సాహితి

రైతు ఉద్యమ సాహిత్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం చలనశీలి. చైతన్యశీలి. కాలంలోని మార్పును, భావజాలంలోని మార్పును పరిగణనలోకి తీసుకుంటే, సమాజంలో వచ్చే మార్పును గమనించవచ్చును. ఈ మార్పునే ఆధునికత అంటాము. ఆధునిక భావజాలంతో కూడిన సాహిత్యం ఆధునిక సాహిత్యంగా పేర్కొనబడుతుంది. భాష, భావం, రూపం మూడింటిలోనూ సమూలమైన మార్పును ఆధునికతగా ప్రస్తావిస్తారు. ఆధునిక కవిత్వం సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ, భవిష్యత్తును ఊహిస్తూ, కాలం మార్పును అవగాహనించుకొంటూ మనిషి మనుగడను విభిన్న కోణాల్లో దర్శిస్తూ అనేక వాదాలుగా కవిత్వం వింగడించింది. 1.్భవకవిత్వంగా 2.అభ్యుదయ కవిత్వంగా 3.దిగంబర కవిత్వంగా 4.పైగంబర కవిత్వంగా 5.తిరుగబడు కవిత్వంగా 6.విప్లవ కవిత్వంగా 7.చేతనావర్త కవిత్వంగా 8.అనుభూతి కవిత్వంగా 9.స్ర్తివాద కవిత్వంగా 10.దళిత కవిత్వంగా 11.మైనారిటీ కవిత్వంగా 12.ప్రాంతీయ కవిత్వంగా ఆధునిక కవిత్వం వెలుగులోనికి వచ్చింది. ఎల్లలోకములు ఒక్క యిల్లుగా ప్రేమబంధంతో ప్రపంచాన్ని ఒక్క తాటిమీదుగా నడిపించాలనే విశ్వమానవతావాదం ప్రక్కకు నెట్టబడింది. సాంప్రదాయ ఆధునికవాదాన్ని త్రోసిపుచ్చుతూ మార్కిస్ట్ భావజాలంతో కూడిన భౌతికవాదం శాస్ర్తియత, హేతుబద్ధతతో కూడిన ఆలోచనా విధానాలు వెలుగులోకి వచ్చాయి. అవి కూడా జెండర్ వివక్షత, దళిత మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం జరగడంలేదనే ఆరోపణలతో స్ర్తివాదం, దళిత వాదం, మైనారిటీవాదం వారి వారి కవిత్వాన్ని వారే రాసుకుంటూ, వారి అస్తిత్వం కోసం వారే పోరాడుకుంటూ బహిర్గతమయ్యారు. ప్రాంతీయ వివక్షతను వెలుగులోకి తెచ్చి, ప్రాంతీయ వాదం బయలుదేరింది. ఇన్ని వాదాలు వారి వారి అస్తిత్వాలకోసం, హక్కుల కోసం రక్షణ కోసం గొంతులెత్తాయి. ఆయా వర్గాలు ఏకంగా పోరాటాల్లో పాల్గొన్నాయి. కొన్ని విజయాలను సాధించాయి. ఇప్పటికీ ఎనె్నన్నో విలక్షణమైన వాదాలను వినిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ సాహిత్యంలో కాల పరిణామక్రమంలో వచ్చిన వైవిధ్యాలు వైరుధ్యాలుగా పేర్కొనవచ్చును. ఈ పరిణామక్రమంలో వెలువడిన వాదాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయనడంలో ఎట్టి సందేహమూ లేదు.
