కొన్ని రూల్స్ ఎందుకు పెడతారో

ఎవరికీ అర్ధం కాదు. ఆ రూల్స్ వల్ల కొంత

మంది బలవుతున్నారు. అధికారుల

ఓవరాక్షన్ విద్యార్థులను బలి

తీసుకుంటుంది. ఇకనైనా ఆలోచిస్తారా?

ఎందుకీ పనికి రాని నిబంధన? తెలివైన

అమ్మాయి పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్

చదివింది. ఇలాంటి వారెందరో కదా.

- మల్లారెడ్డి రామకృష్ణ, సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లా. సెల్ : 8985920620.