దేశానికి వెనె్నముక, అన్నదాత, పస్తులే ఆస్తులుగా భావిస్తూ స్వేదం చిందిస్తూ మట్టిలోంచి బువ్వవిత్తులను పండించే రైతు అస్తిత్వాన్ని హక్కులను పరిరక్షించుకునేందుకు చైతన్యానిచ్చే ‘రైతు ఉద్యమ సాహిత్యం’ అన్ని వాదాల్లాగానే ఒక సాహిత్యవాదంగా ఎందుకు సాహిత్య చరిత్రలో బొమ్మకట్టలేకపోయిందో ఆలోచించాల్సిన తరుణమిది. సాహితీవేత్తలంతా అవగాహనించుకొని కలం పట్టుకోవడమే కాదు, తలలు పట్టుకొని విచారించాల్సిన సందర్భమిది. దీని వెనుక సోకాల్డ్ మేధావులనదగు సాహితీవేత్తల కుట్ర దాగుంది. కుయుక్తులు దాగున్నాయి. రైతు జీవన విధానాల పట్ల, వారి కష్టనష్టాలు కన్నీళ్ల పట్ల మేధావులకు గల తృణీకరణ భావం గోచరమవుతూనే వుంది. రైతు వర్గాలకు అండదండగా నిలబడే సాహిత్యవర్గం ఒకవాదమై బయల్పడలేకున్నారు. రైతులు ఎంత హీనమైన దీన స్థితిలో వున్నా, అప్పుల బాధతో ఆత్మహత్యలై ఉరితాళ్ళకు వేలాడుతున్నా, ఎక్స్‌గ్రేషియాతో ప్రభుత్వం వారి బాధ్యతను దులిపేసుకుపోతున్నా, ‘సీజనల్’ కవిత్వం రాసే కవులే లేదా రచయితలే కనిపిస్తున్నారుగానీ రైతు సాహిత్యాన్ని ఓ వాదంగా, ఉద్యమంగా ప్రవేశపెట్టడానికి పూనుకునే నాధుడే లేడాయె! కవులు రచయితలను సంఘటితపరిచి ఒక సాహిత్య ఉద్యమంగా రైతు కష్టనష్టాలను తీసుకువచ్చే సాహితీవేత్తలు మృగ్యమవుటలోనే సాహిత్య రంగంలో రైతు పాత్రేమిటో, వారి జీవితాల్ని ఎత్తిచూపే సాహిత్యం ఎంతవరకు వస్తుందో తేలిపోతుంది. రైతు మీద వచ్చే కవిత్వమంతా ఉదారవాద కవిత్వంగానే భావించవచ్చు. కంటితుడుపు సాహిత్యంగానే యోచించవచ్చు. రైతు సాహిత్య సంస్థకు బాధ్యులం ‘మేం’ అనే వారే లేరాయె!
రైతును ఇంత బలహీనుణ్ణి చేయడంలో, సాహితీవేత్తల పాత్ర కూడా తక్కువేమీ కాదు. ప్రభుత్వం రైతు వర్గాల్ని, కుల, మత, వర్గాలుగా విడగొడుతూ, పాలకపక్షం రైతు పక్షమనే అపోహల్ని కలిగిస్తూ ఓట్లు దండుకోవడానికి పావులుగా కదుపుతూ, ఓట్ల పబ్బం గడుపుకుంటున్నారు. కుర్చీలెక్కి కులుకుతున్నారు. తరువాత రైతుకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించడంలేదు. ఋణమాఫీలుగాని, విత్తనాలు, ఎరువులు పురుగు మందులు అందించడంలోగాని, సకాలంలో బ్యాంకు రుణాలు ఇప్పించడంలోగాని ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూనే ఉన్నాయి. గద్దె ఎక్కిన రాజకీయ పెద్దలు గద్దె దిగేదాకా వాగ్దానాలు చేస్తూనే ఉంటారు. నెరవేర్చేవి ఒక్కటీ వుండవు.
రైతు ఈతిబాధలతో ‘ఎట్లోకట్ల’ నెట్టుకొచ్చినా, పండిన పంటకు గిట్టుబాటు ధరలు లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి, సేద్యం జూదంలో రైతు ధన, మాన, ప్రాణాలనే కోల్పోతున్నాడు. అయినా సాహితీవేత్తలు రైతులమీద ఆటవిడుపు సాహిత్యానే్న సృష్టిస్తున్నారు కాని రైతుల పక్షాన ఒక వర్గంగా కవులు తయారై వారి పూర్తి శక్తి యుక్తులను సాహిత్య రూపంలో అంకితం చేయడం లేదనేది యధార్థం. స్ర్తివాదులుగాని, దళిత వాదులుగాని, మైనారిటీ వాదులుగాని ఎత్తిచూపే సాహిత్యంలో ఏ ఒక్కరు రైతులులాగా ఆత్మహత్యలకు పాల్పడిన దాఖలాలు లేవు. వారి అస్తిత్వం కోసమే వారి పోరాటమంతా. రైతులు, నేత పనివాళ్ళు, బతుకీడ్వలేక దుర్భర జీవితం గడపలేక ఆత్మహత్యలైపోతున్నారు. వీరి ఆక్రందనల మీద సామాన్యుల కవిత్వం వస్తుందేగాని రైతు ఉద్యమ సాహిత్యం రూపంలో, కవుల ఐక్యవేదిక ఏర్పడి రైతు ఉద్యమ సాహిత్యం రావడంలేదు. సాహితీవేత్తలు ఐక్యరూపంలో రైతులను గూర్చి మాట్లాడే విధానమే మృగ్యమైపోతుందనే చెప్పొచ్చు. ఆత్మగౌరవం, చైతన్యం, జాతీయ భావ చైతన్యం, రాజకీయ చైతన్యం, జాతి ఉద్ధరణ ప్రధానాంశాలుగా వివిధ వాదాల కవిత్వం సాగుతూనే వుంది. రైతుకు ఆత్మస్థైర్యాన్నిచ్చే వాదం ఏ వొక్కటిలేదు.
‘రైతులు’ అంటే అగ్రకులస్తులయిన భూస్వామ్య వర్గాలు, పెట్టుబడిదారి వర్గాలు గుర్తుకువస్తారు. ఇది ఇవాళ యథార్థం కాదు. రైతుల్లో అగ్రకులజులతోపాటు, మైనారిటీ వర్గాలు, దళిత వర్గాలు, మహిళా వర్గాలు రైతులుగా చలామణి అవుతున్నారు. అగ్ర కులస్తులైన భూస్వామిక, పెట్టుబడిదారీ వర్గాలు పల్లెల్ని విడిచి భూములమ్ముకొని పట్టణాల్లో కార్పొరేట్ వ్యాపారులుగానో, పారిశ్రామిక వేత్తలుగానో పెట్టుబడిదారీ వర్గాలుగా స్థిరపడిపోయారు. రాజకీయాల్లో పాలకపక్షం కొమ్ము కాస్తూ వారి పబ్బం గడుపుకుంటున్నారు. కనుక ఈనాడు పల్లెల్లో వ్యవసాయమే ఆధారంగా బతికే అగ్రకులస్తులు, ఆర్థికంగా దిగజారిపోతూ పేదరికంలోకి జారిపోతూ నానా బాధలు పడుతున్నారు. నేడు ‘అగ్రకులం’ అనే పేరు వీరికి శాపంగా మారింది. పిల్లల్ని సరైన చదువులు చదివించుకునే స్థితిలో కూడా లేని స్థితిని మనం గమనించవచ్చును. అన్ని కులాలకు సంబంధించిన రైతులు ఒకే బోటులో పయనిస్తున్నారు. అదే కడు హీనమైన ఆర్థిక దుస్థితి. అయినా కుల మతాల కుమ్ములాటలవలన కాని, మెజరాటీ రైతులు పవర్ పాలిటిక్స్‌లో భాగస్వాములుగా ఉంటూ రాజకీయ నాయకుల కొమ్ము కాస్తూ, ఊరి తగాదాల్లో గ్రూపులుగా విడిపోవడంవలన రైతులు ఐక్యత సాధించలేకపోతున్నారు.
రైతు ఈతిబాధలనుండి ప్రపంచీకరణ విషమ సంస్కృతి కోరలనుండి బయటపడాలంటే రైతులు ఐక్యం కావాలి. సంఘటితశక్తిగా ఉద్యమాలు నడపాలి. వ్యక్తిగత స్వార్థాలనుంచి రైతు బయటపడి పాలక పక్షాన్ని రైతుల ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేసే స్థితికి ఎదగాలి. రైతు సంఘటితం కావడానికి, సమస్యలు పరిష్కారం చేసుకునే ఉద్యమం రూపుదిద్దుకోవడానికి, రైతులు చైతన్యవంతం కావడానికి రైతు సాహిత్య ఉద్యమాలకు ఊతమిచ్చే సంఘాలు ఏర్పడాలి. కవులు / రచయితలు ఎప్పటికప్పుడు రైతు సమస్యలను ఎత్తిచూపుతూ రైతు కడగండ్లను, కన్నీళ్ళను, దైన్యాన్ని ప్రభుత్వ నిరాదరణను సాహిత్యమై వర్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రైతు సాధకబాధల్ని ఏకరువుపెడుతూ కవిత్వం రాసిన కవులు గతంలో ఉన్నారు. ఇవాళ ఉన్నారు. కాని దళిత కవులు, స్ర్తివాద కవయిత్రులు, మైనారిటీవాద కవులులాగా, రైతు ఉద్యమవాద సాహిత్యకారులు లేరనే చెప్పొచ్చు. రైతు ఉద్యమవాద సాహిత్యం వెలుగు చూడాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ విషయంలో రైతు జీవన విధానాల్ని, శ్రమైక శక్తిని గుర్తిస్తూ, పాలకపక్షం చేసే నమ్మకద్రోహాన్ని ఎండగట్టే సాహిత్యాన్ని ఒక ఉద్యమ సాహిత్యంగా తీసుకురావాల్సిన అవసరం ఈనాటి రైతు కవిత్వాన్ని ప్రేమించే కవులు /రచయితలమీద వుంది.
ఈనాడు ఆధునిక కవిత్వం ఎన్నో వాదాలుగా విడివడి, వారి వారి అస్తిత్వాల్ని కాపాడుకుంటూ ముందుకు పోతోంది. ఇంకా మన సాహిత్యం పాశ్చాత్యత్వ సాహిత్య ప్రభావంవలన ఆధునికానంతర వాదంలోకి అడుగుపెడుతుంది. వస్తుశూన్యతలో శిల్ప సౌందర్యాన్ని పెంచుకుంటూ కవిత్వం వస్తుంది. ఇప్పటికైనా మట్టి పువ్వులైన రైతుల కష్టనష్టాలను గ్రహించి అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలై పోతున్న సందర్భాల్ని వీక్షించి కవులు /రచయితలు రైతు సాహిత్యవేత్తలుగా సంఘటితమై కలాలు కదపాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలుగులో నేడు రాస్తున్న గతంలో రాసిన కవులు / రచయితలు రైతును గూర్చి వారి వారి రచనల్లో గొప్పగానే రాసి వున్నారు, రాస్తున్నారు. కాని రైతు సాహిత్యవేత్తలుగా ఒక రచయితల సంఘం ఆవిర్భవించాలి. ఇది ప్రతి జిల్లాలోను శాఖలు కలిగి వుండాలి. రైతు సాహిత్య పత్రిక ఒకదాన్ని ఏర్పాటుచేసుకోవాలి. అందులో రైతును చైతన్యపరిచే సాహిత్యాన్ని ప్రచురించాల్సి వుంది. అన్నదాత దిక్కులేనివాడు కాకూడదు. అన్నదాతకు అండగా సాహితీవేత్తలు నిలబడగలగాలి. రైతులకు వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి గొంతు ఇవ్వాలి. కవులు /రచయితలు స్పందించి రైతు సాహిత్య సముతుల్ని ఏర్పాటుచేసుకోవడానికి ముందుకు వస్తారని ఆశిద్దాం.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి 9848774243